సూరజ్ సంతోష్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సూరజ్ సంతోష్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

సోమవారం, మే 27, 2019

ఎంత కొత్తగుంది ప్రేమలోన...

మౌనమే ఇష్టం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మౌనమే ఇష్టం (2019)
సంగీతం : వివేక్ మహదేవ 
సాహిత్యం : పూర్ణచారి
గానం : సూరజ్ సంతోష్, నయన నాయర్

ఎంత కొత్తగుంది ప్రేమలోన
ఏమయిందో నాకు ఇంతలోన
ఎందుకో ఈ వేళ ఉన్నదే ఎదోలా
ఎంత కొత్తగుంది ప్రేమలోన
ఏమయిందో నాకు ఇంతలోన
ఎందుకో ఈ వేళ ఉన్నదే ఎదోలా
ఎంత కొత్తగుంది ప్రేమలోన
ఏమయిందో నాకు ఇంతలోన

తీపి కబురేదో చెవిని తాకేలా
లోపలేమూలో ఊపిరాపేలా
చల్లగాలుల్లో శ్వాసై ఇలా
నన్ను తాకేసి వెళ్తావలా
కన్ను దాటేసి నువ్వై కలా
నిదురలో మళ్ళీ పుడతావేలా
రాయభారాలు నీ చూపులా
రాయలేనంతగా
వేల రంగుల్లో హరివిల్లులా
అల్లి నలువైపులా
నీవునాకంటూ తోడు నీవుంటు
నేను నీ వెంట సాగాలి నీలో సగమై

మనసులో మాట మోమాటమై
బయటపడలేని ఆరాటమై
పెదవిలో నవ్వు నీకోసమై
ఏదలయే నీకు ఆవాసమై
నిన్నలో మొన్నలో నేనిలా లేనుగా
నువ్వని నేనని వేరుగా
ఎన్నడూ చూడని నన్ను నే చూడగా
మాటలే మౌనమై పోయేగా
దారులే మారి నీ వైపుగా
తారు మారాయిలే ఇకా
అడుగులే బరువులే అవ్వగా
చేరువయ్యాగ ఏం తోచకా
నేననే భావనే నీవుగా
మారే నా ప్రేమగా
ఎన్నడూ లేనిదే కొత్తగా
నీదే ఆలోచనా
నీకు నా దూరం
నువ్వు నా తీరం
ఏకమవ్వాలి మనమిద్దరం
 
 

శనివారం, మార్చి 30, 2019

అల్విద నా కెహనా...

పాఠశాల చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పాఠశాల  (2014)
సంగీతం : రాహుల్ రాజ్
సాహిత్యం : శ్రీమణి
గానం : సూరజ్ సంతోష్, ఎల్విస్ డాన్ రాజ

ఐ మిస్ యూ గుడ్ బై
అల్విద న కెహనా
స్నేహానికి లేదే ఫేర్వెల్లే
భూమ్యాకర్షణలా ఆ ఆక్సీజన్ లా
ఈ వర్ల్డ్ కి బేసే ఫ్రెండే లే
ఏడొందల కోట్లా జనులందరిలోనా
మనకంటూ దొరికేదెపుడూ
నలుగురు ఫ్రెండ్సేరా
అరె ఎక్కడో ఉన్నా ఆ ఎవరెస్ట్ కన్నా
నీ పక్కనే ఉండే వండర్ మరి నీ ఫ్రెండేరా 

ఫేర్వెల్ అంటే ఫ్రెండ్శిప్పే ముగియదూ
ఫ్రెండ్ కి అర్ధం ఫేస్బుక్కే చెప్పదూ
చెలిమికి మీనింగ్ డిక్షనరి లో ఉండదూ
ఈ ఎమోషన్ కో భాషంటూ లేదూ


కాలేజ్ క్యాంపస్ దోస్తీకే అడ్డా
ప్రతి ఫ్రెండే దొరికే చోటేలే
నువ్వు పాసవకున్నా
లవ్ లో పడకున్నా
ఫ్రేండ్షిప్ లో పడటం ఖాయంలే
ఏ రిచ్ పూరు తేడాలే లేని
ఫెల్లోషిప్ అంటే లోకంలో ఫ్రెండ్శిప్
ఏ క్లాసు మాసు డిఫరెన్సే లేని
నీ తోడుండే వాడే ఫ్రెండంటే

ఫేర్వెల్ అంటే ఫ్రెండ్శిప్పే ముగియదూ
ఫ్రెండ్ కి అర్ధం సెల్ఫోనే చెప్పదూ


ఏ చిరునవ్వైనా నువ్వే చిరునామా
నా ప్రతి సంతోషం నువ్వే నేస్తమా
నువ్వు కట్టిన బ్యాండూ
మన చెలిమి కి బాండూ
హృదయంలో ఎపుడూ ఉంటవమ్మ
ఈ భూగోళంలో నువ్వెక్కడ ఉన్నా
మన గురుతులతోటీ నీకై ఎదురే చూస్తుంటా
ఏదో ఒక చోటా కలిసే మన బాటా
ఏ కాలం కైనా నీడై స్నేహం వీడదురా..

ఫేర్వెల్ ఐతే ఫ్రెండ్శిప్పే ముగియదూ
ఆటోగ్రాఫే మన సెండాఫ్ అవ్వదూ
ఈ దోస్తానా కాలేజ్ డేస్ లా
అరె ఎప్పటికీ మెమొరీలా ఐపోదూ 
 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.