కందికొండ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కందికొండ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శుక్రవారం, జులై 10, 2020

గలగల పారుతున్న గోదారిలా...

మహేష్ బాబు కెరీర్ ను మలుపు తిప్పిన "పోకిరి" సినిమా కోసం కృష్ణ గారి "గౌరి" చిత్రంలోని "గలగల పారుతున్న గోదారిలా" పాటను రీమిక్స్ చేశారు. ఐతే ఒరిజినల్ లోని పల్లవి ట్యూన్ ను మరియూ పాట మొదటి లైన్ ను మాత్రమే తీసుకుని సందర్బంతో సహా సంగీత సాహిత్యాలను మార్చేసిన ఈ రీమిక్స్ పాట దదాపు ఒరిజినల్ సాంగ్ అనే చెప్పుకోవచ్చేమో. ఈ సూపర్ హిట్ సాంగ్ ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : పోకిరి (2006)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : కందికొండ  
గానం : నిహాల్  

గలగల పారుతున్న గోదారిలా
జలజల జారుతుంటె కన్నీరలా
గలగల పారుతున్న గోదారిలా
జలజల జారుతుంటె కన్నీరలా
నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా
నాకెందుకో ఉన్నదీ హాయిగా
నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా
నాకెందుకో ఉన్నదీ హాయిగా

గలగల పారుతున్న గోదారిలా
జలజల జారుతుంటె కన్నీరలా
గలగల పారుతున్న గోదారిలా

వయ్యారి వానలా వాన నీటిలా ధారగా
వర్షించి నేరుగా వాలినావిలా నా పైనా
తెన్నేటి తారలా వేచి నువ్విలా చాటుగా
పొమ్మన్న పోవెలా చేరుతావిలా నా లోనా

ఉవ్వోహువోహా
ఈ అల్లరి 
ఉవ్వోహువోహా 
బాగున్నది
ఉవ్వోహువోహా

గలగల పారుతున్న గోదారిలా
గలగల పారుతున్న గోదారిలా
జలజల జారుతుంటె కన్నీరలా
జలజల జారుతుంటె కన్నీరలా
గలగల పారుతున్న గోదారిలా

Gal I'm watching your booty
Coz you're making me to feel so naughty
Let's go out tonight and party
Ohu vohu vohu vohu vohu voho

Gal I'm watching your beauty
To love you forever is my duty
So feel it you're my baby
Ohu vohu vohu vohu vohu voho

చామంతి రూపమా తాళలేవుమా రాకుమా
ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా
హిందోళ రాగమా మేళ తాళమా గీతమా
కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా

ఉవ్వోహువోహా
ఈ లాహిరీ
ఉవ్వోహువోహా 
నీకే మరీ
ఉవ్వోహువోహా

గలగల పారుతున్న గోదారిలా
గలగల పారుతున్న గోదారిలా
జలజల జారుతుంటె కన్నీరలా
జలజల జారుతుంటె కన్నీరలా
గలగల పారుతున్న గోదారిలా

~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఇక పల్లెసీమల అందాలను వర్ణిస్తూ సాగే "గౌరి" చిత్రంలోని ఈ పాట ఒరిజినల్ వర్షన్ ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ ఒరిజినల్ పాట కూడా "లిసన్ టు ద పోరింగ్ రెయిన్" అనే ఇంగ్లీష్ పాటకు ఫ్రీమేక్ వర్షన్ అని ఓ టాక్ ఆ పాట ఇక్కడ వినవచ్చు. 


చిత్రం : గౌరి (1974)
సంగీతం : సత్యం
సాహిత్యం : దాశరథి
గానం : బాలు

గలగల పారుతున్న గోదారిలా
రెపరెపలాడుతున్న తెరచాపలా
ఈ చల్లనీ గాలిలా.. ఆ పచ్చనీ పైరులా
ఈ జీవితం సాగనీ.. హాయిగా..  హే..
గలగల పారుతున్న గోదారిలా 

అందాల పందిరి వేసే ఈ తోటలూ 
ఆనింగి అంచులు చేరే ఆ బాటలూ
నాగలి పట్టే రైతులూ.. 
కడవలు మోసే కన్నెలూ
బంగరు పంటల సీమలూ.. 
చూడరా..  హే..  
          
గలగల పారుతున్న గోదారిలా
రెపరెపలాడుతున్న తెరచాపలా
ఈ చల్లనీ గాలిలా.. ఆ పచ్చనీ పైరులా
ఈ జీవితం సాగనీ.. హాయిగా..  హే..
గలగల పారుతున్న గోదారిలా 

దేశానికాయువు పోసే ఈ పల్లెలూ 
చల్లంగ ఉండిననాడే సౌభాగ్యమూ
సత్యం ధర్మం నిలుపుటే 
న్యాయం కోసం పోరుటే
పేదల సేవలు చేయుటే 
జీవితం.. హే.. 

గలగల పారుతున్న గోదారిలా
రెపరెపలాడుతున్న తెరచాపలా
ఈ చల్లనీ గాలిలా.. ఆ పచ్చనీ పైరులా
ఈ జీవితం సాగనీ.. హాయిగా..  హే..
గలగల పారుతున్న గోదారిలా 
  

బుధవారం, మే 30, 2018

ఏదో జరిగే ఏదో జరిగే...

నీదీ నాదీ ఒకే కథ చిత్రంలోని ఒక మంచి మెలోడీ ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నీదీ నాదీ ఒకే కథ (2018)
సంగీతం : సురేష్ బొబ్బిలి
సాహిత్యం : కందికొండ
గానం : చిన్మయి

ఏదో జరిగే ఏదో జరిగే
ఏదో తెలియనిది జరుగుతోందీ
ఎంటో కలిగే ఎంటో కలిగే
ఎప్పుడు ఎరుగనిది కలుగుతోందీ
మండే ఎండల్లో చలి వేస్తోందే
చల్లని చలిలోన చమటడుతోందే
మదిలో ఓ వర్షం మొదలయ్యిందే
ప్రాణం పోయెట్టుందే

తీయని గాయం చేసెను ప్రాయం
బిగ్గరగా నన్ను బిగిసిన ప్రణయం
ఏంటీ మొహం వలపుల తాపం
సంద్రం తాగిన తీరని దాహం

ఏదో జరిగే ఏదో జరిగే
ఏదో తెలియనిది జరుగుతోందే
ఎంటో కలిగే ఎంటో కలిగే
ఎప్పుడు ఎరుగనిది కలుగుతోందే

కలలే చేరే కనుల పక్షుల గుంపులుగా
అలలై నన్ను ముంచే లక్షల ఊహాలిలా
గుండె విరహం తో ఓ మండుతువుందే
తనువేమో ఓ తోడు కోరుతువుందే
అతడే కావాలంటూ అడుగుతువుందే
హృదయం ఈ రోజే...
ఏమిటి చిత్రం ఒకటే ఆత్రం
నాతో నాకయ్యెను చిలిపిగా యుద్దం
నిన్నటి శాంతం అయ్యెను అంతం
నాలో రేగేను చిరు భూకంపం

ఏదో జరిగే ఏదో జరిగే
ఏదో తెలియనిది జరుగుతోందే
ఎంటో కలిగే ఎంటో కలిగే
ఎప్పుడు ఎరుగనిది కలుగుతోందే

కల్లోలం నా ఆనందం ఒకటై ఎగసిందే
కన్నీరు పన్నీరు వరదై ముంచిందే
నా దేహం నాదసలు కానట్టుందే
నిన్నల్లే ఈ రోజు లేనట్టుందే
నేనసలు నేనేనా అనిపిస్తోందే
మైకం కమ్మేసిందే
నిమిషం నిమిషం తీయని నరకం
బాధలో చూస్తున్న నూతన స్వర్గం
మధురం మధురం మరిగెను రుధిరం
సన్నగా వణికెను ఎర్రని అధరం

ఏదో జరిగే ఏదో జరిగే
ఏదో తెలియనిది జరుగుతోందే
ఎంటో కలిగే ఎంటో కలిగే
ఎప్పుడు ఎరుగనిది కలుగుతోందే

శనివారం, జులై 30, 2016

మనసా నువ్వుండే చోటే...

మున్నా చిత్రం కోసం హరీస్ జైరాజ్ స్వరపరచిన ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : మున్నా (2007)
సంగీతం : హారిస్ జయరాజ్
రచన : కందికొండ
గానం : సాధనా సర్గం , నరేష్ అయ్యర్, క్రిష్ , హరిచరణ్

మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే.. నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా
మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే.. నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

ఓ సోనా వెన్నెల సోనా..నేనంతా నువ్వయ్యానా
నీ రూపూ రేఖల్లోనా .. నేనుండీ వెలుగైపోనా
ఓ సోనా వెన్నెల సోనా.... నీ వాలే కన్నుల్లోనా
నా చిత్రం చిత్రించెయినా..కనుపాపైపోనా

నీవే తోడని నిజంగా..నీలో చేరితి క్రమంగా
నీవుంటే ఒక యుగమే..అయిపోయే ఇక క్షణమే
తెలుసా తెలుసా ఇది తెలుసా
మార్చేసావే నా ఈ వరసా
నువ్వు మార్చేసావే నా ఈ వరసా

ఓ సోనా వెన్నెల సోనా..రేపావే అల్లరి చానా
చెక్కిల్లో చుక్కైపోనా..చూపుల్తో చుట్టేసెయ్ నా
ఓ సోనా వెన్నెల సోనా..ముంగిట్లో ముగ్గైరానా
ముద్దుల్తో ముంచేసెయ్ నా..కౌగిలికే రానా

మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే.. నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

కూసే కోయిల స్వయంగా..వాలే వాకిట వరంగా
నీ ఊసే అది తెలిపే..మౌనంగా మది మురిసే
కలిసా కలిసా నీతో కలిసా
నీలో నిండీ అన్నీ మరిచా
హో నీలో నిండీ అన్నీ మరిచా

ఓ సోనా వెన్నెల సోనా..నీవైపే వచ్చానమ్మా
నీ ఊహే కన్నానమ్మా..నా ఊసే పంపానమ్మా
ఓ సోనా వెన్నెల సోనా..నీ గుండె చప్పుల్లోనా
నా ప్రాణం నింపానమ్మా....నిను చేరానమ్మా !

మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా
ఓ మనసే.. నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

ఓ సోనా వెన్నెల సోనా..నేనంతా నువ్వయ్యానా
ఓ సోనా వెన్నెల సోనా..నీ వాలే కన్నుల్లోనా


శుక్రవారం, నవంబర్ 21, 2014

చెన్నై చంద్రమా...

చక్రి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఒక చక్కని పాట ఈరోజు మీకోసం.. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి (2003)
సంగీతం : చక్రి
సాహిత్యం : కందికొండ
గానం : చక్రి

ఆ.. ఆ.. ఆ.. ఆ..

చెన్నై చంద్రమా మనసే చేజారే
చెన్నై చంద్రమా నీలోన చేరే
తెగించి తరలిపోతోంది హృదయం
కోరే నీ చెలిమి

చెన్నై చంద్రమా..మనసే చేజారే
చెన్నై చంద్రమా..మనసే చేజారే
చెన్నై చంద్రమా నీలోన చేరే
తెగించి తరలిపోతోంది హృదయం
కోరే నీ చెలిమి

చెన్నై చంద్రమా..మనసే చేజారే

ప్రియా ప్రేమతో.. ఆ..ఆ..
ప్రియా ప్రేమతో పలికే పూవనం
ప్రియా ప్రేమతో పలికే పూవనం
పరవశంగా ముద్దాడనీ ఈ క్షణం
చెలి చేయని పెదవి సంతకం
ఆ.. చెలి చేయని పెదవి సంతకం
అధరపు అంచున తీపి జ్ఞాపకం

చెన్నై చంద్రమా.. మరపబ పబబబ్బబ..

సఖీ చేరుమా.. ఆ..ఆ..
సఖీ చేరుమా చిలిపితనమా
సఖీ చేరుమా చిలిపితనమా
సోగ కనులు చంపేయకే ప్రేమా
ఎదే అమృతం నీకే అర్పితం
ఎదే అమృతం నీకే అర్పితం
గుండెల నిండుగ పొంగెను ప్రణయం

చెన్నై చంద్రమా మనసే చేజారే
చెన్నై చంద్రమా నీలోన చేరే
తెగించి తరలిపోతోంది హృదయం
కోరే నీ చెలిమి

చెన్నై చంద్రమా..మనసే చేజారే


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.