బుధవారం, మే 30, 2018

ఏదో జరిగే ఏదో జరిగే...

నీదీ నాదీ ఒకే కథ చిత్రంలోని ఒక మంచి మెలోడీ ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నీదీ నాదీ ఒకే కథ (2018)
సంగీతం : సురేష్ బొబ్బిలి
సాహిత్యం : కందికొండ
గానం : చిన్మయి

ఏదో జరిగే ఏదో జరిగే
ఏదో తెలియనిది జరుగుతోందీ
ఎంటో కలిగే ఎంటో కలిగే
ఎప్పుడు ఎరుగనిది కలుగుతోందీ
మండే ఎండల్లో చలి వేస్తోందే
చల్లని చలిలోన చమటడుతోందే
మదిలో ఓ వర్షం మొదలయ్యిందే
ప్రాణం పోయెట్టుందే

తీయని గాయం చేసెను ప్రాయం
బిగ్గరగా నన్ను బిగిసిన ప్రణయం
ఏంటీ మొహం వలపుల తాపం
సంద్రం తాగిన తీరని దాహం

ఏదో జరిగే ఏదో జరిగే
ఏదో తెలియనిది జరుగుతోందే
ఎంటో కలిగే ఎంటో కలిగే
ఎప్పుడు ఎరుగనిది కలుగుతోందే

కలలే చేరే కనుల పక్షుల గుంపులుగా
అలలై నన్ను ముంచే లక్షల ఊహాలిలా
గుండె విరహం తో ఓ మండుతువుందే
తనువేమో ఓ తోడు కోరుతువుందే
అతడే కావాలంటూ అడుగుతువుందే
హృదయం ఈ రోజే...
ఏమిటి చిత్రం ఒకటే ఆత్రం
నాతో నాకయ్యెను చిలిపిగా యుద్దం
నిన్నటి శాంతం అయ్యెను అంతం
నాలో రేగేను చిరు భూకంపం

ఏదో జరిగే ఏదో జరిగే
ఏదో తెలియనిది జరుగుతోందే
ఎంటో కలిగే ఎంటో కలిగే
ఎప్పుడు ఎరుగనిది కలుగుతోందే

కల్లోలం నా ఆనందం ఒకటై ఎగసిందే
కన్నీరు పన్నీరు వరదై ముంచిందే
నా దేహం నాదసలు కానట్టుందే
నిన్నల్లే ఈ రోజు లేనట్టుందే
నేనసలు నేనేనా అనిపిస్తోందే
మైకం కమ్మేసిందే
నిమిషం నిమిషం తీయని నరకం
బాధలో చూస్తున్న నూతన స్వర్గం
మధురం మధురం మరిగెను రుధిరం
సన్నగా వణికెను ఎర్రని అధరం

ఏదో జరిగే ఏదో జరిగే
ఏదో తెలియనిది జరుగుతోందే
ఎంటో కలిగే ఎంటో కలిగే
ఎప్పుడు ఎరుగనిది కలుగుతోందే

2 comments:

యెప్పుడూ వినలేదీ పాట..బావుంది..

సినిమా కూడా బావుందండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతిగారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.