ఆదివారం, మే 20, 2018

మెరిసే మెరిసే మెరిసే...

హలో చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : హలో (2017)
సంగీతం : అనూప్ రూబెన్స్
సాహిత్యం : వనమాలి, శ్రేష్ట
గానం : హరిచరణ్, శ్రీనిధి వెంకటేష్, 
శృతి రంజని

మెరిసే మెరిసే మెరిసే
ఆ కన్నుల్లో ఎదో మెరిసే
నా మనసే మురిసే మురిసే
ఆ సంగతి నాకు తెలుసే

కురిసే కురిసే కురిసే
నవ్వుల్లో వెన్నెల కురిసే
ఇది కొత్తగా మారిన వరసే
ఆ సంగతి నాకు తెలుసేయి

సన్నాయి మోగేనా
అమ్మాయి గుండెలో
ఈ రేయి ఆశలే రేగేలా
రావోయి అల్లరి అబ్బాయి
అందుకో నా చేయి ఒక్కటై
సందడి చేసేలా

దినక్ నక్ ధిరన
తనక్ దిన దీనక్ నక్ ధిరన
ఓ దినక్ నక్ ధిరన
జోరుసె డోల్ బాజావో న

దినక్ నక్ ధిరన
తనక్ దిన దీనక్ నక్ ధిరన
ఓ దినక్ నక్ ధిరన
జోరుసె డోల్ బాజావో న

రెండు గుండెల చప్పుడు ఒక్కటే
మూడు ముళ్ల ముచ్చట కదా
ఈడు జోడు కలిసి
తోడు నీడై సాగగా

ఏడు జన్మల బంధమిదేలే
ఏడు అడుగులు వేస్తూ ఉంటె
చిన్న పెద్ద అంతా
సంబరాలే చేయరా

ఆనందం పువ్వుల మాలలుగా
ఇద్దరిని అల్లేస్తూ హాయిలో తేల్చేయగా

బంధాలే ఈ ప్రేమ జంటనిలా
పెళ్ళిలో బంధించే
కమ్మని కన్నుల పండుగగా

దినక్ నక్ ధిరన
తనక్ దిన దీనక్ నక్ ధిరన
ఓ దినక్ నక్ ధిరన
జోరుసె డోల్ బాజావో న


అరెయ్ షాదీ యాల వచ్చేరు
షురూ గిట్ల పరేషానీ
సమాజ్ అయితే లేదా
చెప్తా చూడు ఓ కహాని
పెండ్లి పిడ్లాగాడు ముందు
కింగ్ లెక్క తిరుగుతుండే
పెండ్లి అయ్యినంక ఆమె
కొంగు వట్టి ఊగూడంతే

ఓయ్ అంతే, ఓయ్ అంతే,
ఆమె మాటలాడదంటాది
ఎయ్యకుంటే సోప్
అందగత్తెలందరున్న
నువ్వే బేబీ తోపు అంటూ
గ్యాప్ లెక పొగడకుంటే
రోజు గిట్ల గడవదంతే

అంతే, అంతే

ఆమె గొప్పలెన్నో జెప్పనీకి
తిప్పలెన్నో బెట్టానంటే
సప్పగున్న లైఫ్ లోన
అప్పు లొల్లితప్పదంతే
అడిగినన్ని చీరలింకా
నువ్వు తెచ్చి బెట్టకుంటే
మాట నీది ఇంటిలోనే
నడవనంటే నడవదంతే

అంతే, అంతే

మెరిసే మెరిసే మెరిసే
ఆ కన్నుల్లో ఎదో మెరిసే
నా మనసే మురిసే మురిసే
ఆ సంగతి నాకు తెలుసే

దినక్ నక్ ధిరన
తనక్ దిన దీనక్ నక్ ధిరన
ఓ దినక్ నక్ ధిరన
జోరుసె డోల్ బాజావో న
దినక్ నక్ ధిరన
తనక్ దిన దీనక్ నక్ ధిరన
ఓ దినక్ నక్ ధిరన
జోరుసె డోల్ బాజావో న 


2 comments:

కళ్ళు మూసుకుని వింటే మంచి పాట..

హహహహ థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.