శనివారం, మే 12, 2018

నిన్నిలా నిన్నిలా చూశానే...

తొలిప్రేమ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం :‌ తొలిప్రేమ (2018)
‌సం‌గీతం :‌ ఎస్.ఎస్.థమన్
సాహిత్యం :‌ శ్రీమణి
‌గానం :‌ అర్మాన్ మాలిక్, ఎస్.ఎస్.థమన్

నిన్నిలా నిన్నిలా చూశానే..
క‌ళ్ళ‌ల్లో క‌ళ్ళ‌ల్లో దాచానే..
రెప్ప‌లే వేయ‌నంతగా క‌నుల‌పండ‌గే..

నిన్నిలా నిన్నిలా చూశానే..
అడుగులే త‌డ‌బ‌డే నీ వ‌ల్లే..
గుండెలో విన‌ప‌డిందిగా ప్రేమ చ‌ప్పుడే..
నిను చేరిపోయే నా ప్రాణం..
కోరెనేమో నిన్నే ఈ హృద‌యం..
నా ముందుందే అందం.. నాలో ఆనందం..
న‌న్ను నేనే మ‌ర‌చిపోయేలా ఈ క్ష‌ణం..

ఈ వ‌ర్షానికి స్ప‌ర్శుంటే నీ మ‌న‌సే తాకేనుగా..
ఈ ఎద‌లో నీ పేరే ప‌లికేలే ఇవాళే ఇలా

ఈ వ‌ర్షానికి స్ప‌ర్శుంటే నీ మ‌న‌సే తాకేనుగా..
ఈ ఎద‌లో నీ పేరే ప‌లికేలే ఇవాళే ఇలా


తొలి తొలి ప్రేమే దాచేయకలా..
చిరు చిరు నవ్వే ఆపేయకిలా..
చలి చలి గాలే వీచేంతలా
మరి మరి నన్నే చేరేంతలా
నిన్ను నీ నుంచి నువ్వు బైటకు రానివ్వుమ
మబ్బు తెరలు తెంచుకున్న జాబిలమ్మలా..

ఈ వ‌ర్షానికి స్ప‌ర్శుంటే నీ మ‌న‌సే తాకేనుగా..
ఈ ఎద‌లో నీ పేరే ప‌లికేలే ఇవాళే ఇలా
ఈ వ‌ర్షానికి స్ప‌ర్శుంటే నీ మ‌న‌సే తాకేనుగా..
ఈ ఎద‌లో నీ పేరే ప‌లికేలే ఇవాళే ఇలా 


3 comments:

మూవీ, పాట రెండూ బావున్నాయి..



ఈ వర్షమ్మున కే స్ప
ర్శే వుంటే నీమనసును రేయింబవలున్
కావాలని కోరేదే
మో వదిలేందుకిక తాను మొండిబడేనో !


జిలేబి

అవును శాంతి గారు సినిమా కూడా చాలా బావుంటుంది. థాంక్స్ ఫర్ ద కామెంట్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.