మహానటి చిత్రంలోని ఒక చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఫస్ట్ లుక్ లో మ్మహ్హాన్నట్టీ అని గగ్గోలు పెట్టి బెదరగొట్టినా దానికి వచ్చిన ఫీడ్ బాక్ వల్లనేమో బాగా టోన్ డౌన్ చేసి మెలోడీ బాట పట్టినట్లున్నారు ఈ చిత్ర బృందం. ఇప్పటి వరకూ విడుదలైన రెండు పాటలూ బావున్నాయ్. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ పాట పూర్తి లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు
చిత్రం : మహానటి (2018)
సంగీతం : మిక్కీ జె మేయర్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : అనురాగ్ కులకర్ణి, శ్రేయా ఘోషల్
మూగ మనసులు
మూగ మనసులు
మన్ను మిన్ను కలుసుకున్న సీమలో
నన్ను నిన్ను కలుపుతున్న ప్రేమలో
జగతి అంటే మనమే అన్న మాయలో
సమయం అన్న జాడ లేని హాయిలో
ఆయువే గేయమై స్వాగతించగా
తరలి రావటే చైత్రమా
కుహు కుహు కుహు
స్వరాల ఊయలూగుతున్న కోయిలైన వేళ
మూగ మనసులు
మూగ మనసులు
సంగీతం : మిక్కీ జె మేయర్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : అనురాగ్ కులకర్ణి, శ్రేయా ఘోషల్
మూగ మనసులు
మూగ మనసులు
మన్ను మిన్ను కలుసుకున్న సీమలో
నన్ను నిన్ను కలుపుతున్న ప్రేమలో
జగతి అంటే మనమే అన్న మాయలో
సమయం అన్న జాడ లేని హాయిలో
ఆయువే గేయమై స్వాగతించగా
తరలి రావటే చైత్రమా
కుహు కుహు కుహు
స్వరాల ఊయలూగుతున్న కోయిలైన వేళ
మూగ మనసులు
మూగ మనసులు
ఊహల రూపమా ఊపిరి దీపమా
నా చిరునవ్వుల వరమా
గాలి సరాగమా పూల పరాగమా
నా గత జన్మల రుణమా
ఊసులు బాసలు ఏకమైన శ్వాసలో
నిన్నలు రేపులు లీనమైన నేటిలో
ఈ నిజం కథ అని తరతరాలు చదవని
ఈ కథే నిజమని కలలలోనే గడపని
వేరేలోకం చేరే వేగం పెంచే మైకం
మననిలా తరమని
తారాతీరం తాకే దూరం
ఎంతో ఏమో అడగకే ఎవరని
మూగ మనసులు
మూగ మనసులు
2 comments:
మామూలుగానే కీర్తి సురేష్ అంటే చాలా ఇష్టం..రేవతి, నిత్య మీనన్ తరువాత..సావిత్రి గారిలా కనిపించిన పిక్స్ చూస్తుంటే ఇంకా బోలెడంత ఇష్టం పెరిగింది..
అవునండీ కొన్ని పిక్స్ లో చాలా బాగా సూట్ అయిందనిపించింది. థాంక్స్ ఫర్ ద కామెంట్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.