మాతృదినోత్సవం సందర్భంగా మాతృమూర్తులకు వారి ప్రేమాభిమానాలను చవిచూసిన పిల్లలకు శూభాభినందనలు తెలియ జేసుకుంటూ కణం చిత్రంలోని ఈ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : కణం (2018)
సంగీతం : శామ్ సి.ఎస్.
సాహిత్యం : కృష్ణ మదినేని
గానం : స్వాగత ఎస్.కృష్ణన్
జో లాలిజో జో లాలిజో
నీ లాలిపాటను మరచావేలా
ఏ బంధమో మీకున్నదీ
నీ నీడల్లే నిన్నే చేరెనిలా
జో లాలిజో జో లాలిజో
నీ లాలిపాటను మరచావేలా
తానెవ్వరో నువ్వెవ్వరో
అమ్మా అంటు ఆ గుండె పిలిచెలే
నువ్వు చూసిన ప్రాణమే నీతో నడిచే
కొంగు పట్టి వెంట కదిలె నీతో నీడలా
గాయం కనిపించని నీ గేయం ఇదిలే
ప్రాణమవని ప్రాణమేదో ప్రాణమే కోరెన్
వెన్నెలో పుట్టే నీజాబిలమ్మా
నీ కంటి వెలుగై తానున్నదే
నీకేమి కానీ నీ భాగమేదో
నిను వీడిపోకా తోడున్నదీ
కాలం మళ్ళీ ఎదురవ్వదూ
దింపేసిన భారమే శ్వాసై కలిసే
నువ్వు కనని జననమేదో నిన్నే చేరెనే
నువ్వే కనిపెంచనీ నీ రూపం తనదో
అమ్మ ఐనా అమ్మ కానీ అమ్మతో ఉన్నదో
పొద్దుల్లో అలసి నువ్వు సోలిపోతే
నీ కురులే నిమిరే ఓ అమ్మలా
నీ కంటి వెనుక కలలేవొ తెలిసి
నీ ముందు నిలిపే పసిపాపలా
పాశం నిన్ను ప్రేమించెనే
నీ లాలిపాటను మరచావేలా
ఏ బంధమో మీకున్నదీ
నీ నీడల్లే నిన్నే చేరెనిలా
జో లాలిజో జో లాలిజో
నీ లాలిపాటను మరచావేలా
తానెవ్వరో నువ్వెవ్వరో
అమ్మా అంటు ఆ గుండె పిలిచెలే
నువ్వు చూసిన ప్రాణమే నీతో నడిచే
కొంగు పట్టి వెంట కదిలె నీతో నీడలా
గాయం కనిపించని నీ గేయం ఇదిలే
ప్రాణమవని ప్రాణమేదో ప్రాణమే కోరెన్
వెన్నెలో పుట్టే నీజాబిలమ్మా
నీ కంటి వెలుగై తానున్నదే
నీకేమి కానీ నీ భాగమేదో
నిను వీడిపోకా తోడున్నదీ
కాలం మళ్ళీ ఎదురవ్వదూ
దింపేసిన భారమే శ్వాసై కలిసే
నువ్వు కనని జననమేదో నిన్నే చేరెనే
నువ్వే కనిపెంచనీ నీ రూపం తనదో
అమ్మ ఐనా అమ్మ కానీ అమ్మతో ఉన్నదో
పొద్దుల్లో అలసి నువ్వు సోలిపోతే
నీ కురులే నిమిరే ఓ అమ్మలా
నీ కంటి వెనుక కలలేవొ తెలిసి
నీ ముందు నిలిపే పసిపాపలా
పాశం నిన్ను ప్రేమించెనే
3 comments:
జోలాలీ ! జో లాలీ
జోలాలీ జోజొ! జోజొ జో లాలీ జో
జో లాలీ జోలాలీ
జో లా లీజోజొ! జోజొ! జో లాలీ జో !
జిలేబి
మనకందనంత దూరం వెళ్ళిపోయినా నిరంతరం మనతోనే ఉంటుంది అమ్మ...
అవును శాంతి గారూ నిజం.. థాంక్స్ ఫర్ ద కామెంట్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.