శుక్రవారం, జులై 31, 2015

గుండెల్లో గోదారీ...

పన్నెండు రోజులు జరిగే పుష్కరాలు ఆర్రోజుల క్రితమే అయిపోతే మనం ఈ బ్లాగులో నెలరోజుల పాటు జరుపుకున్న గోదావరి పాటల పండుగ నేటితో ముగిసిపోనుంది. ఇన్ని రోజులు జరిగిన సంబరాలనీ సంతోషాలనీ  ఈ చివరి రోజు గుండె నిండుగా నింపుకుని ఇళయరాజా గారి సాయంతో ఈ చక్కని పాట రూపంలో పాడుకుందామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : గుండెల్లొగోదారి
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : చంద్రబోస్
గానం : ఇళయరాజా

ఏ.హే...తయ్యారె తయ్యారె తయ్య 
తయ్యారె తయ్యారె తయ్యా
హొయ్యా హొయ్యా.. హొయ్య హొయ్యా.. 
హొయ్యా హొయ్యా.. హొయ్య హొయ్యా..
హేఏ.. హేహే.. హేహే.. హేహే.. హే...

గుండెల్లో గోదారీ పొంగి పొరలుతోందీ
గోదారే రాదారై నన్ను నడుపుతోందీ..
గురువులిక తెలపని పాఠాలే తెలిపినవి అలలే..
వరములకు దొరకని భాగ్యాలే వెదికినవి వలలే..

ఏ హైలెస్సో హైలెస్సొ లెస్సొ హైలెస్సో హైలెస్సొ లెస్సొ 
హైలెస్సో హైలెస్సొ హైలెస్సో 
ఏ హైలెస్సో హైలెస్సొ లెస్సొ హైలెస్సో హైలెస్సొ లెస్సొ 
హైలెస్సో హైలెస్సొ హైలెస్సో

ఆ గుండెల్లో గోదారీ పొంగి పొరలుతోందీ..
గోదారే రాదారై నన్ను నడుపుతోందీ..

అడుగడుగు అలజడులు సుడులు తిరుగు ఒడిలో..
అలసట వెనుతిరుగుట వినబడని వరద బడిలో..
అడుగడుగు అలజడులు సుడులు తిరుగు ఒడిలో..
అలసట వెనుతిరుగుట వినబడని వరద బడిలో..
తరగలుగ పెరిగెను తెగువే పడుచు వరవడిలో..
నురగలుగ కరిగెను దిగులే ఉరుకు ఉరవడిలో..
పౌరుషం పడవలా సాగువేళలో సాహసాలలో..

గుండెల్లో గోదారీ పొంగి పొరలుతోందీ..
గోదారే రాదారై నన్ను నడుపుతోందీ..

హొయ్యారే..హొయ్యర హొయ్యా.. హొయ్యర హొయ్యారే..
ఒయ్యారే..ఒయ్యర ఒయ్యా.. ఒయ్యర ఒయ్యారే..
హొయ్యారే..హొయ్యర హొయ్యా.. హొయ్యర హొయ్యారే..
ఒయ్యారే..ఒయ్యర ఒయ్యా.. ఒయ్యర ఒయ్యారే..

ఏసెయ్యి ఏసెయ్యి ఏసెయ్యి ఏసెయ్యి
వంజరం వాలుగా వంజరం వాలుగా
బురదకొయ్య మట్టగిడస ఇలస సందువ
బురదకొయ్య మట్టగిడస ఇలస సందువ
పట్టెయ్యి పట్టెయ్యి చేపనే వడుపుగా..
ఏ తందాన తందాన తందనా తాననా
ఏటిలోన సాగిపోని బతుకే ఏటగా..
తందాన తందాన తందనా తాననా

ఎదురెవరూ అదుపెవరూ ఎగుడు దిగుడు కతలో
పులసలా ఎదురీదుతూ ఎగసెగసి పడిన నదిలో
ఎదురెవరూ అదుపెవరూ ఎగుడు దిగుడు కథలో
పులసలా ఎదురీదుతూ ఎగసెగసి పడిన నదిలో
గలగలల గీతం నాదే గెలుపు రాగంలో..
జలజలల సైన్యం నాదే చిలిపి రాజ్యంలో..
రాజునే నేనుగా నీటి కోటలో గాలి వాటులో..

గుండెల్లో గోదారీ పొంగి పొరలుతోందీ..
గోదారే రాదారై నన్ను నడుపుతోందీ..
గురువులిక తెలపని పాఠాలే తెలిపినవి అలలే..
వరములకు దొరకని భాగ్యాలే వెదికినవి వలలే..

ఏ హైలెస్సో హైలెస్సొ లెస్సొ హైలెస్సో హైలెస్సొ లెస్సొ 
హైలెస్సో హైలెస్సొ హైలెస్సో 
హైలెస్సో హైలెస్సొ లెస్సొ హైలెస్సో హైలెస్సొ లెస్సొ 
హైలెస్సో హైలెస్సొ హైలెస్సో

ఆ గుండెల్లో గోదారీ పొంగి పొరలుతోందీ..
గోదారే రాదారై నన్ను నడుపుతోందీ.

గురువారం, జులై 30, 2015

నీలో అల గోదారి...

గోదావరి ఒడ్డున ప్రేమకు ప్రేమ గీతాలకు కొదవేముంది.. ఇదిగో ఈ యువజంటని చూడండి తన ప్రేయసిలో గోదారి ని చూస్తే తన ప్రియుడిలో నీడనిచ్చే అందాల తోటలని చూసిందట ఆ ముచ్చటేమిటో మనమూ విందామా. ఈ పాటలో ఇళయరాజా గారి సంగీతం అచ్చంగా గోదావరి మీదనుండి వీచే పిల్లతెమ్మెరలా హాయిగా అలా అలా సాగిపోతూ ఎంతో బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ప్రేమ విజేత (1992)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం :
గానం : బాలు, జానకి

నిస రిమ పద నిద సా నిసని
నిస రిమ పద నిద సా నిసని
శభాష్
సరి నిస దని పదమా
సరి నిస దని పదమా
మపసా నిసనిద మపసా

నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా
నవ్వింది నా తోడుగా
నీలో తొలి అందాల తోటలే ఆత్రేయ పాటలా
ఉన్నాయి నా నీడగా

వలపుల పులకింతే తెలుగుకు గిలిగింత
ఎదలే పలికే వేళా వగలొలికె
నీలో తొలి అందాల తోటలే ఆత్రేయ పాటలా
ఉన్నాయి నా నీడగా


నీ పేరు వయ్యారమా నడిచిన శృంగారమ
అందాలు చూశానే అలల నడుమ
నీ పేరు సంగీతమా వలచిన సాయంత్రమా
ఏ రాగమైనా నీ మనసు మహిమ

నీ హంస నాదమే నా సూర్య వేదమై
నీ ప్రేమ రాగమే నా రామ కీర్తనై
నీ రూపమే ఒక ఆలాపనై..
ఆలోచనే ప్రియ ఆరాధనై..నీలో..

నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా
నవ్వింది నా తోడుగా
హహ మలి సందెలలో పొంచీ ఉన్నా
చలి విందులకే వేచీ ఉన్నా
బిడియాల బుగ్గెరుపూ
పరువాల పొద్దెరుపూ
కడియాల కాలెరుపూ
కలహాల కన్నెరుపూ

నా గుండె ఏ తాళమో తెలియని ఉల్లాసమే
ఉప్పొంగి పోయే నీ తపన వలన

నా గొంతు ఏ రాగమో అడిగెను నీ తాళమే
ఉర్రూతలూగే నీ మనసుతోనే
ఏ పొన్న పూసినా నీ నవ్వులేననీ
ఏ వెన్నదోచినా నీ వన్నెలేననీ
ఉన్నాయిలే కలలా ఆశలే
తెల్లారినా ఇక నీ ధ్యాసలే.. నీలో..

నీలో తొలి అందాల తోటలే ఆత్రేయ పాటలా
ఉన్నాయి నా నీడగా 
నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా
నవ్వింది నా తోడుగా
వలపుల పులకింతే తెలుగుకు గిలిగింత
ఎదలే పలికే వేళా వగలొలికె 
నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా
నవ్వింది నా తోడుగా

బుధవారం, జులై 29, 2015

పాపి కొండల వెనుక...

నమ్మిన వారికి రాతిలో దేవుడు కనిపిస్తాడు, ఉవ్వెత్తున అలలతో ఎగసి పడుతూ సుడిగుండాలతో ఉరకలు పరుగులు తీసే గోదావరి లోనూ సేదతీర్చే చల్లదనం ఉంది. అలాగే మనిషి మాట మొరటైనా మనసు చల్లనైనదయ్యే అవకాశాలు లేకపోలేదు అది చూడగలిగిన మనసుకే కనిపిస్తుంది. ఇదిగో ఈ అమ్మాయికి అలాంటి ఓ చల్లని మనసు కనిపించిదట ఆ వివరం మనమూ విందామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఆడాళ్ళు మీకు జోహార్లు (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : సుశీల

పాపికొండల వెనుక..
పాపంటి మనసున్న
జాబిల్లీ ఉన్నాడనీ..ఈఈ..
చల్లని కబురొచ్చెనే...
నా జంకంతా విడిపోయేనే

పాపి కొండల వెనుక
పాపంటి మనసున్న
జాబిల్లీ ఉన్నాడననీ..
చల్లని కబురొచ్చెనే..
నా జంకంతా విడిపోయెనే


చీకటి కడుపులో పుట్టాడనీ..
వెలుగొచ్చి చీకటినే చంపాడనీ..
చీకటి కడుపులో పుట్టాడనీ...
వెలుగొచ్చి చీకటినే చంపాడనీ...
మాయని మత్తొకటి కలవాడని
మగువుల పాలిటి పగవాడని
మాయని మత్తొకటి కలవాడని
మగువుల పాలిటి పగవాడని
నిలకడే లేదని నిందలే వింటినీ..
విన్నది కల్లాయనే..
తెలి వెన్నెల జల్లాయనే...

పాపికొండల వెనుక..
పాపంటి మనసున్న
జాబిల్లి ఉన్నాడనీ...
చల్లని కబురొచ్చెనే...
నా జంకంతా విడిపోయెనే


గోదారి గోలనే వింటారూ.ఊఊ..
గుండెలో చలవెవరు చూస్తారూ.ఊఊ..
గోదారి గోలనే వింటారూ...
గుండెలో చలవెవరు చూస్తారూ...
కోకిలకు కాకికి గూడొక్కటే
తేడాలు తెలిపేది గొంతొక్కటే
కోకిలకి కాకికి గూడొక్కటే
తేడాలు తెలిపేది గొంతొక్కటే
నమ్మితే దేవుడు రాతిలో ఉన్నాడు
కాకుల లోకానికి...
నువ్వు కోకిల కావాలిలే...

పాపికొండల వెనుక..
పాపంటి మనసున్న
జాబిల్లి ఉన్నాడనీ.. ఈ ఈ ఈ....
చల్లని కబురొచ్చెనే...
నా జంకంతా విడిపోయెనే
చల్లని కబురొచ్చెనే...
నా జంకంతా విడిపోయెనే.. 

 

మంగళవారం, జులై 28, 2015

కిన్నెరసాని వచ్చిందమ్మ...

కోటలాంటి ఇంటి నుండి ఎక్కడికీ కదలక చిన్నతనం నుండీ ఒక పగిలిన కిటికీ గుండా ప్రపంచాన్ని చూస్తూ గడిపిన రాణివాసపు చిన్నది.. మొదటిసారిగా ఆ కోటను దాటి పల్లెను దాటి ప్రకృతితో మమేకమై గోదావరి పరవళ్లతో పోటీగా తుళ్ళిపడుతుంటే.. విశ్వనాథ వారి కిన్నెరసాని అతని కళ్ళెదుట నిలిచిందట. ఆ వైనమేమిటో మీరే చూడండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సితార (1983)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, ఎస్.పి.శైలజ

తననననన తననననన...
తననననన తననననన...
తననననన తననననన... తననననన


చమకు చమకు జింజిన జింజిన..
చమకు చమకు జిన్న జిన్న జిన్న..
కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి..
జమకు జమకు జింజిన జింజిన..
జమకు జమకు జిన్న జిన్న జిన్న.
.

కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి..
విశ్వనాధ పలుకై.. అది విరుల తేనెచినుకై..
కూనలమ్మ కులుకై.. అది కూచిపూడి నడకై..

పచ్చని చేలా.. తనననన..
పావడగట్టి.. తనననన
పచ్చని చేలా..  పావడగట్టి..
కొండమల్లెలే కొప్పునబెట్టి
వచ్చేదొరసాని.. మా వన్నెల కిన్నెరసాని

కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి..

కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి..

ఎండల కన్నె సోకని రాణి..
పల్లెకు రాణి పల్లవ పాణి..
కోటను విడిచీ.. పేటను విడిచీ..
కోటను విడిచీ.. పేటను విడిచీ..
కనులా గంగా పొంగే వేళ..
నదిలా తానే సాగే వేళ..
రాగాల రాదారి పూదారి ఔతుంటే..
ఆ రాగాల రాదారి పూదారి ఔతుంటే..


కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి..
కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి..

మాగాణమ్మా చీరలు నేసే..
మలిసందెమ్మ కుంకుమ పూసే..
మువ్వలబొమ్మా.. ముద్దులగుమ్మా..
మువ్వలబొమ్మా.. ముద్దులగుమ్మా..

గడపా దాటి నడిచే వేళ..
అదుపే విడిచీ ఎగిరే వేళ..
వయ్యారి అందాలు.. గోదారి చూస్తుంటే..
ఈ వయ్యారి అందాలు.. గోదారి చూస్తుంటే

కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి.. 

కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి..
విశ్వనాధ పలుకై... అది విరుల తేనెచినుకై..
కూనలమ్మ కులుకై.. అది కూచిపూడి నడకై..

పచ్చని చేలా.. తనననన..
పావడగట్టి.. తనననన
ఓయ్ పచ్చని చేలా..  పావడగట్టి..

 అ కొండమల్లెలే కొప్పునబెట్టి
వచ్చేదొరసాని.. మా వన్నెల కిన్నెరసాని  

 వచ్చేదొరసాని.. మా వన్నెల కిన్నెరసాని  


సోమవారం, జులై 27, 2015

పున్నమి లాగా వచ్చి పొమ్మని...

పన్నెండేళ్ళకొక్క మారే వచ్చినా ఆ పుష్కరంకోసం గోదారమ్మ, ఆమెతో పాటు ఆమె ఒడిన సేద తీరుతున్న ప్రజలు ఎంతగా ఎదురు చూస్తారో తెలియనిది కాదు కదా. అలాగే ఈ కుర్రాడు తెలుగుదనానికి దూరమై పాశ్చాత్య పోకడలు పోతున్న తన నెచ్చెలి తిరిగి పదారణాల తెలుగమ్మాయిలా తనదరికి రావాలని ఎంత ఆశగా ఎదురు చూస్తున్నాడో వేటూరి వారి తేటతెనుగు మాటల్లో మీరే వినండి.. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : జడగంటలు (1984)
సంగీతం : పుహళేంది
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

ఆఆఆఆఆ..ఆఅహాహాఅ...లలలలలలాలాలా
పున్నమి లాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది
పున్నమి లాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది
నువ్వు రావాలా పువ్వు పూయాలా రావేలా
జడ గంటమ్మా రతనాలమ్మా జానకమ్మా

పున్నమి లాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది

లలలలలలాలాలా లాలాలా....
పాపికొండలా పండువెన్నెలా పక పక నవ్వాలా
వెండి గిన్నెలో పాలబువ్వలా రెల్లే నవ్వాలా
పాపికొండలా పండువెన్నెలా పక పక నవ్వాలా
వెండి గిన్నెలో పాలబువ్వలా రెల్లే నవ్వాలా
నీ మువ్వలు కవ్విస్తుంటే ఆ సవ్వడి సై అంటుంటే
నీ మువ్వలు కవ్విస్తుంటే ఆ సవ్వడి సై అంటుంటే
సెలయేరమ్మా గోదారమ్మా చేతులు కలపాలా
చేతులు విడిచిన చెలిమిని తలచి 
కుంగిపోవాలా నే కుంగిపోవాలా

పున్నమి లాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది

లలలలలలాలాలా...లలలాలాలా...
పల్లెపట్టునా పాలపిట్టలే శకునం పలకాలా
గోవు పొదుగునా పాలవెల్లులే పొంగులు వారాలా
పల్లెపట్టునా పాలపిట్టలే శకునం పలకాలా
గోవు పొదుగునా పాలవెల్లులే పొంగులు వారాలా
జడగంటలు మనసిస్తుంటే గుడిగంటలు మంత్రిస్తుంటే
జడగంటలు మనసిస్తుంటే గుడిగంటలు మంత్రిస్తుంటే
నింగీ నేలా కొంగులు రెండూ ముడివడిపోవాలా
ముడివిడిపోయిన ముద్దుని తలచి 
కుంగిపోవాలా నే కుంగిపోవాలా

పున్నమి లాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది
నువ్వు రావాలా పువ్వు పూయాలా రావేలా
జడ గంటమ్మా రతనాలమ్మా జానకమ్మా
ఆఆఆఅ..ఆఆఅ...ఆఆఆ
పున్నమి లాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది


ఆదివారం, జులై 26, 2015

గో గో రై రై గోదావరిపై...

గోదావరిపై హ్యాపీ అలలట.. గోదారమ్మతో ఆటలాడుకోగలుగుతుంటే ఆనందం కాక మరేముంటుంది అందుకే ఆ అలలని హ్యాపీ అలలనిపించారేమో వంశీ గారు. రామజోగయ్య శాస్త్రి గారి సాయంతో జీవితపు ఫిలాసఫీని ఒక చక్కని సరదా ఐన పాటతో ఎలా చెప్పేస్తున్నారో మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : గోపి గోపిక గోదావరి (2009)
సంగీతం : చక్రి
సాహిత్యం : రామజోగయ్యశాస్త్రి
గానం : చక్రి, వంశీ

గో గో తననన గో గో
గో గో తననన గో గో
గో గో రై రై గోదావరిపై హ్యపీ అలవై అలవై
గో గో రై రై రాజా నువ్వై రాస్తా నీదై నీదై

గో గో తననన గో గో తననన గో గో తననన గో గో

గో గో రై రై గోదావరిపై హ్యపీ అలవై అరవై
గో గో రై రై రాజా నువ్వై రాస్తా నీదై నీదై
తెరమరుగు నలుపునిక తుడిచెయ్
అదమరుపు ముసుగు నువ్వు వదిలెయ్
అలుపనని పరుగులకు జతవై
కధ మలుపు వెనుకె నువ్వు పదవోయ్
దరికేసేయ్ జోర్సేయ్ వార్సేయ్ పడవై నువ్వై

గో గో చక చక
గో గో పద ఇక
గో గో నిలవక
గో గో రై రై గోదావరిపై హ్యపీ అలవై అలవై
గో గో రై రై రాజా నువ్వై రాస్తా నీదై నీదై

తననన తననన తననన తననన

నువ్వెవరైనా నేనెవరైనా నవ్వులు ఒకటేలే...జాణ
ఏ పెదవైనా ఏ ఎదకయినా సవ్వడి ఒకటేలే...కాదా
వినవా వినవా గురువా
మన అందరిదొకటే పడవ
మనసు మమత కరువా
జనమంతా ఒకటే అనవా
చినుకు తడి తగిలిన చోట పరిమళం పుడుతుందంట
తళుకు సిరిజల్లువు నువ్వై అల్లుకుపోమరి

గో గో చక చక
గో గో పద ఇక
గో గో నిలవక
గో గో రై రై గోదావరిపై హ్యపీ అలవై అలవై
గో గో రై రై రాజా నువ్వై రాస్తా నీదై నీదై

తననన తననన తననన తననన

ఎల్లలు తెలిపే అల్లరితనమై మాటలు ఎగరాలి...జాణ
గుండెను తడిపే వెన్నెల గుణమై తేనెలు చిలకాలి...కాదా
పదవే పదవే చిలక
పదుగురిని కలిసే పనిగా
పరదా వెనకే విడిగా
నువ్వొంటరి కాకే పలుకా
పిలుపు వినిపించిన వైపు కదలనీ నీ కనుచూపు
బదులుగా ఎదురేరాదా తూరుపు మెరుపు

గో గో చక చక
గో గో పద ఇక
గో గో నిలవక
గో గో రై రై గోదావరిపై హ్యపీ అలవై అలవై
గో గో రై రై రాజా నువ్వై రాస్తా నీదై నీదై
తెరమరుగు నలుపునిక తుడిచెయ్
అదమరుపు ముసుగు నువ్వు వదిలెయ్
అలుపనని పరుగులకు జతవై
కధ మలుపు వెనుకె నువ్వు పదవోయ్
దరికేసేయ్ జోర్సేయ్ వార్సేయ్ పడవై నువ్వై

గో గో చక చక
గో గో పద ఇక
గో గో నిలవక
గో గో రై రై గోదావరిపై హ్యపీ అలవై అలవై
గో గో రై రై రాజా నువ్వై రాస్తా నీదై నీదై
నీదై

శనివారం, జులై 25, 2015

ఉప్పొంగెలే గోదావరి / ఉప్పొంగి పోయింది...

గోదావరి గురించి గోదారి మీద సాగే లాంచీలో ప్రయాణం గురించి వేటూరి వారు ఎంతో అందంగా వర్ణించిన ఈ పాట నాకు చాలా ఇష్టం. నేటితో పుష్కరాలకు వీడ్కోలు చెబుతూ మళ్ళీ పుష్కరమెప్పుడొస్తుందా అని ఎదురు చూపులు మొదలు పెడుతూ ఈ పన్నెండు రోజులూ పుష్కర శోభతో ఉప్పొంగిపోయిన గోదారమ్మను చూసి ఈ అందమైన పాట పాడుకుందామా.. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : గోదావరి (2006)
సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

షడ్జమాం భవతి వేదం
పంచమాం భవతి నాదం
శృతి శిఖరే నిగమ ఝరే స్వరలహరే

సా స పా ప ప ప ప మ రి స స ని స
సా స పా ప ప ప ప మ ద ప ప
సా స పా ప ప ప ప మ రి స స ని స
సా స పా ప ప ప ప మ ని ద ప

ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి
ఏసెయ్ చాప జోర్సేయ్ నావ వార్సేయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా

ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వేయ్యంగానె లాభసాటి బేరం
ఇళ్ళే వోడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్ని అడిగే నీటి అద్దం
ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ?
నది వూరేగింపులో పడవ మీద రాగా
ప్రభువు తాను కాదా

ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి 
 
గోదారమ్మ కుంకంబొట్టు దిద్దె మిరప ఎరుపు
లంకానాధుడింకా ఆగనంటు పండు కొరుకు
చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి
సందేహాల మబ్బే పట్టె చూసే కంటికి
లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు
అల పాపి కొండలా నలుపు కడగలేక
నవ్వు తనకు రాగా

ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి 
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి

ఏసెయ్ చాప జోర్సేయ్ నావ వార్సేయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా

ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరీ

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఇదే చిత్రంలో టైటిల్స్ బ్యాక్ డ్రాప్ లో వినిపించే పాటగా అడవి బాపిరాజు గారు వ్రాసిన ఈ అందమైన పాటను ఉపయోగించుకున్నారు. ఇది నాకు చాలా ఇష్టమైన పాట. గోదావరి గురించి ఎంతో అందంగా వర్ణించిన పాట మీరూ విని ఆనందించండి. ఎంబెడ్ చేసినది చిత్రం మొదట్లో వచ్చే ఫిమేల్ వర్షన్, ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. కె.ఎమ్.రాధాకృష్ణన్ పాడిన వర్షన్ ఇక్కడ చూడవచ్చు. అదే వర్షన్ ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.
 

చిత్రం : గోదావరి (2006)
సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్
సాహిత్యం : అడివి బాపిరాజు
గానం : చిత్ర (?)

ఉప్పొంగి పోయింది గోదావరి
తాను తెప్పున్న ఎగిసింది గోదావరి

ఉప్పొంగి పోయింది గోదావరి
తాను తెప్పున్న ఎగిసింది గోదావరి

కొండల్లో ఉరికింది గోదావరి
తాను కోనల్లో నిండింది గోదావరి
కొండల్లో ఉరికింది కోనల్లో నిండింది
ఆకాశ గంగతో హస్తాలు కలిపింది

ఉప్పొంగి పోయింది గోదావరి
తాను తెప్పున్న ఎగిసింది గోదావరి

మడులలో సుడులలో గరువాల నడలలో
పరవళ్ళు తొక్కుతూ ప్రవహించి వచ్చింది
అడవి చెట్లన్నీని జడలోన తురిమింది
ఊళ్ళు దండలు గుచ్చి మెళ్ళోన దాల్చింది

ఉప్పొంగి పోయింది గోదావరి
తాను తెప్పున్న ఎగిసింది గోదావరి 
లాలాలలాలాల..లాలాలలాలాల..
లాలాలలాలాల..లాలాలలాలాల..
లాలాలలాలా..లాఆ..ఆఅ..  

~*~*~*~*~*~

  సినిమాలో ఉపయోగించని చరణాలు ఇవి :

శంఖాలు పూరించి కిన్నెరలు మీటించి
శంకరాభరణ రాగాలాప కంఠయై

॥ఉప్పొంగి॥

నరమానవుని పనులు సిరిమొగ్గి వణకాయి
కరమెత్తి దీవించి కడలికే నడిచింది

॥ఉప్పొంగి॥శుక్రవారం, జులై 24, 2015

ఒడుపున్న పిలుపు...

అనుకోని పరిస్థితుల్లో కొంతకాలం ఊరికి దూరంగా ఉండాల్సొచ్చి వేదన పడుతున్న మనసుకు తిరిగి ఊరు వెళ్ళబోతున్నామనే కబురుకన్నా సంతోషమైనదేదైనా ఉంటుందా. అంతటి ఆనందాన్ని పంచుకోడానికి తాము పుట్టి పెరిగిన చల్లని గోదారి తల్లికన్నా వేరే ఎవరుంటారు చెప్పండి. అందుకే ఈ జంట తమ సంతోషాన్ని ఇంత అందమైన పాటతో ఇలా వ్యక్తపరుస్తున్నారు. ఆ సందడేమిటో మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సిరి సిరి మువ్వ (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల  

ఒడుపున్న పిలుపు ఒదిగున్న పులుపు
ఒక గొంతులోనే పలికింది
అది ఏ రాగమని నన్నడిగింది
ఒడుపున్న పిలుపు ఒదిగున్న పులుపు
ఒక గొంతులోనే పలికింది
అది ఏ రాగమని నన్నడిగింది

అది మనవూరి కోకిలమ్మా 
నిన్నడిగింది కుశలమమ్మా
అది మనవూరి కోకిలమ్మా 
నిన్నడిగింది కుశలమమ్మా

నిజమేమొ తెలుపు నీ మనసు తెలుపు
ఎగిరేను మన వూరివైపు 
అది పదిమంది కామాట తెలుపు
నిజమేమొ తెలుపు నీ మనసు తెలుపు
ఎగిరేను మన వూరివైపు 
అది పదిమంది కామాట తెలుపు

గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే 
ఎల్లువ గోదారల్లే వెన్నెట్లో గోదారల్లె
ఎదలో ఏదోమాట రొదలో ఏదో పాట
గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే 
ఎల్లువ గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే

అలలా ఎన్నెల గువ్వా ఎగిరెగిరి పడుతుంటే
గట్టుమీన రెల్లు పువ్వా బిట్టులికి పడుతుంటే
అలలా ఎన్నెల గువ్వా ఎగిరెగిరి పడుతుంటే
గట్టుమీన రెల్లు పువ్వా బిట్టులికి పడుతుంటే

ఏటివార లంకలోనా ఏటవాలు డొంకలోనా
ఏటివార లంకలోనా ఏటవాలు డొంకలోనా
వల్లంకి పిట్టా పల్లకిలోనా 
సల్లంగ మెల్లంగ ఊగుతు ఉంటే

గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే  
ఎల్లువ గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లె 


గురువారం, జులై 23, 2015

అదిగో అదిగో / ఏటయ్యిందె గోదారమ్మ..

ఎదురు చూసినంత సేపు పట్టలేదు పుష్కరాలు అప్పుడే చివరి మూడు రోజులకు వచ్చేశాయి. అందుకే మరోసారి ఆ గోదారమ్మ ఒడ్డున కొలువై ఉన్న రాములోరిని తలచుకుందామా. శ్రీరామదాసు చిత్రంలో భద్రుని చరితను గురించిన ఈ పాటకు కీరవాణి గారిచ్చిన సంగీతం కొన్ని చోట్ల తనువును పులకింప చేస్తుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శ్రీరామదాసు (2006)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం : వేటూరి
గానం : ఎస్.పి.బాలు, బృందం

ఓం .. ఓం .. ఓం
శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః

అదిగో అదిగో భద్రగిరీ..
ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ
ఏ వాల్మీకీ రాయని కధగా..
సీతారాములు తనపై ఒదగా
రామదాసకృత రామపదామృత
వాగ్గేయస్వర సంపదగా
వెలసిన దక్షిణ సాకేతపురీ..

అదిగో అదిగో భద్రగిరీ..
ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ

రాం .. రాం .. రాం .. రాం

రామనామ జీవన నిర్నిద్రుడు
పునః దర్శనము కోరిన భద్రుడు
సీతారాముల దర్శనానికై
ఘోరతపస్సును చేసెనప్పుడూ
తపమును మెచ్చీ ధరణికి వచ్చీ
దర్శనమిచ్చెను మహావిష్ణువూ

సాససా నీదరి సానిదాప
గమ పాదనీ దామపా

త్రేతాయుగమున రామరూపమే
త్రికరణశుద్దిగ కోరెను భద్రుడు
ఆఆఅ...ఆఆ..ఆఅ...
ఆదర్శాలకు అగ్రపీఠమౌ
ఆ దర్శనమే కోరెనప్పుడూ

ధరణిపతియే ధరకు అల్లుడై..
శంఖచక్రములు అటు ఇటు కాగా..
ధనుర్బాణములు తనువై పోగా..
సీతాలక్ష్మణ సమితుడై..
కొలువు తీరె కొండంత దేవుడూ..

శిలగా మళ్ళీ మలచీ..
శిరమును నీవే నిలచీ..
భద్రగిరిగ నను పిలిచే
భాగ్యము నిమ్మని కోరె భద్రుడూ

వామాంకస్థిత జానకీ పరిలస కోదండ దండం కరే
చక్రం చోర్భకరేణ బాహు యుగళే శంఖం శరం దక్షిణే.
విఘ్రాణం జలజాత పత్ర నయనం భద్రాద్రి మూర్తిస్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే !

అదిగో అదిగో భద్రగిరీ..
ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఆలనా పాలనా లేక గోదారమ్మ ఒడ్డున ఆరుబయట నిలిచి ఉన్న రాములోరి విగ్రహాలకు గుడి కట్టించిన రామదాసు ఆ ప్రాంతాలకు మొదటి సారి వస్తుంటే.. ఆహా మా రాములోరికి మంచి రోజులొచ్చాయని గోదారమ్మ ఆనందంతో ఉలికిపాటుకు గురైందంట.. ఆ వైనమేంటో వివరించే ఈ జానపదం ఎంత హాయిగా ఉంటుందో.. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శ్రీరామదాసు (2006)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం : సుద్దాల అశోక్‌తేజ
గానం : దేవిశ్రీప్రసాద్,కీరవాణి,మాళవిక 

హొలేసా హొలేసా
హొలేసా హొలె హొలేసా
ఏటయ్యిందె గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుసూస్తున్నది గట్టు ఎమైనట్టు
నాకు కూడ ఎడమకన్ను అదురుతుంది నీమీదొట్టు
మన సీతారామస్వామికి మంచి ఘడియ రాబోతున్నట్టు ఉ ఉ ఉ
ఉ ఉ ఉ
హొలేసా హొలేసా
హొలేసా హొలేసా
ఏటయ్యిందె గోదారమ్మ ఆ ఆ ఆ


కృష్ణయ్యకు ఫించమైన నెమిలమ్మల దుంకులాట దుంకులాట దుంకులాట
ఎంకన్నకు పాలుతాపిన పాడావుల ఎగురులాట ఎగురులాట
రామునికి సాయం చేసిన ఉడుతపిల్లల ఉరుకులాట ఉరుకులాట
చెప్పకనే చెబుతున్నవి చెప్పాకనే చెబుతున్నవి
మన సీతారామస్వామికి మంచి ఘడియ రాబోతున్నట్టు ఉ ఉ ఉ
హొలేసా హొలేసా
హొలేసా హొలేసా

ఏటయ్యిందె గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుచూస్తున్నది గట్టు ఎమైనట్టు

చిటుకిపందిరెయ్యాలని పిచ్చిపిచ్చి ఆశ నాది
ముల్లోకాలని కాసేటొన్ని కాపాడాలని పిచ్చి నాది
నీడనిచ్చే దేవునికి నీడనిచ్చే ఎదురుచూపు
ఇన్నాళ్ళకు నిజమయ్యి ఎదరొంకన పడుతున్నది
రాలేని శబరి కడకు రాముడు నడిచొచ్చినట్టు
మన రాముని సేవకెవరో మనసుపడి వస్తున్నట్టు ఊఊఊ

హొలేసా హొలె హొలేసా
హొలేసా హొలేసా
ఏటయ్యిందె గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుచూస్తున్నది గట్టు ఎమైనట్టు
నాకు కూడ ఎడమకన్ను అదురుతుంది నీమీదొట్టు
మన సీతారామస్వామికి మంచి ఘడియ రాబోతున్నట్టు ఉ ఉ ఉ
హొలేసా హొలేసా
హొలేసా హొలె హొలేసా
హొలేసా హొలేసా
హొలేసా హొలె హొలేసా
హొలేసా హొలె హొలేసా
హొలేసా హొలేసా

బుధవారం, జులై 22, 2015

గోదావరి పయ్యెదా...

గోదావరి ఒడ్డున తన ప్రేయసిని కలుసుకున్న ఈ కుర్రాడికి ఆమె పైట గోదావరిలా మెలికలు తిరుగుతూ కనువిందు చేసిందట ఇక తన వాలు జడేమో నల్లని కృష్ణమ్మలా ఇంత బారున సాగిందట ఇక ఆగుతాడా.. వేటూరి వారి సాయంతో ఇలా కమ్మనైన పాట పాడుకున్నాడు. తేట తెలుగు పదాల పాట వింటూంటే డబ్ చేసినది అనే స్పృహే రాదు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సరిగమలు (1994)
సంగీతం : బాంబే రవి
రచన : వేటూరి
గానం : ఎస్.పి.బాలు, చిత్ర

ఆఆఆఅ..ఆఆఆ....ఆఆఅ..
కొమ్మలో కొమ్మ కోయిలాలో హుయ్యా హుయ్యాహో..
కొమ్మలో కొమ్మ కోయిలాలో హుయ్యా హుయ్యాహో..
ఓ..ఓ..ఓఓఓఓఓ....
చెక్కిలే చెమ్మ చెక్కిలాడే సయ్యా సయ్యాహో.. 
చెక్కిలే చెమ్మ చెక్కిలాడే సయ్యా సయ్యాహో.. 

గోదావరి పయ్యెదా కృష్ణమ్మ నీ వాల్జడా
నిండారి తెలుగింటి అందాలే వెలిగించే
నండూరి వారెంకిలా ఓ...

గోదావరి ఎన్నెలా నాదారిలో కాయగా
ఉప్పొంగే పరువాల ఉయ్యాల కెరటాల
కిన్నెరసాని పాటలా ఓ...

గోదావరి పయ్యెదా కృష్ణమ్మ నీ వాల్జడా

ఓహోహోహో..ఓహోహోహో..ఆఆ.ఆఅ.ఆఅ.ఆ
ఓహోహోహో..ఓహోహోహో..ఆఆ.ఆఅ.ఆఅ.ఆ

సిగ్గల్లే పండెనులే సాయంత్రము
బుగ్గల్లో పండాలి తాంబూలము...ఓఓ..
సిగ్గల్లే పండెనులే సాయంత్రము
బుగ్గల్లో పండాలి తాంబూలము
ఎన్నెల్లె కోరుకునే ఏకాంతము
నన్నల్లుకోమంది వయ్యారము
కౌగిలిలో మేలుకొనే కానుకవో మేనకవో
నా స్వప్న లోకాలలో..ఓయ్.ఒయ్.ఒయ్..

గోదావరి ఎన్నెలా నాదారిలో కాయగా

గువ్వమ్మ చేరుకునే శ్రీగోపురం
మువ్వమ్మ మురిసేటి మురళీపురం
గువ్వమ్మ చేరుకునే శ్రీగోపురం
మువ్వమ్మ మురిసేటి మురళీపురం
కవ్వాలే కడవల్లో కదిలే క్షణం
కడలల్లే పొంగింది నా మానసం
పొన్నలలో పొగడలలో తుంటరి ఓతుమ్మెదవో
నా బాహు బంధాలలో..ఓయ్.ఓయ్..

గోదావరి పయ్యెదా కృష్ణమ్మ నీ వాల్జడా
ఉప్పొంగే పరువాల ఉయ్యాల కెరటాల
కిన్నెరసాని పాటలా ఓ...
గోదావరి పయ్యెదా కృష్ణమ్మ నీ వాల్జడా

కొమ్మలో కొమ్మ కోయిలాలో హుయ్యా హుయ్యాహో.. 
కొమ్మలో కొమ్మ కోయిలాలో హుయ్యా హుయ్యాహో..
ఓ..ఓ..ఓఓఓఓఓ....
చెక్కిలే చెమ్మ చెక్కిలాడే సయ్యా సయ్యాహో.. 
చెక్కిలే చెమ్మ చెక్కిలాడే సయ్యా సయ్యాహో..
కొమ్మలో కొమ్మ కోయిలాలో హుయ్యా హుయ్యాహో..
మంగళవారం, జులై 21, 2015

ఎల్లువొచ్చి గోదారమ్మా...

గోదారమ్మ సాక్షిగా చెట్టాపట్టాలేసుకుని పాటలు పాడుకుని ఏకమైన జంటలు ఎన్నో... వాటిలో ఈ అందమైన జంటను చూడండి వేటూరి వారి సాయంతో చమత్కారమైన పదాల అల్లికతో ఓ అందమైన పాట పాడేసుకుంటున్నారు మరి ఆ సరదా సంగతులేంటో మనమూ విందామా. పాటలను అందంగా చిత్రీకరించడంలో రాఘవేంద్రరావు గారి శైలి ప్రత్యేకం సన్నివేశానికి తగినట్లుగా బిందెలతో ఆర్టిస్టిక్ గా అరేంజ్ చేసి తీసిన తీరు అద్భుతం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : దేవత (1982)
సంగీతం : చక్రవర్తి 
సాహిత్యం : వేటూరి
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల

ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లా కిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లూపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో
కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓరయ్యో..రావయ్యో..ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా..
మీగడంతా నీదేలేరా బుల్లోడా
 
ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లా కిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లూపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో
కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే
ఓలమ్మో..రావమ్మో..ఆగమంటే రేగేనమ్మా  సోగ్గాడు..
ఆగడాల పిల్లోడైనా నీవోడు
ఆగమంటే రేగేనమ్మా  సోగ్గాడు..
ఆగడాల పిల్లోడైనా నీవోడు

ఈ కళ్ళకున్న ఆకళ్ళలోనా అందాల విందమ్మ నువ్వు
వాటేసుకుంటే వందేళ్ళ పంట వద్దంటే విందమ్మ నవ్వు
చేయ్యేస్తే చేమంతి బుగ్గా..చెంగావి గన్నేరు మొగ్గ
చేయ్యేస్తే చేమంతి బుగ్గా..చెంగావి గన్నేరు మొగ్గ
ఈడొచ్చి నీ చోటు ఈడుంది రమ్మంటే ఏడేసుకుంటావు గూడు
కౌగిళ్ళలో నన్ను కూడు..ఆకళ్ళకుంటాది కూడు.. 
గుండెల్లో చోటుంది చూడు
 
ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లా కిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లూపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో
 
కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే
ఓరయ్యో..రావయ్యో..ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా..
మీగడంతా నీదేలేరా బుల్లోడా
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు..
ఆగడాల పిల్లోడైనా నీవోడు

నీ కళ్ళు సోక నా తెల్ల కోక అయ్యిందిలే గళ్ళ కోక
నీ మాట విన్న నా జారు పైట పాడిందిలే గాలిపాట
 
కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళూ.. నే కోరిన మూడూ ముళ్ళు 
కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళూ.. నే కోరిన మూడూ ముళ్ళు
పొద్దుల్లో కుంకాలు బొట్టెట్టి పోతుంటే కట్టెయ్యనా తాళిబొట్టు
నా మాటకీ యేరు తోడూ.. ఏరెండినా ఊరు తోడు..
నీ తోడులో ఊపిరాడు..

ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లా కిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లూపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో
కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓలమ్మో..రావమ్మో..
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు..
ఆగడాల పిల్లోడైనా నీవోడు
ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా..
మీగడంతా నీదేలేరా బుల్లోడా 

సోమవారం, జులై 20, 2015

కొండా కోనల్లో లోయల్లో...

పచ్చదనంలో ఏకమైన ఈ చిన్నవాడు గానాన్ని తనకి వరంగా ఇచ్చింది అందమైన ప్రకృతే అని తెలుపుతూ ఆ ఆనందాన్ని ఒక అందమైన పాటగా కూర్చి తోటి కుర్రాళ్ళతో ఎలా ఆడీ పాడుకుంటున్నాడో మీరూ చూసీ విని ఆనందించండి. సిరివెన్నెల గారి తేట తెలుగు సాహిత్యం అద్భుతం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : స్వాతి కిరణం (1992)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : వాణీ జయరాం, కోరస్

కొండా కోనల్లో లోయల్లో
గోదారి గంగమ్మా సాయల్లో
కొండా కోనల్లో లోయల్లో
గోదారి గంగమ్మా సాయల్లో
కోరి కోరి కూసింది కోయిలమ్మ
కోరి కోరి కూసింది కోయిలమ్మ
ఈ కోయిలమ్మా
 
కొండా కోనల్లో లోయల్లో..ఆఅ..
గోదారి గంగమ్మా సాయల్లో..ఆఅ..
గోదారి గంగమ్మా సాయల్లో

నేలా పల్లవి పాడంగా నీలి మబ్బు ఆడంగా
రివ్వున గువ్వే సాగంగా నవ్వే మువ్వై మోగంగా
నీలి మబ్బు ఆడంగా నవ్వే మువ్వై మోగంగా
ఉంగా ఉంగా రాగంగా ఆ.. ఉల్లాసాలె ఊరంగా హా..
ఉంగా ఉంగా రాగంగా అహ ఉల్లాసాలె ఊరంగా అహ
ఊపిరి ఊయలలూదంగా రేపటి ఆశలు తీరంగా
తెనుగుదనం నోరూరంగా తేటగీతి గారాబంగా
తెనుగుదనం నోరూరంగా తేటగీతి గారాబంగా
తెమ్మెరపై ఊరేగంగా వయ్యారంగా

కొండా కోనల్లో లోయల్లో..ఆఅ..
గోదారి గంగమ్మా సాయల్లో..ఆఆ..
గోదారి గంగమ్మా సాయల్లో

ఝుమ్మని తుమ్మెద తియ్యంగా కమ్మని రాగం తీయంగ
జాజిమల్లె సంపెంగ జానపదాలే నింపంగా
కమ్మని రాగం తీయంగ జానపదాలే నింపంగా
చెట్టుపుట్టా నెయ్యంగా  ఆ.. చెట్టాపట్టాలెయ్యంగా హా..
చెట్టుపుట్టా నెయ్యంగా అహ చెట్టాపట్టాలెయ్యంగా అహ
చిలకా పలుకులు చిత్రంగా చిలికే తేనెలు చిక్కంగా
ఏటి పాట లాలించంగా తోట తల్లి లాలించంగా
ఏటి పాట లాలించంగా తోట తల్లి లాలించంగా
స్వరాలన్ని దీవించంగా సావాసంగా

కొండా కోనల్లో లోయల్లో..ఆఅ..
గోదారి గంగమ్మా సాయల్లో..ఓఓ..
లోయల్లో సాయల్లో లోయల్లో సాయల్లో..
ఆఆఆఆఅ..ఆఆఆఆఆ....


ఆదివారం, జులై 19, 2015

గోదారి రేవులోన...

గోదావరి ఒడ్డున పెరిగిన ఈ అమ్మాయి గొప్పలూ కాబోయే వాడి గురించి మనసులో ఉన్న కోరికలూ కలిపి ఒక హుషారైన పాటకట్టి వినిపిస్తోంది. ఆ సందడేమిటో మీరూ వినండి మరి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : రుక్మిణి (1997)
సంగీతం : విద్యాసాగర్
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : సుజాత 

గోదారి రేవులోన రాదారి నావలోన 
నా మాట చెప్పుకుంటు ఉంటారంటా 
నా నోట చెప్పుకుంటె బాగోదొ ఏమో కాని 
నాలాంటి అందగత్తె నేనేనంట 
కూసంత నవ్వగానే పున్నాగ పువ్వులాగ 
పున్నాలు పూయునంట కన్నుల్లో 
కాసింత కోపమొస్తే ఊరంత ఉప్పెనొచ్చి
ఎందుకో ఏమిటో చెప్పమంటు సందడంట

గోదారి రేవులోన రాదారి నావలోన 
నా మాట చెప్పుకుంటు ఉంటారంటా 
నా నోట చెప్పుకుంటె బాగోదొ ఏమో కాని 
నాలాంటి అందగత్తె నేనేనంట 

పాట అంటె నాదెగాని కోయిలమ్మదా ఉట్టి కారుకూతలే..
ఆట అంటె నాదెగాని లేడిపిల్లదా ఉట్టి పిచ్చిగంతులే..
పొలాల వెంట ఛెంగుమంటు సాగుతూ పదాలు పాడితే 
జిగేలుమంటు కళ్ళు చెదిరి ఆగవా జులాయి గాలులే 
ఏ చిన్న మచ్చలేని నా వన్నె చిన్నె చూసి 
చంద్రుడే సిగ్గుతో మబ్బు చాటు చేరుకోడా 

గోదారి రేవులోన రాదారి నావలోన 
నా మాట చెప్పుకుంటు....
నా నోట చెప్పుకుంటె బాగోదొ ఏమో కాని 
నాలాంటి అందగత్తె....

నాకు పెళ్ళి ఈడు వచ్చి పెద్దవాళ్ళకీ ఎంత చిక్కు తెచ్చెనే
రాకుమారిలాంటి నాకు జోడు వెతకడం వాళ్ళకెంత కష్టమే 
ఫలాని దాని మొగుడు గొప్పవాడనీ అనాలి అందరూ 
అలాని నాకు ఎదురు చెప్పకూడదే మహానుభావుడూ
నాకు తగ్గ చక్కనోడు నేను మెచ్చు అ మగాడు
ఇక్కడే ఎక్కడో తపస్సు చేస్తు ఉంటాడు 

గోదారి రేవులోన రాదారి నావలోన 
నా మాట చెప్పుకుంటు ఉంటారంటా 
నా నోట చెప్పుకుంటె బాగోదొ ఏమో కాని 
నాలాంటి అందగత్తె నేనేనంట
కూసంత నవ్వగానే పున్నాగ పువ్వులాగ 
పున్నాలు పూయునంట కన్నుల్లో 
కాసింత కోపమొస్తే ఊరంత ఉప్పెనొచ్చి
ఎందుకో ఏమిటో చెప్పమంటు సందడంట


శనివారం, జులై 18, 2015

భద్రుని చరితం.. / కురిసే వెన్నెల్లో...

గోదావరి మహా పుష్కరాల సంధర్బంగా పాటలను తలచుకుంటూ గోదావరి ఒడ్డున కొలువైన భద్రాద్రి రాముడ్ని తలచుకోకుంటే ఎలా అందుకే ఆ భద్రుని చరితం ఈ రోజు గుర్తు చేసుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అందాల రాముడు (1973)
సాహిత్యం : ఆరుద్ర
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : రామకృష్ణ, రాఘవులు,  
వంగల పట్టాభి భాగవతార్(వచనం)

మా తల్లి గోదారి చూపంగ దారి
పడవెక్కి భద్రాద్రి పోదామా
భద్రాద్రి రాముణ్ణి చూదామా
భద్రగిరి మహిమలే విందామా
భద్రగిరి మహిమలే విందామా ఓఓహో..ఓహో

ఏవిటోయ్ ఆ మహిమలు ?

శ్రీ మద్రమారమణ గోవిందో హారి
భక్తులారా.. సుజనులారా
సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు
అరణ్యవాస సమయంబున..
పావన గోదావరీ తీరంబున ఒకానొక గిరిని
పరికించి, దానిపై సుంత
విశ్రమించినంత, ఆ కంధరమ్మొక సుందర
పురుషాకృతి దాల్చి.. ఏమనినాడనగా..

ధన్యుడనైతిని ఓ రామా
నా పుణ్యము పండెను శ్రీరామా
ధన్యుడనైతిని ఓ రామా
నా పుణ్యము పండెను శ్రీరామా
మేరు గిరీంద్రుని పుత్రుడను
నీ రాకకు చూచే భధ్రుడనూ
నారీ శిరోమణి సీతమ్మతో మీరు
నా శిరమున నెలకొన వేడెదనూ..
కారుణ్యాలయ కామితమీడేర్చ
కలకాలము నిను కొలచెదనూ
ధన్యుడ.. ధన్యుడ...
ధన్యుడనైతిని ఓ రామా
నా పుణ్యము పండెను శ్రీరామా

అని భద్రుడు ప్రార్ధించిన స్వామివారేమన్నారనగా..
వత్సా! నీ ముద్దు చెల్లించుటకు ముందు
మా తండ్రిమాట చెల్లించవలయును గదా
ఉత్తరోత్తర కాలంబున పునర్దర్శనంబు ఇచ్చువాడను..
అని వెడలిపోయిరి.. అంతట...

వెడలిన రాముడు వెలదిని బాసి
ఇడుములలో బడెనూ
కడలికి వారధి గట్టి
కఠినాత్ముడు దనుజుని గొట్టి
కలికి చెరను పోగొట్టి
కనువిందుగ పట్టము గట్టి
బంధుమిత్రుల తలచుట బట్టి
భక్తుని మాట మరచాడు
రాముడు పరమావతారమ్ము విడిచాడు
వైకుంఠవాసమ్ము చేరాడు
శ్రీమద్రమారమణ గోవిందో... హారి..

కానీ భూలోకమున భద్రుడు ఎన్ని యుగములైనా
ఎదురుచూస్తూ ఏవిధముగా శోకించినాడనగా

వచ్చెదనంటివి రామయ్యా
వరమిచ్చెదనంటివి రామయ్యా
వచ్చెదనని శలవిచ్చిన పిమ్మట
మోసపుచ్చుట ఇచ్చట తగదయ్యా
వచ్చెనుకద నీ మాటకు మచ్చా
అది రానిచ్చెదనా నిను పోనిచ్చెదనా
హెచ్చరింతు నువు మెచ్చెడి తపమున
నిచ్చలు జపించి ఖచ్చితముగా
ఓ సచ్చరిత్రనిన్నిచ్చటకీడ్చెద
వచ్చెదనంటివి రామయ్యా
వరమిచ్చెదనంటివి రామయ్యా

అని శపథంబు చేసి మహోగ్ర తపస్సు నాచరించగా
సకల సురాసుర యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులు
సంక్షోభమ్ము నొందిరి... అపుడు..

కదలెను శ్రీ మహా విష్ణువు
కదలెను భక్త సహిష్టువు
సుదతి శ్రీదేవికి సుంతయినా తెలుపక
శుభ శంఖ చక్రాల కరముల దాల్చక
సుదూరమౌ భూలోకమునకు
సుపర్ణుని భుజమైన ఎక్కకా
వడివడి కదలెను శ్రీ మహా విష్ణువు
ఆహా కదలెను భక్త సహిష్టువు

శ్రీమద్రమారమణ గోవిందో... హారి..

గజేంద్ర మోక్ష సన్నివేశంబుకై వడి
స్వామి వారు ఆ విధమ్ముగా కదలగా..

తన వెంటన్ సిరి
లచ్చి వెంట నవరోధవ్రాతమున్
దాని వెన్కను పక్షీంద్రుడు
వాని పొంతను ధనుఃకౌమోదకీ
శంఖ చక్ర నికాయంబునూ

హుటాహుటిని రాగా తొందరయందు
అపసవ్యంబుగా ఆయుధములు ధరించి
స్వామివారు దర్శనంబీయ 
ఆ భక్తశిఖామణి ఏమన్నాడు..

ఎవరివయ్య స్వామి ఏను నిన్నెరుగను
హరిని నేనటంచు అనగనేల
నాడు నన్ను బ్రోచు నారాముడవు గావు
నాటి రూపు చూప నమ్మగలను

అని భద్రుడు కోరగా – శ్రీ మహావిష్ణువు
తొలినాటి రామావతారమ్ము ప్రదర్శించెను
అపసవ్యమ్ములైన ఆయుధమ్ములు, 
ఆ తీరుగనే చేతుల నిల్చెను..
భద్రుడు మహదానంద భరితుడై

ఈ తీరుగనె ఇచ్చట వెలయుము
ఇనకుల సోమా రామా
భూతలమున ఇది సీతారాముల
పుణ్య క్షేత్ర లలామా

శభాష్..

అని విన్నవించగా స్వామివారు ఆ తీరుగనే వెలసిరి.
ఆ భద్రుడే భద్రాద్రి అయ్యెను. భద్రగిరి వాసుడైన శ్రీరామచంద్రుడు
ఎండకు ఎండి వానకు తడిసి నీడకు తపించినవాడై..
ఒక నాడు శబరి అంశమున జన్మించినదైన పోకల దమ్మక్క
అను భక్తురాలి స్వప్నమ్మున సాక్షాత్కరించి
ఆ వైనమ్ము తెలుపగా ఆయమ భద్రగిరినంతయు గాలించగా
స్వామివారి దివ్యసుందరమూర్తి కనిపించెను.

కోరి కనిపించావా కోదండరామయ్యా
గుడి కట్టలేని ఈ బడుగు పేదకు నీవు
కోరి కనిపించావా కోదండరామయ్యా
చక్రవర్తి కుమారుడా ఇంకో చక్రవర్తికి అల్లుడా
భూచక్రమేలిన సార్వభౌమా
విధి వక్రించి నీకే వాసమ్ము కరువా

తాటాకు పందిరే తాటకాంతక
నీకు భవనమయ్యా
తాటిపండ్లే ఓ మేటి రాజకుమార
విందులయ్యా నీకు విందులయ్యా

అని పోకల దమ్మక్క నిత్యము సేవించుకొనెను.
తదుత్తర కాలంబున రామదాసుగా ప్రఖ్యాతుడైన
కంచెర్ల గోపన్న ఏవిధముగా 
ఆలయ నిర్మాణము గావించెననగా..
ఏవిధముగానా ! అప్పుజేసి..
తప్పునాయనా! గోపన్న చరితములోక విఖ్యాతము..
తదీయ సంస్మరణము మంగళదాయకము

రామచంద్రాయ జనక రాజజామనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం
సీతా రామచంద్రాయ జనక రాజజామనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం
మహిత మంగళం మహిత మంగళం
జై.. శ్రీమద్రమారమణ గోవిందో... హారి !

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈచిత్రంలోనిదే పూర్తిగా గోదావరిపైని లాంచీలో చిత్రీకరించిన మరో అందమైన యుగళ గీతాన్ని కూడా తలచుకుందామా... ఈ ప్రేమజంట ఎంత చక్కగా పాడుకుంటున్నారో మీరే చూసీ విని ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 

  
చిత్రం : అందాల రాముడు (1973)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : రామకృష్ణ, సుశీల

మ్.మ్.ఊ..ఊ..

కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా
మెరిసే గోదారిలో విరబూసిన నురగలా
నవ్వులారబోసే పడుచున్నదీ
కలువ పువ్వు వేయి రేకులతో విచ్చుకున్నదీ
పున్నమి ఎపుడెపుడా అని వేచి ఉన్నదీ
 

ఆ...కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా
మెరిసే గోదారిలో ఎగసిపడే తరగలా..
నాజూకు నెలబాలుడున్నాడూ
నవమి నాడే పున్నమి అని దిగుతున్నాడూ
పున్నమి ఇప్పుడిపుడే అనిపిస్తున్నాడూ

 

ఆ...కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా

ఈ వెండి వెన్నెల్లో ఏమిటి ఈ ఎరుపూ
ఎరుపా అది కాదు ఈ అరికాళ్ళ మెరుపూ.. అమ్మో..
ఆ కాలి ఎరుపు కెంపులుగా
ఆ చిరునవ్వులె మువ్వలుగా
ఆ మేని పసిమి పసిడిగా
అందాలా వడ్డాణం అమరించాలి
అని తలచానే గాని ఆనదు నీది

ఇంతకూ..అది ఉన్నట్టా..మరి లేనట్టా..
నడుమూ ఉన్నట్టా మరి లేనట్టా..ఊహు..

పైట చెంగు అలలు దాటీ
అలలపై ఉబికే పొంగులు దాటీ
ఏటికి ఎదురీది ఈది ఎటు తోచక నేనుంటే
మెరుపులాంటి ఎరుపేదో కళ్ళకు మిరుమిట్లు గొలిపింది
ఏవిటది?

ఎవరమ్మా.. ఇతగాడూ ఎంతకు అంతుపట్టని వాడు
చెంతకు చేరుకున్నాడూ
హ హా..ఎవరమ్మా ఇతగాడూ
పాలవెన్నెలలోనా బాలగోదారిలా
చెంగుచెంగున వచ్చి చెయ్యి పట్టబోయాడూ
 

అంతేనా ?
ఇరుగట్లూ ఒరుసుకునే వరద గోదారిలా
పరుగుపరుగున వచ్చి పైట చెంగు లాగాడూ
 

ఆపైన ?
అతడు చెయ్యపట్టబోతుంటే పైట చెంగులాగబోతుంటే
ఉరిమి చూసీ ఉరిమి చూసీ తరిమి కొట్టబోయాను

కానీ..చల్లచల్లగా సాగే గోదారిలా శాంత గోదారిలా
నిలువెల్లా నిండుగా తోచాడూ పులకించే గుండెనే దోచాడూ

ఎవరమ్మా ఇతగాడెవరమ్మా
నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.