మంగళవారం, జులై 07, 2015

గోదారి గట్టుంది... ఉరకలై గోదావరి...

గోదావరి గట్టు బోలెడంత ఏకాంతం కొబ్బరితోటల నడుమ నుండే వీచే హాయైన గాలి కొత్తగా వచ్చిన యుక్త వయసు చేసే తుంటరి అల్లర్లకు ఇక హద్దేముంటుంది చెప్పండి, అలాంటి ఓ జంట ఎలా ఆడిపాడుతున్నారో మనమూ చూసొద్దామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఖుషీ ఖుషీగా (2004)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం : మూర్తి
గానం : రాజేష్, శ్రేయా ఘోషల్

గోదారి గట్టుంది ఎవరూ లేరంటోంది 
అదిగో ఆ కొబ్బరి తోట ఆడుకోను రమ్మంది 
రావాలని మనసుంది ఐనా ఓ గుబులుంది
ఇట్టా నువ్వల్లరి చేస్తే ఆశ పెరిగిపోతుంది 
గోరువంక వింటోంది కబురులెందుకంటోంది 
కన్నెమనసు ఔనందీ ఏడిపించకే అంది 

గోదారి గట్టుంది ఎవరూ లేరంటోంది 
అదిగో ఆ కొబ్బరి తోట ఆడుకోను రమ్మంది 

కాకెంగిలి కలకండ వడపప్పు బెల్లాలు 
తింటూ వరిచేలల్లో పడి లేస్తూ పకపకలూ 
ఆ మామిడి తోటల్లో ఆడిన దొంగాటల్లో 
నన్నే మురిపిస్తూ ముద్దులు పెట్టిన ముచ్చటలూ
ఈ సరదా సంతోషం నీకేగా మరి సొంతం 
అని అంటూ వినమంటూ ఆ పాలపిట్ట పాడింది 

గోదారి గట్టుంది ఎవరూ లేరంటోంది 
ఇట్టా నువ్వల్లరి చేస్తే ఆశ పెరిగిపోతుంది




~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఒక నేస్తానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తనకి చాలా ఇష్టమైన ఈ పాట తలచుకుందాం. మీరందరూ కూడా ఈ హుషారైన పాట చూసీ వినీ తనకి శుభాకాంక్షలు అందచేయండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : అభిలాష (1992)
సంగీతం : ఇళయరాజా
రచన : వేటూరి
పాడినది : బాలు, ఎస్.జానకి

ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళీ
రసమయం జగతి

ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి


నీ ప్రణయభావం నా జీవ రాగం
నీ ప్రణయ
భావం నా జీవ రాగం
రాగాలు తెలిపే భావాలు నిజమైనవి
లోకాలు మురిసే స్నేహాలు రుజువైనవి
అనురాగ రాగాల స్వరలోకమె మనదైనది

 
ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ 
చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళీ
రసమయం జగతి

నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నాదైన బ్రతుకే ఏనాడో నీదైనది
నీవన్న మనిషే ఈ నాడు నాదైనది
ఒక గుండె అభిలాష పది మందికి బ్రతుకైనది

ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళీ
రసమయం జగతి



2 comments:

పచ్చని పైరు..చల్లని గాలి..అల్లరి గోదారి.. ప్రేమికులని యెప్పుడూ ఇన్స్ పైర్ చేస్తూనే ఉంటాయి..

థాంక్స్ శాంతి గారు :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.