గోదారమ్మ సాక్షిగా చెట్టాపట్టాలేసుకుని పాటలు పాడుకుని ఏకమైన జంటలు ఎన్నో... వాటిలో ఈ అందమైన జంటను చూడండి వేటూరి వారి సాయంతో చమత్కారమైన పదాల అల్లికతో ఓ అందమైన పాట పాడేసుకుంటున్నారు మరి ఆ సరదా సంగతులేంటో మనమూ విందామా. పాటలను అందంగా చిత్రీకరించడంలో రాఘవేంద్రరావు గారి శైలి ప్రత్యేకం సన్నివేశానికి తగినట్లుగా బిందెలతో ఆర్టిస్టిక్ గా అరేంజ్ చేసి తీసిన తీరు అద్భుతం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : దేవత (1982)
సంగీతం : చక్రవర్తి
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల
ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లా కిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లూపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో
కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓరయ్యో..రావయ్యో..ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా..

మీగడంతా నీదేలేరా బుల్లోడా
ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లా కిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లూపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో
కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే
ఓలమ్మో..రావమ్మో..ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు..
ఆగడాల పిల్లోడైనా నీవోడు
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు..
ఆగడాల పిల్లోడైనా నీవోడు
ఈ కళ్ళకున్న ఆకళ్ళలోనా అందాల విందమ్మ నువ్వు
వాటేసుకుంటే వందేళ్ళ పంట వద్దంటే విందమ్మ నవ్వు
చేయ్యేస్తే చేమంతి బుగ్గా..చెంగావి గన్నేరు మొగ్గ
చేయ్యేస్తే చేమంతి బుగ్గా..చెంగావి గన్నేరు మొగ్గ
ఈడొచ్చి నీ చోటు ఈడుంది రమ్మంటే ఏడేసుకుంటావు గూడు
కౌగిళ్ళలో నన్ను కూడు..ఆకళ్ళకుంటాది కూడు..
కౌగిళ్ళలో నన్ను కూడు..ఆకళ్ళకుంటాది కూడు..
గుండెల్లో చోటుంది చూడు
ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లా కిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లూపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో
కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే
ఓరయ్యో..రావయ్యో..ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా..
మీగడంతా నీదేలేరా బుల్లోడా
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు..
ఆగడాల పిల్లోడైనా నీవోడు
నీ కళ్ళు సోక నా తెల్ల కోక అయ్యిందిలే గళ్ళ కోక
నీ మాట విన్న నా జారు పైట పాడిందిలే గాలిపాట
నీ కళ్ళు సోక నా తెల్ల కోక అయ్యిందిలే గళ్ళ కోక
నీ మాట విన్న నా జారు పైట పాడిందిలే గాలిపాట
కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళూ.. నే కోరిన మూడూ ముళ్ళు
కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళూ.. నే కోరిన మూడూ ముళ్ళు
పొద్దుల్లో కుంకాలు బొట్టెట్టి పోతుంటే కట్టెయ్యనా తాళిబొట్టు
నా మాటకీ యేరు తోడూ.. ఏరెండినా ఊరు తోడు..
నా మాటకీ యేరు తోడూ.. ఏరెండినా ఊరు తోడు..
నీ తోడులో ఊపిరాడు..
ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లా కిల్లా పడ్డాదమ్మో
ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లా కిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లూపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో
కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓలమ్మో..రావమ్మో..
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు..
ఆగడాల పిల్లోడైనా నీవోడు
ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా..
మీగడంతా నీదేలేరా బుల్లోడా
2 comments:
రాజమండ్రి విజయా టాకీస్ లో మొదటి సారి తిన్న ఉల్లిపాయ సమ్మోసాలు గుర్తొస్తాయండీ ఈ పాట వింటే..అవెంత బావుంటాయంటే, తరువాత తరువాత తమ్ముడ్ని బ్రతిమలాడి లంచమిచ్చి,ఇంటెర్వెల్ టైం కి వాడిని పంపి చిన్న సమ్మోసాలు తెప్పించుకుని లాగించేసే వాళ్ళం..
హహహ థియేటర్లో ఆనియన్ సమోసాల రుచి బయట ఎక్కడ కొన్నా రాదండీ అదేంటో మరి.. మొత్తానికి భలే గుర్తు చేశారు థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.