ఆదివారం, నవంబర్ 23, 2014

ఓ ఓహో చారుశీల...

గుణసుందరి కథ చిత్రం లోని ఈ పాట భలే ఉంటుంది. శివరాం గారు పాడిన విధానం మధ్యలో ఓహోఓఓ అనో లల్లల్ల అనో తీసే రాగాలు వినడానికి సరదాగా భలే ఉంటాయి. మీరూ ఈ పాట చూసీ వినీ ఈ సినిమాని మరోసారి తలచుకోండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : గుణసుందరికథ(1949)
సంగీతం : ఓగిరాల రామచంద్రరావు
సాహిత్యం : పింగళి
గానం : వి.శివరాం

ఓ..ఓహో.. చారుశీలా.. 
లేజవరాలా.. సొగసుభళా.. 
ఓ రూపబాలా.. చిందెను 
వలపు పులక లొలక బిర బిర.. 
కన్నుల్లో విందె అయి 
వెన్నెల్లో వసంతమై
కన్నుల్లో విందె అయి 
వెన్నెల్లో వసంతమై
చిన్నీ నీ హొయల్ గుబుల్ 
గుభాళించె నాహా జోహారులే..
చెంగావి చీర భళిలో.. రంగారే నీ అంగ భంగి
రంగేళీ పంట ఇంపుల్ సొంపుల్ జంపాలాడే.. 
లల్లల్లలాలలా.. లల్లల్లలాలలా.. 
లల్లలాలా లల్లల్లలాలా
లల్లల్లలాలలా.. లల్లల్లలాలలా.. 
లల్లలాలా లల్లల్ల

కుశాల్ బోణీ రసిక రమణి 
కుశాల్ బోణీ రసిక రమణి  
వగల్ చిమ్మీ వరించీ ఓహో.. ఓఓఓ..
ఓహో.. ఓఓఓ.. ఓహో.. ఓఓఓ..
నా మెళ్ళో దండై తల్లో పువ్వై నెగడే 
ముల్లోకాలేలే కేళిది 
ముల్లోకాలేలే కేళిది 
రావేలా బాలా బేలా నన్నో... ఓఓఓ...


2 comments:

పూర్తిగా వెస్టర్న్ స్టైల్లో సాగే ఈ పాట చాల బావుంటుంది వేణూజీ..భలే ఇష్టం నాకు..థాంక్యూ..

అవునండీ మంచి సరదా అయిన ట్యూన్.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.