మాయామశ్చీంద్ర చిత్రంలో సుశీల గారు గానం చేసిన ఒక చక్కని పాటను ఈరోజు తలచుకుందామా. ఇందులో వాణీశ్రీ గారు చాలా బాగుంటారు. సాహిత్యం ఎవరు రాశారో తెలియదు కానీ ఆకట్టుకుంటుంది. నాకు నచ్చిన ఈపాటను మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేయవచ్చు.
చిత్రం : మాయామశ్చీంద్ర (1975)
సంగీతం : సత్యం
సాహిత్యం : ??
గానం : పి.సుశీల
మగరాయ పంతామేలరా..
నే మరుబారి తాళజాలరా..
నా వన్నెలు చిన్నెలు నిన్నే కోరెరా..
చిగురాకు బాకూ ఆ వలరాజు దూసే
సెగలాటి వెలుగు ఆ నెలరాజు కాసే
ఎలదేటి మనసూ దులిచేను రారా
ఎదమదనాగ్ని రేగేను మారాములేలా..
మగరాయ పంతామేలరా..
నే మరుబారి తాళజాలరా..
నిను చూడగానే నా నెమ్మేను పొంగే..
నిను చేర అందాల కెమ్మోవి ఊరే..
చెమరించె కన్నూ నన్నేల రారా
అనురాగాల భోగాల లాలన శాయా
మగరాయ పంతామేలరా..
నే మరుబారి తాళజాలరా..
మనకోసమేగా ఈ పొదరిల్లు పూచే..
ఆఅ పొదరింటిలోనా విరిపాన్పు వేసే
వలచింది వనితా అలుసేల రా
నీనగుమోము కనలేని నా బతుకేలా
మగరాయ పంతామేలరా..
నే మరుబారి తాళజాలరా..
నా వన్నెల చిన్నెలు నిన్నే కోరెరా..
ఓ మగరాయ పంతామేలరా..
నే మరుబారి తాళజాలరా.ఆఆఆ..
2 comments:
చెక్కిన శిల్పంలా ఉండే వాణిశ్రీ అందం ఈ పాటలో యెవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది సుమండీ..నాకూ ఇది చాలా ఇష్టమైన పాట వేణూజీ..
థాంక్స్ శాంతి గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.