పాండవవనవాసం సినిమాలోని ఈ పాట చాలా మందికి తెలిసే ఉంటుంది కదా.. మొదట్లో పాట ఆపగానే వచ్చే "ఆపావే పాడు" అనే బిట్ బోలెడంత ఫేమస్ కదా... మా కాలేజ్ రోజుల్లో ఎవరన్నా పాడుతూ పాడుతూ మధ్యలో ఆపితే ఇదే మాడ్యులేషన్ తో అంటూ ఆటపట్టించేవాళ్ళం మేం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : పాండవ వనవాసం (1965)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సముద్రాల (సీనియర్)
గానం : ఘంటసాల, సుశీల
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సముద్రాల (సీనియర్)
గానం : ఘంటసాల, సుశీల
అ..అ..అ..అ...అ..అ..అ..
హిమగిరి సొగసులు....
మురిపించును మనసులు..
హిమగిరి సొగసులు....
హ్మ్.. ఆపావే పాడు...
హిమగిరి సొగసులు.....
మురిపించును మనసులు..
హిమగిరి సొగసులు.....
మురిపించును మనసులు..
చిగురించునేవో ఏవో ఊహలు...
హిమగిరి సొగసులు.....
మురిపించును మనసులు..
మురిపించును మనసులు..
చిగురించునేవో ఏవో ఊహలు...
హిమగిరి సొగసులు.....
మురిపించును మనసులు..
యోగులైనా మహాభోగులైనా..
మనసుపడే మనోజ్ఞసీమ....
అ..అ..అ..అ...అ..అ..అ..
యోగులైనా మహాభోగులైనా..
మనసుపడే మనోజ్ఞసీమ....
యోగులైనా మహాభోగులైనా..
మనసుపడే మనోజ్ఞసీమ....
సురవరులు సరాగాల చెలుల
అ..అ..అ..అ...అ..అ..అ..
సురవరులు సరాగాల చెలుల
కలిసి, సొలిసే అనురాగసీమ...
హిమగిరి సొగసులు.....
మురిపించును మనసులు..
మురిపించును మనసులు..
ఈ గిరినే ఉమాదేవి హరుని
సేవించి తరించేనేమో....
అ అ అ అ...ఆఆఅ..ఆఅ..
ఈ గిరినే ఉమాదేవి హరుని
సేవించి తరించెనేమో..
సేవించి తరించెనేమో..
సుమశరుడు రతీదేవి జేరి,
అ అ అ అ అ అ అ ఆ
అ అ అ అ అ అ అ ఆ
సుమశరుడు రతీదేవి జేరి...
కేళీ... తేలి... లాలించెనేమో...
కేళీ... తేలి... లాలించెనేమో...
హిమగిరి సొగసులు.....
మురిపించును మనసులు..
మురిపించును మనసులు..
అ అ అ అ...ఆఆఅ..ఆఅ..
హిమగిరి సొగసులు.....
మురిపించును మనసులు..
మురిపించును మనసులు..
అ అ అ అ...ఆఆఅ..ఆఅ..
మ్మ్మ్..మ్మ్మ్...
4 comments:
కనులతోనే నవరసాలు ఒలికించగల సావిత్రి..నవరస నటనా సార్వభౌముడు రామారావుగారు..ఇలాంటి పాటలు నిజంగా ఐ ఫీస్టే వేణూజీ..
అవును శాంతి గారు నిజంగా ఐ ఫీస్టే... కానీ ఈ వీడియో దొరకలేదండీ షేర్ చేద్దామంటే.. థాంక్స్ ఫర్ ద కామెంట్.
వేణూజీ..ఇదిగో మూవీ యు ట్యూబ్ లింక్..సాంగ్ కట్ చెసి వెయ్యవచ్చనుకుంట కదా..
https://www.youtube.com/watch?v=RrEfDxLE2QA
థాంక్స్ శాంతి గారు.. అలాగే వీడియో అప్డేట్ చేస్తాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.