బుధవారం, నవంబర్ 26, 2014

పాడలేను పల్లవైనా...

సింధుభైరవి చిత్రంలోని మరో చక్కని పాటను ఈరోజు తలచుకుందామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం: సింధుభైరవి (1985)
రచన: రాజశ్రీ
సంగీతం: ఇళయరాజా
గానం: చిత్ర

పాడలేను పల్లవైనా భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను
 పాడలేను పల్లవైనా భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను

పాడలేను పల్లవైనా భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను
తోచింది చెప్పాలనీ ఎదుటకొచ్చినిలుచున్నా
తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా

పాడలేను పల్లవైనా భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను

అమ్మజోల పాటలోన రాగమెంత ఉన్నదీ
పంటచేల పాటలోన భాష ఎంత ఉన్నదీ
ఊయలే తాళం పైరగాలే మేళం
మమతే రాగం శ్రమజీవనమే భావం
రాగమే లోకమంతా ఆ ఆ
రాగమే లోకమంతా కష్ట సుఖములే స్వరములంటా
షడ్జమ కోకిల గాన స్రవంతికి పొద్దుపొడుపే సంగతంటా

పాడలేను పల్లవైనా భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను

రాగానిదేముంది రసికులు మన్నిస్తే
తెలిసిని భాషలోనే తీయగా వినిపిస్తే
ఏ పాటైనా ఎద పొంగిపోదా
ఏప్రాణమైనా తనివితీరిపోదా
చెప్పేది తప్పో ఒప్పో ఓ ఓ
చెప్పేది తప్పో ఒప్పో రహస్యమేముంది విప్పి చెపితే
అహూ ఉహూ రోకటి పాటలో లేదా మధుర సంగీతం
ఆహూ ఊహూ రోకటి పాటలో లేదా మధుర సంగీతం

పాడలేను పల్లవైనా భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను
తోచింది చెప్పాలనీ ఎదుటకొచ్చినిలుచున్నా
తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా

పాడలేను పల్లవైనా భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను
మ ప ద మ పాడలేను పల్లవైనా
స రి గమ ప ద మ పాడలేను పల్లవైనా
ప ద ని స ని ద మ గ స రి పాడలేను పల్లవైనా
స స రి గ స రి గ మ గ స ప ద మ
మ మ ప ద మ ప ద ని ద మ ప ద ని
పదనిసరిగ సనిదమ పదనిస
నిదపద నిదమప దమగమ పదమగ మగస

సాసస సా సస సా స సరిగమ గమగసనిద
మా మమ మా మమ మా మ పదనిస నిసనిదమగ
సస రిరి గగ మమ పప దద నిని సస
నిససస నినిదనిద
మపదని దని దదమా
గమగ సరిగమ గమపద మపదని
సరిగమ గమసనిదమగ
మరి మరి నిన్నే మొరలిడ నీ మనసున దయరాదా
మరి మరి నిన్నే మొరలిడ నీ మనసున దయరాదా
మరి మరి నిన్నే మరి మరి నిన్నే ఏ ఏ...


లిరిక్స్ అపురూప గీతమాలిక నుండి సేకరించబడినవి, వారికి ధన్యవాదాలు.

2 comments:

శాస్త్రీయ సంగీతం కేవలం ఒక వర్గం ప్రేక్షకులకి మాత్రమే చెందినది కాదని మనసుకి హత్తుకునేలా తెలియచేస్తుంది ఈ పాట..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.