గురువారం, నవంబర్ 27, 2014

ఎవరీ అమ్మాయని అడిగా...

ఇళయరాజా గారి అబ్బాయ్ యువన్ శంకర్ రాజా కంపోజిషన్ లో వచ్చిన ఒక అద్భుతమైన పాట ఇది. వెన్నెలకంటి గారి లిరిక్స్ కూడా డబ్బింగ్ పాట అయినా చాలా చక్కగా ఉంటాయి. హరిచరణ్ గానం గురించి చెప్పనే అక్కర్లేదు. చిత్రీకరణ సైతం నాకు చాలా ఇష్టం. నాకు నచ్చిన ఈపాట మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : నేనే అంబాని (2010)
సంగీతం : యువన్ శంకర్ రాజా
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : హరిచరణ్

ఎవరీ అమ్మాయని అడిగా ఆనాడు
తానె నా ప్రాణమని తెలిసే ఈనాడు
నన్నే చూసేనే ఏదో  అడిగెనే,
మాయే  చేసెనే.. ఒహోహో
చూపుతో  నవ్వెనే  చూపులు  రువ్వేనే,
గుండె  గిల్లెనే  ఒహోహో
చుక్కల్లో నడుమ జాబిల్లి  తానే
రెక్కలు తొడిగే సిరిమల్లి తానై
ఏదో  చేసే  నన్నే ....

ఎవరీ అమ్మాయని అడిగా ఆనాడు
తానె నా ప్రాణమని తెలిసే ఈనాడు

 
మా  ఇంటి ముంగిట్లో  తను వేసే ముగ్గులు
ఎప్పటికీ చెరిగి  పోరాదంటా
తన  పెదవుల  మందారం
తన  పాపిట  సింధూరం
నా గుండెకి  సూర్యోదయమంటా
అందాల  గాజుల  లాగా
తన చేయి స్పర్శ తగిలితే  చాలు
తన కాలి మువ్వ  సవ్వడి  నేనై , 
కల కాలముంటే  మేలు
కమ్మని చెవిలో కబురే చెప్పెనే
సిగ్గులె  బుగ్గ  మొగ్గైంది  నీవేనే
ఏదో చేసే నన్నే ..హే  హే ...

ఎవరీ అమ్మాయని అడిగా ఆనాడు
తానె నా ప్రాణమని తెలిసే ఈనాడు


నే  తనని చూస్తే ఎటో చూస్తుంది
నే చూడకుంటే నన్నే  చూసే
తన నవ్వు చూపి, నే చూస్తే ఆపి
పైపైకి  నటనేదో చేసే
స్త్రీ హృదయం అద్వైతం లాగా
ఏనాడూ  ఎవరి కర్థమే కాదు
మగవాడి మనసూ తపియించే  వయసు
ఆడవాళ్ళకి  అలుసు
మది  గాయపడ్డాక  నాకోసం  వస్తుంది
వానే  వెలిసాక  గొడుగిచ్చి నట్టుంది
ఏదో చేసే నన్నే  ఏ  హే  హే ....

ఎవరీ అమ్మాయని అడిగా ఆనాడు
తానె నా ప్రాణమని తెలిసే ఈనాడు
నన్నే చూసేనే ఏదో  అడిగెనే,  
మాయే  చేసెనే.. ఒహోహో
చూపుతో  నవ్వెనే  చూపులు  రువ్వేనే,  
గుండె  గిల్లెనే  ఒహో హో
చుక్కల్లో నడుమ జాబిల్లి  తానె
రెక్కలు తొడిగే సిరిమల్లి తానై
ఏదో  చేసే  నన్నే  హే....

2 comments:

ఇళైరాజాగారి పాటల్లా విన్నవెంటనే ఇన్స్టెంట్ గా మనసు పొరల్లోకి లోకి దూసుకు పోకపొయినా..ఒక్కోసారి మెల్ల మెల్లగా మెస్మరైజ్ చేస్తూ మనని చుట్టేస్టాయి యువన్ బాణీలు..

అవునండీ ప్రత్యేకించి ఈ పాట చాలా బాగుంటుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.