బుధవారం, నవంబర్ 05, 2014

మనవే వినవా...

ఎనభైలలో వచ్చిన ఒక మంచి హాస్య చిత్రం "గోపాల్రావుగారి అమ్మాయి" లోని ఈ చక్కని పాట ఈరోజు మీకోసం. చక్రవర్తి గారి సంగీతం చక్కని రిథమ్, క్లాసికల్, వెస్ట్రన్ ల మధ్య మారుతూ భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందీ పాటలో. అలాగే వేటూరి గారి సాహిత్యం కూడా చక్కగా ఉంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : గోపాల్రావుగారి అమ్మాయి (1980)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : మాధవపెద్ది రమేష్, సుశీల

మనవే వినవా మనసే కనవా
మది లోపలి మాటను మన్నించవా
కలలే మరిచి కనులే తెరిచి
నిజమేదో స్వామీ గుర్తించవా
ఇక ఒంటిగ నన్నూ వదిలెయ్యవా..

మనవే విననా మనసే కననా
మది లోపలి మాటను మన్నించనా
గతమే మరచి కనులే తెరచి
నిజమైతే స్వామీ గుర్తించనా
ఇక ఒంటరి తనమే వదిలించనా..

మనవే వినవా మనసే కనవా
మది లోపలి మాటను మన్నించవా

నిను చూడగనే నే బెంగపడి
సంపెంగలలో అది దాచుకుని
చిరునవ్వులకే మది జివ్వుమని
కసి చూపులతో కబురంపుకొని
పరుగులు తీసే పరువంతో
పైటలు జారే అందంతో
చక్కలిగిలిగా సరసాలాడే
చలి చలిగా సరిగమ పాడే
వలపులు పిలిచే ఈ వేళలో
వయసులు తెలిసే ఈ వేళలో

మనవే వినవా మనసే కనవా
మది లోపలి మాటను మన్నించవా
గతమే మరచి కనులే తెరచి
నిజమైతే స్వామీ గుర్తించనా
ఇక ఒంటరి తనమే ఒదిలించనా..

తొలిచూపులనే మునిమాపులుగా 
మరుమల్లెల జల్లులు జల్లుకుని 
బిగి కౌగిలినే నా లోగిలిగా 
అరముద్దుల ముగ్గులు పెట్టుకుని 
కలలైపోయిన కన్నులతో 
వలలైపోయిన చూపులతో 
ప్రేమే ముదిరీ పెళ్ళైపోయీ 
పెళ్ళే కుదిరీ ఇల్లైపోయే 
మనసులు కలిసే ఈ వేళలో 
మమతలు విరిసే ఈ వేళలో

మనవే విననా మనసే కననా
మది లోపలి మాటను మన్నించనా
గతమే మరచి కనులే తెరచి
నిజమైతే స్వామీ గుర్తించనా
ఇక వంటరి తనమే వదిలించనా..

మనవే వినవా మనసే కనవా
మది లోపలి మాటను మన్నించవా
కలలే మరిచి కనులే తెరిచి
నిజమేదో స్వామీ గుర్తించవా
ఇక ఒంటిగ నన్నూ వదిలెయ్యవా..


2 comments:

మంచి మూవీ..పక్కింటి అమ్మాయి బ్లాక్&వైట్ మూవీ కూడా చాలా బావుంటుంది..అలాగే పడోసన్ కూడా..ఇందులోదే 'చిలుకా పలకవే" సాంగ్ ప్రెజంట్ చేయగలరా..

తప్పకుండా వేస్తాను శాంతి గారు.. థాంక్స్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.