ఇళయరాజా, వేటూరి, వంశీ గార్ల కలయికలో పాటల గురించి వర్ణించడానికి మాటలు సరిపోవేమో కదా... అలాంటి కలయికలో వచ్చిన ఒక అద్భుతమైన పాట ఈ "జిలిబిలి పలుకుల" పాట. నాకు చాలా ఇష్టమైన ఈపాటను మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : సితార (1983)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన.. ఓ మైనా మైనా
కిలకిల నగవుల వలపులు చిలికిన.. ఓ మైనా మైనా
మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార
మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార
మధువుల పెదవుల మమతలు విరిసిన.. ఓ మైనా ఓ మైనా
కలలను పెంచకు కలతను దాచకు ఏమైనా.. ఓ మైనా
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన.. ఓ మైనా మైనా
కిలకిల నగవుల వలపులు చిలికిన.. ఓ మైనా మైనా
అడగనులే చిరునామా.. ఓ మైనా ఓ మైనా
చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా
తారలకే సిగపువ్వా... తారాడే సిరిమువ్వా
తారలకే సిగపువ్వా... తారాడే సిరిమువ్వా
హరివిల్లు రంగుల్లో వర్ణాలే
చిలికిన చిలకవు ఉలకవు పలకవు.. ఓ మైనా ఏమైనా
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన... ఓ మైనా మైనా
ఉరుములలో అలికిడిలా వినిపించే ఈ మైనా
మెరుపులలో నిలకడగా కనిపించే ఈ మైనా
ఎండలకే అల్లాడే... వెన్నెలలో క్రీనీడ
ఎండలకే అల్లాడే... వెన్నెలలో క్రీనీడ
వినువీధి వీణల్లో రాగంలా
ఆశల ముంగిట ఊహల ముగ్గులు.. నిలిపేన ఏమైనా
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన.. ఓ మైనా మైనా
తొలకరి వయసుల మిణుగురు సొగసులదీ మైనా మైనా
మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార
గుడికే చేరని దీపం పడమటి సంధ్యారాగం
మధువుల పెదవుల మమతలు విరిసిన... ఓ మైనా ఓ మైనా
చుక్కలు అందక దిక్కుల దాగిన నేనేలే ఆ మైనా
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
తొలకరి వయసుల మిణుగురు సొగసులదీ మైనా మైనా
4 comments:
వంశీ గారు రాసిన "మహల్లో కోయిల" కంటే తీసిన "సితార" చాలా చాలా బావుంది..
థాంక్స్ శాంతి గారు.
"మినుగురు" కాదు. మిణుగురు
థ్యాంక్సండీ.. పోస్ట్ లో సరిచేశాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.