మంగళవారం, ఫిబ్రవరి 11, 2014

వినిపించని రాగాలే / నీలి మేఘమాలవో

తరాలు ఎన్ని మారినా సినిమా తీయడంలో నైపుణ్యత ఎంత మారినా ఎన్ని కొత్త టెక్నాలజీలు అందుబాటులో కొచ్చినా మారనిది ప్రేమ ఒకటే. నిత్యనూతనంగా ఎప్పటికప్పుడు ఆ తరం ప్రేక్షకులను ఆకట్టుకునే కొత్త కొత్త ప్రేమకథలు పుట్టుకొస్తూనే ఉన్నాయి, వాటిని ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఒకనాటి ప్రేమ గీతాలు అంటే మరీ సినిమా మొదలైన ముప్పై, నలభైలలో కాకున్నా అరవైలలో ప్రేమగీతాలు ఎలా ఉండేవో మచ్చుకి ఈ రెండు పాటలలో చూడండి. "వినిపించని రాగాలే కనిపించని అందాలే" అంటూ కథానాయిక ప్రేమ గురించి ఎంత అందంగా పాడుతుందో మీరూ చూసి విని ఆస్వాదించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం:  సుశీల

ఓహో..ఓ...ఓ...ఆహాఅ..ఆ ...ఆ....ఓ....ఆ....
వినిపించని రాగాలే కనిపించని అందాలే
అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే
వినిపించని రాగాలే.. ఏ ఏ...

తొలిచూపులు నాలోనే వెలిగించే దీపాలే
తొలిచూపులు నాలోనే వెలిగించే దీపాలే
చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే
వలచే మనసే మనసు

వినిపించని రాగాలే ఏ ఏ...
వలపే వసంతములా పులకించి పూచినది
వలపే వసంతములా పులకించి పూచినది
చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవీ
విరిసే వయసే వయసు

వినిపించని రాగాలే..ఏఏ...
వికసించెను నా వయసే మురిపించు ఈ సొగసే
విరితేనెల వెన్నెలలో కొరతేదో కనిపించే
ఎదలో ఎవరో మెరిసే
 
వినిపించని రాగాలే కనిపించని అందాలే...
అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే
వినిపించని రాగాలే ఏఏ..

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఇక ఇది ఒక ప్రియుడు తన ప్రేయసిని తలచుకుంటూ పాడుతున్న మధురగీతం. ఫేమస్ "చౌద్వీకా చాంద్" కు తెలుగు రీమేక్, సంగీతం సాలూరు వారో రాజన్-నాగేంద్ర గారో చిన్న సంశయం ఉంది ఐతే పి.బి.శ్రీనివాస్ గారి గళం మాత్రం చాలా చాలా చక్కగా అమరింది. చిత్రీకరణ కాస్త నిరాశపరిచింది కానీ వినడానికి మాత్ర్రం ఒరిజినల్ కి ఏమాత్రం తీసిపోని పాట. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.



చిత్రం : మదనకామరాజు కథ(1962)
సాహిత్యం : పింగళి నాగేంద్ర రావు
సంగీతం : సాలూరు రాజేశ్వర రావు / రాజన్-నాగేంద్ర
గానం : పీ బీ శ్రీనివాస్

నీలి మేఘమాలవో నీలాల తారవో
నీ సోయగాలతో మదినీ దోచిపోదువో 

 నీలి మేఘమాలవో నీలాల తారవో
నీ సోయగాలతో మదినీ దోచిపోదువో
నీలి మేఘమాలవో

నీ మోములోన జాబిలి దోబూచులాడెనే
నీ కురులు తేలి గాలిలో ఉయ్యాలలూగెనే
నిదురించు వలపు మేల్కొలిపి దాగిపోదువో
 
నీలి మేఘమాలవో..ఓఓ...
నీ కెంపు పెదవి తీయని కమనీయ కావ్యమే
నీ వలపు తనివి తీరని మధురాల రావమే
నిలచేవదేల నా పిలుపు ఆలకించవో
 
నీలి మేఘమాలవో..ఓఓ..

రాదేల జాలి ఓ చెలీ ఈ మౌనమేలనే
రాగాల తేలిపోదమే జాగేల చాలునే
రావో యుగాల ప్రేయసీ నన్నాదరించవో

నీలి మేఘమాలవో నీలాల తారవో
నీ సోయగాలతో మదినీ దోచిపోదువో...

4 comments:

Lyrics superbgaa..entha bagunnaayi.
వినిపించని రాగాలే కనిపించని అందాలే
అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే:-):-)

థాంక్స్ కార్తీక్ గారు అవునండీ బ్యూటిఫుల్ లిరిక్స్.. :)

ఆ రోజుల్లో పాటలే వినిపించేవేమో వేణూజీ..ఇప్పటి మ్యూజిక్ హోరు లో పాటని పోల్చు కోవడమే కష్టంగా వుంది..అవునంటారా..

కరెక్ట్ శాంతిగారు, థాంక్స్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.