మంగళవారం, ఫిబ్రవరి 04, 2014

ఆ కనులలో కలల నా చెలీ

ఇళయరాజా వంశీల కలయికలో రూపుదిద్దుకున్న మరో అద్భుతమైన పాట... నాకు చాలా చాలా ఇష్టమైన పాట తన చెలిగురించి కథానాయకుడు సినారే గారి సాయంతో వర్ణించే తీరు దానిని చిత్రీకరించిన వైనం అద్భుతం. మీరూ చూసి ఆనందించండి ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 



చిత్రం : ఆలాపన (1986)
సంగీతం : ఇళయరాజా  
సాహిత్యం : సినారె
గానం : బాలు, జానకి

ఆఆ...ఆఆఆఆ..ఆఅ...ఆఆ ఆఆ ఆఆ...
ఆ కనులలో కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
ఆ కనులలో కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై 

దిద్దితై కిటతై ధిమితై తక
దిద్దితై కిటతై ధిమితై తక

ఆ..ఆఅ.ఆఅ.ఆ..
దిద్దితై కిటతై ధిమితై తక
దిద్దితై కిటతై ధిమితై తక
తకధిమి తకఝణు - తకధిమి తకఝణు
తకధిమి తకఝణు - తకధిమి తకఝణు
తత్ తరికిట తత్ తరికిట తత్ తరికిట 
తకిట తకిట తకిట తకధిమి 

నిదురించు వేళ ..దసనిస దసనిస దనిదనిమ
హృదయాంచలాన..ఆ..ఆ..ఆ..ఆ
అలగా పొంగెను నీ భంగిమ..గగసనిస.
అది రూపొందిన స్వర మధురిమ
సనిదనిస..
ఆ రాచ నడక రాయంచ కెరుక
ఆ రాచ నడక రాయంచ కెరుక
ప్రతి అడుగూ శృతిమయమై
కణకణమున రసధునులను మీటిన

ఆ... కనులలో కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
ఆ కనులలో కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై

మగసా.. ఆ.ఆఆ. 
సనిదమగ మగసా.. ఆ.ఆఆఅ.
గసనిదమ దనిసా.. ఆఆఆఅ.. మదని.. ఆఆఆ.. 
సానిదనిసగ మాగసగమగ నిదసనిదమగ గమపసగమగని

నీ రాకతోనె ఆ.ఆఆఅ ఆఅ . 
ఈ లోయలోనె దసనిస దసనిస దనిదనిమా..
అణువులు మెరిసెను మణిరాసులై.. ఆ..ఆఆ
మబ్బులు తేలెను పలువన్నెలై..ఆఆఆ
ఆ వన్నెలన్ని ఆ చిన్నెలన్ని
ఆ వన్నెలన్ని ఆ చిన్నెలన్ని
ఆకృతులై సంగతులై
అణువణువున పులకలు ఒలికించిన

ఆ... కనులలో కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
గొంతులోన గుండె పిలుపులా
సంధ్యలోన అందె మెరుపులా
ఆ... కనులలో కలల నా చెలీ
ఆలాపనకు ఆది మంత్రమై

5 comments:

థాంక్స్ శ్రావ్యా..
థాంక్స్ కార్తీక్..

ఈ మూవీ యెడిటింగ్ లో యేదో ప్రోబ్లం అనుకుంట వేణూజీ..కొన్ని సీన్స్ అస్సలు కనక్టివిటీ లేకుండా వుంటాయి..బట్ ఆ మ్యూజిక్ కోసం యెస్పెషల్లీ భానుప్రియ కోసం యెన్ని సార్లైనా చూడాలి అనిపిస్తుంది..అఫ్కోర్స్ వంశీ మార్క్ షాట్స్ గురించి కూడా..

థాంక్స్ శాంతి గారు.. సినిమా గురించి నో కామెంట్స్ కానీ మీరన్నట్లు ఆమ్యూజిక్ ప్లస్ భానుప్రియ మాత్రం ఆసమ్ :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.