నిన్న తొంభైలలో పాటలు విన్నారు కదా ఇంకో ఇరవై ఏళ్ళు ముందుకు వస్తే ప్రస్తుత కాలంలో వస్తున్న పాటలలో ఈ రెండు పాటలూ చాలా బాగుంటాయ్. ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన కె.ఎమ్.రాధాకృష్ణ స్వరకల్పనలో వచ్చిన ఈ పాటకు ఆషా భోంస్లే స్వరం ప్లస్ తన ఉచ్చారణే ఒక సొగసును అద్దాయి అనిపిస్తుంది. తెలుగు భాషాప్రేమికులకు ఈ మాటలు మింగుడు పడకపోవచ్చు కానీ కాజల్ కు ఈ వైవిధ్యమైన స్వరంతో ఇలా పాడడం చాలా చక్కగా సూట్ అయిందని నా అభిప్రాయం. ఈపాట చిత్రీకరణ కూడా కృష్ణవంశీ శైలిలో చాలాబాగుంటుంది మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.
చిత్రం : చందమామ (2007)
సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్
సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్
సాహిత్యం : అనంత శ్రీరామ్
గానం : ఆషా భోంస్లే, కె.ఎం. రాధాకృష్ణన్
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
తరికిటతోం తనకధీం తంగిట తరికటతక
తానిదానిదా తానిదానిదా
గమద సనిద ఆ...
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
ఆ ఆ ఆ ఆ ఆ
సనిసస నినిస నిస ససనిసస నినిసస నిస
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
పరుగులుగా ఆఆ.. పరుగులుగా అవే ఇలా
ఇవ్వాళ నిన్నే చేరాయి
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
ససనిపస ససనిపరి
ససనిపస ససనిపరి
ససనిపస ససనిపరి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ రారెరెరాఆ..
కళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే
పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే
శ్వాసలోన పెనుతుఫానే ప్రళయమౌతోందిలా ఆ ఆ
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
ఆ ఆ ఆ ఆ ఆ
గరిగ మమగ గరిగ మమగరిసని
తరికిటతోం తరికిటతోం
తరికిటతోం తరికిటతోం
తరికిటతరికిటతోం తరికిటతరికిటతోం తరికిటతోం
ఆ ఆ ఆ ఆ రారెరెరాఅ..ఆఅ..
మౌనమే విరుగుతూ బిడియమే ఒరుగుతూ
మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ
నిన్ను చూస్తూ ఆవిరౌతూ అంతమవ్వాలనే
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
పరుగులుగా ఆఆ... పరుగులుగా అవే ఇలా
ఇవ్వాళ నిన్నే చేరాయి
మణిశర్మ స్వరసారధ్యంలో అభిరుచి ఉన్న దర్శకుడు చైతన్య దర్శకత్వంలో వచ్చిన బాణం చిత్రంలోని "నాలో నేనేనా.." పాట కొత్తపాటలలో ది బెస్ట్ పాట, చాలా బాగుంటుంది. సోలో లాగా అనిపించే ఈ డ్యూయెట్ ని మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి. ఈ పాట గురించి గతంలో సినిమా విడుదలైనపుడు నేను రాసుకున్న టపా ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : బాణం(2009)
సహిత్యం : రామజోగయ్య శాస్త్రి
సంగీతం : మణి శర్మ
గానం : హేమచంద్ర , సైంధవి
నాలో నేనేనా.. ఏదో అన్నానా..
నాతో నేలేని మైమరపునా..
ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో..
విన్న మాటేదో నిన్నడగనా
అలా సాగిపోతున్న నాలోన
ఇదేంటిలా కొత్త ఆలోచన
మనసే నాదీ.. మాటే నీదీ..
ఇదేం.. మాయో...
నాలో నేనేనా.. ఏదో అన్నానా..
నాతో నేలేని మైమరపునా..
ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో..
చిన్న మాటేదో నిన్నడగనా..
ఔనూ కాదు తడబాటునీ..
సహిత్యం : రామజోగయ్య శాస్త్రి
సంగీతం : మణి శర్మ
గానం : హేమచంద్ర , సైంధవి
నాలో నేనేనా.. ఏదో అన్నానా..
నాతో నేలేని మైమరపునా..
ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో..
విన్న మాటేదో నిన్నడగనా
అలా సాగిపోతున్న నాలోన
ఇదేంటిలా కొత్త ఆలోచన
మనసే నాదీ.. మాటే నీదీ..
ఇదేం.. మాయో...
నాలో నేనేనా.. ఏదో అన్నానా..
నాతో నేలేని మైమరపునా..
ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో..
చిన్న మాటేదో నిన్నడగనా..
ఔనూ కాదు తడబాటునీ..
అంతో ఇంతో గడి దాటనీ..
విడి విడి పోనీ పరదానీ..
విడి విడి పోనీ పరదానీ..
పలుకై రానీ ప్రాణాన్నీ..
ఎదంతా పదాల్లోన పలికేనా..
నా మౌనమే ప్రేమ ఆలాపన..
మనసే..నాదీ.... మాటే..నీదీ..
ఇదేం.. మాయో..
నాలో నేనేనా.. ఏదో అన్నానా..
నాతో నేలేని మైమరపునా..
ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో..
చిన్న మాటేదో నిన్నడగనా..
దైవం వరమై దొరికిందనీ
ఎదంతా పదాల్లోన పలికేనా..
నా మౌనమే ప్రేమ ఆలాపన..
మనసే..నాదీ.... మాటే..నీదీ..
ఇదేం.. మాయో..
నాలో నేనేనా.. ఏదో అన్నానా..
నాతో నేలేని మైమరపునా..
ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో..
చిన్న మాటేదో నిన్నడగనా..
దైవం వరమై దొరికిందనీ
నాలో సగమై కలిసిందనీ
మెలకువ కానీ హృదయాన్నీ
మెలకువ కానీ హృదయాన్నీ
5 comments:
ఈ సిరీస్లో పాటలు బావున్నాయి వేణూ. నాకు చందమామ సినిమాలో పాటలు అన్నీ (ఇదే కాస్త తక్కువ, బహుశా ఆశా వల్లే అనుకుంటా) చాలా ఇష్టం.
'నాలో నేనేనా' పాటతో హేమచంద్రకి అభిమానిని అయిపోయాను. లిరిక్స్ కన్నా కూడా హేమచంద్ర గొంతులో అది పలికిన మంద్రత, ఆర్ద్రత నాకు బాగా నచ్చాయి ఈ పాటలో.
ఈ రెండింటిలో రెండోది నాకు బాగా ఇష్టమండీ! ఆ అమ్మాయిని అలా చూసాకా వేరే సినిమాలో మామూలుగా(కమర్షియల్ గా) చూడ్డం మాత్రం కాస్త ఇబ్బందిగానే అనిపించింది :)
మొదటి పాట కూడా బావుంటుంది కానీ ఆశాతో కాస్త బాగా పాడించాల్సింది "నడకలు నేర్పావూ..." అన్నప్పుడు ఆ నేర్పావూని వినడం కష్టం! మ్యూజిక్ డైరెక్టర్ కానీ రికార్డింగ్ చేసేవారు గానీ ఎందుకు పట్టించుకోలేదో అనుకుంటాం మేము..:( సాహిత్యం మాత్రం సూపర్. కృష్ణవంశీ సినిమాల్లో సంగీతమే కాదు సాహిత్యం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది!
థాంక్స్ పద్మ గారు :-) హహహ బహుశా కాదండీ ఖచ్చితంగా ఆశా వల్లే మీకు సపోర్ట్ గా తృష్ణ గారు కూడా ఉన్నారు చూడండి :-)
అవునండి హేమచంద్ర చాలా బాగా పాడాడు ఆ పాట.
థాంక్స్ తృష్ణ గారు :-) అవునండీ కృష్ణవంశీ సినిమాల్లో సాహిత్యం కూడా చాలా బాగుండేది. మళ్ళీ అలా శ్రద్దగా తీస్తాడేమోనని ఎదురు చూస్తున్నాను.
నాలో నేనేనా' లో రోహిత్ క్యారెక్టరైజేషన్ చాలా బావుంటుంది వేణూజీ..యెగిరి దూకి వంద మందిని ఒంటి చేత్తో చిత్తు చేసే పాత్రలు, మూస సినిమాలు చూసి చూసి బోరు కొట్టేసిన వాళ్ళకి చలా హాయిగా అనిపిస్తుందీ మూవి..
థాంక్స్ శాంతి గారు, అవునండీ బాణం నాకుకూడా చాలా నచ్చిన సినిమా.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.