సోమవారం, ఫిబ్రవరి 03, 2014

లేత చలి గాలులు...

రాజన్ నాగేంద్ర గారి స్వర సారధ్యంలో బాలు సుశీల పాడిన ఈ పాట నాకు చాలా ఇష్టమైన రొమాంటిక్ పాట. మీరూ ఆస్వాదించండి.. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసిన వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మూడుముళ్ళు(1983)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : జ్యోతిర్మయి
గానం : బాలు, సుశీల

లేత చలి గాలులూ హొయ్ దోచుకోరాదురా
చలి వెలుగు వెన్నెలలు నిను తాకగా తగవురా
లేత చలి గాలులూ హోయ్ దోచుకోలేవులే
మన వలపు వాకిలిని అవి తాకగలేవులే

లేత చలి గాలులూ హొయ్ దోచుకోరాదురా

అందాల నా కురులతో వింజామరలు వీచనా
అందాల నా కురులతో వింజామరలు వీచనా
రాగం భావం స్నేహం మోహం నిన్నే వేడనా
నీ కురులవీవనలకు నా హృదయమర్పించనా
రూపం దీపం శిల్పం నాట్యం నీలో చూడనా
కనుల భాష్పాలు హహహ కలల భాష్యాలు లలలా ఒహొహో
వలపుగా సాగి వలలుగా మూగి కాలాన్ని బంధించగా

లేత చలి గాలులు హొయ్ దోచుకోరాదురా
చలి వెలుగు వెన్నెలలు నిను తాకగా తగవురా
లేత చలి గాలులు దోచుకోలేవులే

అధరాల కావ్యాలకు ఆవేశమందించనా
అధరాల కావ్యాలకు ఆవేశమందించనా
వలపే పిలుపై వయసే ముడుపై నిన్నే చేరనా
మందార ముకుళాలతో పాదాలు పూజించనా
అలనై కలనై విరినై ఝురినై నిన్నే కోరనా
హృదయనాదాల హా.హా.హా.. మధురరాగాల..హాయ్ లలలా
చిగురు సరసాల నవవసంతాల విరులెన్నో అందించగా

లేత చలి గాలులు దోచుకోలేవులే
మన వలపు వాకిలిని అవి తాకగలేవులే 
ఆఅహాహాహా..ఊహు..హూ.హు.హు..

7 comments:

ప్రియుడిని మరిచి పోలేక మొదటి రాత్రే హీరోఇన్ స్లీపింగ్ పిల్స్ తీసుకోవడం..తరువాత భర్తకి తన కధ చెప్పడం..డెఫ్నెట్ గా ఆ రోజుల్లో బాపు గారు ఓ నావెల్ థాట్ ని చాలా అందం గా ప్రెజెంట్ చేశారు..ఇక బాలు గొంతైతే.. బాపుగారి తెలుగంత తియ్యగా..రమణగారి పలుకుల్లా నులి వెచ్చగా ప్రతి గుండెనీ తాకుతుంది..

థాంక్స్ శాంతి గారు.. బాలు గొంతు గురించి భలే చెప్పారండి... నిజమే బాపురమణ గార్లు చాలా నావెల్ థాట్ తో తీసిన సినిమా ఇది.

థాంక్స్ ఎ లాట్ అజ్ఞాత గారూ కరెక్ట్ చేశాను. ఇంత బ్లండర్ ఎలా చేశానో అర్ధంకావట్లేదు... బహుశా రాధికా చంద్రమోహన్ లను చూడగానే నాకు బాపుగారి రాథాకళ్యాణమే గుర్తొచ్చి ఉంటుంది. ఇది జంధ్యాలగారి మూడుముళ్ళు సినిమాలోని పాట కదా.

Sp బాలుగారికి పోటీలేదు పోలికలు లేవు సంగీతం కోసమే జన్ములు అయ్యారనుకొంటాను నేను.నెను SP గారికి పెద్ద.........ఫ్యాన్ అండి బాలుగారు బలుగారే

అబ్బో బాలుగారిని ఎవరితోనూ పోల్చకూడదు.ఎందుకంటే ఆయన మహానుభావుడుఅంతే.

మీ అభిమానం మాటలలో కనిపిస్తుందండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.