ఆదివారం, ఫిబ్రవరి 23, 2014

కలనైనా క్షణమైనా...

ఈ పాటలో బాలు గొంతు ఎంత బాగుంటుందో నాకు చాలా ఇష్టం. తను ఎన్టీఆర్ ఏఏన్నార్ లాంటి పెద్ద హీరోలకి కాకుండా చంద్రమోహన్ లాంటి వారికి పాడేటప్పుడు స్వచ్చంగా స్వేచ్చగా పాడతారనిపిస్తుంటుంది నాకు బహుశా అందుకేనేమో ఈ పాటలలో మరింత బాగుంటుంది. ఇక సినారే గారి పదాల ఎంపిక సింపుల్ అండ్ స్వీట్ అనిపించే పాటలలో ఇదీ ఒకటి... మీరూ ఆస్వాదించండి, ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రాధాకళ్యాణం (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల


ఊహూహూ..ఆఆఆఅ..లలలలలాఅ..ఆఅఅ 

ఊఊహుహూ...ఆఆఆఆఆఆ
కలనైనా క్షణమైనా మాయనిదే
మన ప్రేమా.. మన ప్రేమా
కలకాలం కావ్యంలా నిలిచేదే
మన ప్రేమా.. మన ప్రేమా
 
కలనైనా క్షణమైనా...ఆఆఅ.ఆఆఅ.. 

 నీ కళ్ళల్లో తొంగి చూడనిదే
నిదురేది ఆ రేయి నా కళ్ళకు
నీ కళ్ళల్లో తొంగి చూడనిదే
నిదురేది ఆ రేయి నా కళ్ళకు
నీ పాట మనసారా పాడనిదే
నిలకడ ఏదీ నా మనసుకూ
నీ పాట మనసారా పాడనిదే
నిలకడ ఏదీ నా మనసుకూ

ఊపిరిలో.. ఊపిరిలా.. ఒదిగేదే.. మన ప్రేమా

కలనైనా క్షణమైనా..ఆఆఅ..ఆఆఆ..

నా చెంపకు ఎంతటి ఉబలాటమో
నీ చెంపతో చెలగాటమాడాలని
నా చెంపకు ఎంతటి ఉబలాటమో
నీ చెంపతో చెలగాటమాడాలని
నా పెదవికి ఎంతటి ఆరాటమో
నీ పెదవిపై శుభలేఖ రాయాలని
నా పెదవికి ఎంతటి ఆరాటమో
నీ పెదవిపై శుభలేఖ రాయాలని
కౌగిలిలో.. ఊహూ.. కౌగిలిలా.. ఊఊ... 
కరిగేదే.. మన ప్రేమా

కలనైనా క్షణమైనా మాయనిదే
మన ప్రేమా మన ప్రేమా
కలకాలం కావ్యంలా నిలిచేదే
మన ప్రేమా మన ప్రేమా
 
 
కలనైనా క్షణమైనా...ఆఆఅ.ఆఆఅ.. 
 

2 comments:

బాలు గారి గొంతులో పలికే మాధుర్యాన్ని కలల సెల్యులాయిడ్ లో ఆస్వాదించడం చాలా బావుంటుంది..
వీలైతే..యెడారిలో కోయిల.. పాట ప్రెజెంట్ చేయగలరా..

కలల సెల్యులాయిడ్ బాగుందండీ శాంతి గారు.. కరెక్ట్ గా చెప్పారు. ఎడారిలో కోయిల త్వరలో ప్రజంట్ చేస్తాను. థాంక్స్.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.