శనివారం, ఫిబ్రవరి 15, 2014

ముద్దుల జానకి పెళ్ళికి

నిన్నటిదాకా ప్రేమ గీతాలలో ఓలలాడాముగా ఇక తర్వాతేముంటుంది పెళ్ళే మరి :-) పెద్దరికం సినిమాలోని ఈ పెళ్ళిపాట నాకు చాలా ఇష్టం. నిజానికి దీనిని పెళ్ళి ఏర్పాట్ల పాట అని చెప్పాలేమో, చిత్రీకరణ చాలా బాగుంటుంది అచ్చ తెలుగమ్మాయిగా సుకన్య తనకు బామ్మగారిగా భానుమతి గారు కూడా బాగుంటారు. ఈ చక్కని పాట మీరూ చూసి విని ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.



చిత్రం : పెద్దరికం (1992)
సంగీతం : రాజ్-కోటి
సాహిత్యం : భువనచంద్ర, వడ్డేపల్లి కృష్ణ
గానం : చిత్ర, కోరస్

ఓఓఓఓ..ఓఓ..ఓఓఓఓ....
ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే
ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే

మురిపాల తేలించ మునిమాపులో
దివినుండి రేరాజు దిగివచ్చులే
ఆ ఆ ఆ ఆ....
ఆ ఆ ఆ ఆ....

ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే

తొలకరిలా వలపంతా కురిసెనులే 
తీయని ఊహలు చిగురు తొడిగెను

నింగిని తాకే పందిరి వేసీ
పచ్చని పల్లెను పీటగజేసీ
నింగిని తాకే పందిరి వేసీ
పచ్చని పల్లెను పీటగజేసి
బంగారు రంగులు వేయించరారే
మురిపాల పెళ్ళి జరిపించరారే

వధువు సొగసంత మెరిసే
వలపు మదిలోన విరిసే
చిలిపి కోరికలు కురిసే
పడుచు పరువాలు బిగిసే
కనివిని ఎరుగని కమ్మని భావన కధలుగ కనిపించే
ఆ ఆ ఆ ఆ....
ఆ ఆ ఆ ఆ....

ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే

తూరుపు ఎరుపై మనసులు పాడే
గోదావరిలా మమతలు పొంగే
తూరుపు ఎరుపై మనసులు పాడే
గోదావరిలా మమతలు పొంగే
రాయంచలన్నీ రాగాలు తీసే
చిలకమ్మలెన్నో చిత్రాలు చేసే

కదలి రావమ్మ నేడే
కలలు పండేటి వేళా
వేచియున్నాడు వరుడే
సందె సరసాల తేలా
సరసపు వయసున 
ఒంపుల సొంపుల సరిగమ వినిపించే

ఆ ఆ ఆ ఆ...
ఆ ఆ ఆ ఆ...
ఆ ఆ ఆ ఆ...
 

2 comments:

పెళ్ళి పాటలంటే సాధరణం గా మెలొడీ బేస్డ్ గా వుంటాయి కదా..బట్ ఈ సాంగ్ క్లాసికల్ వే లో వుంటుంది..చాలా బావుంటుంది..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.