శుక్రవారం, ఫిబ్రవరి 28, 2014

ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి...

ఆసక్తికరమైన కథా కథనాలతో తొంబైలో వచ్చిన ఒక మంచి సినిమా ఆత్మబంధం. కలకాలంతోడుంటాడని ప్రాణంగా ప్రేమించి పెళ్ళిచేసుకున్న తన భర్త ఒక యాక్సిడెంట్ లో తనని వీడివెళ్ళిపోయాడనే దిగులుతో ఉన్న ఆమెకి అతను ఆత్మరూపంలో తనచుట్టూనే ఉండి కాపాడుకుంటున్నాడని తెలిసిన క్షణంలో నమ్మలేని ఆ నిజాన్ని ఒట్టి ఊహకాదని ఒట్టేసి చెప్పవా అంటూ భర్తనే అడిగే సంధర్బంలోని ఈ పాట చాలా అందంగా ఉంటుంది. మీరూ ఆస్వాదించండి. యూట్యూబ్ పనిచేయని వారు ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : ఆత్మబంధం (1990)  
సంగీతం  : కీరవాణి 
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర 

ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టి ఊహ కాదని ఈ కొత్త పూల గాలి
నమ్మలేక పోతున్నా కమ్మనీ నిజాన్ని
బొట్టు పెట్టి పిలవగానె స్వర్గం దిగి వచ్చిందని

ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టి ఊహ కాదని ఈ కొత్త పూల గాలి
నమ్మలేక పోతున్నా కమ్మనీ నిజాన్ని
బొట్టు పెట్టి పిలవగానె స్వర్గం దిగి వచ్చిందని

ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి

ఒకేసారి కలలన్నీ వెలేసాయి కన్నుల్నీ
అమావాశ్య కొలువై మోయమంటూ రేయినీ
సుదూరాల తారల్ని సుధా శాంతి కాంతుల్నీ
వలలు వేసి తెచ్చా కంటి కొనలో నింపనీ
చెదరని చెలిమి కి సాక్ష్యమా
హృదయము తెలుపగ సాధ్యమా
మాయని మమతల దీపమా 
ఉదయపు తళుకులు చూపుమా
నా జాబిలి నీవేనని

ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి

ల ల ల ల ల లా
ల ల ల ల ల లా
ల ల ల ల ల లా
ల ల ల ల ల లా

తుదే లేని కధ కాని గతం కాని స్వప్నాన్ని
ఇదే కౌగిలింతై కాలమంతా ఉండనీ
నువ్వే వున్న కన్నులతో మరే వంక చూడననీ
రెప్ప వెనక నిన్నే ఎల్లకాలం దాచనీ
యుగములు కలిగిన కాలమా 
ఈ ఒక గడియను వదులుమా
చరితలు కలిగిన లోకమా 
ఈ జత జోలికి రాకుమా
స్వప్నం చిగురించిందని

ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టి ఊహ కాదని ఈ కొత్త పూల గాలి
నమ్మలేక పోతున్నా కమ్మనీ నిజాన్ని
బొట్టు పెట్టి పిలవగానె స్వర్గం దిగి వచ్చిందని

ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి 
ఇంకొక్కసారి
ఇంకొక్కసారి

8 comments:


ఇంకో చాలా ఇష్టమైన పాట..
కాకపోతే మొదటిలైన్ నించి కదలడం కష్టం నాకు.. చాలా నచ్చేస్తుంది, ఎందుకో! :-)

నాకు చాలా ఇష్టం :) అప్పట్లో రికార్డ్ చేయించుకున్నా. ఓసారెప్పుడో స్టార్ మూవీస్ లో "ఘోస్ట్" చూసేదాకా ఈ సిన్మా ఆ సిన్మా కి రిమేక్ అని తెలీదు నాకు..

Good one. Been a while since I listened this. Thanks for sharing.

$id

థాంక్స్ నిషీ,
థాంక్స్ తృష్ణ గారు,
థాంక్స్ సిద్ గారు.

మా పిల్లలకి ఈ పాట ఎన్నో సార్లు జోలపాటగా పాడాను. సిరి వెన్నెల గారి పద ప్రయోగం అద్భుతం. ఇది తరచుగా నా నోట్లో నానే పాటల్లో ఒకటి. ఈ పాట ని గుర్తించిన వాళ్ళు నేను కాక ఇంకా ఉన్నారని తెలిసి సంతోషిస్తున్నా.

విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు శ్రీ సిరివెన్నెలగారు..ఈ పాట పల్లవొక్కటే నచ్చుతుంది నాకు..బాలు+చిత్ర గారి వాయిస్, మ్యూజిక్ యెక్కువగా మనసుని హాంట్ చేస్తాయి..ఇందులోనే వున్న 'ఊరుకో-ఊరుకో' లిరిక్స్ చాలా అద్భుతం గా వుంటాయి..పాట కూడా..వీలైతే ప్రెజెంట్ చేయగలరా వేణూజీ..

థాంక్స్ శాంతి గారు తప్పకుండా ఊరుకో ఊరుకో పాట కూడా త్వరలో పోస్ట్ చేస్తాను.
ఈ పాట పల్లవితో పాటు చరణాలు కూడా నాకు బానే నచ్చుతాయండీ... బహుశా మీరు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుంటారు :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.