గురువారం, ఫిబ్రవరి 20, 2014

డ్రీమ్ గర్ల్..

సిరివెన్నెల అంటే క్లాసికల్ పాటలనే కాదు ఇలాంటి అల్లరి పాటలను సైతం తెలుగు ఇంగ్లీష్ కలిపి కూడా అందంగా రాయగలరు ఆకట్టుకోగలరు అని నిరూపించిన పాట. కృష్ణవంశీ మొదటి మాజిక్ "గులాబి" నుండి. శశిప్రీతమ్ అప్పట్లో గొప్ప యూత్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాడని మాకాలేజ్ లో అందరం ఫిక్స్ అయిపోయాం కానీ ఎందుకో ఎక్కువ అవకాశాలు రాలేదు. ఎపుడు విన్నా నా కాలేజ్ రోజులని గుర్తు చేసే ఈ పాటని మీరూ విని ఎంజాయ్ చేయండి. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినండి.



చిత్రం : గులాబి(1996)
సంగీతం : శశి ప్రీతం
సాహిత్యం : సిరివెన్నెల
గానం : సుచిత్రాక్రిష్ణమూర్తి, సురేష్ పీటర్స్ 

మాధురీని మరిపించె సుస్మితాను ఓడించె 
అందమైన అమ్మాయిరోయ్
రమ్యకృష్ణ రూపాన్ని చిత్ర లోని రాగాన్ని 
కలుపుకున్న పాపాయి రోయ్
ఎవ్వరురా ఆ చిన్నది.. ఎక్కడ రా దాగున్నది..
ఎప్పుడు రా.. ఎటు నుంచి దిగుతుంది

డ్రీమ్ గర్ల్ ఎదలో ఈల వేసే నైటింగేల్..
డ్రీమ్ గర్ల్ మెడలో మాల వేసే డార్లింగ్ డాల్..

లా..లా..లా..ల..ల..ఆహా..ఆహ.హా.హ.హా..
హెల్లో హనీ వెల్కమ్ అనీ అంటూ నీ వెంట ఉన్నానని
కల్లోన నువు లేవని గిల్లేసి చూపించని
వెంటాడినా వేధించినా నీ చెంత చేరాలని
నమ్మాలి నా మాటనీ తగ్గించు అల్లర్లనీ

డ్రీమ్ గర్ల్ గుండెల్లో మోగే టెంపుల్ బెల్..
డ్రీమ్ గర్ల్ దిగి రా నీలి నింగి ట్వింకిల్ స్టార్

ఊహూ..హు.హు.హు..తూరూ.రూ.రూ.రూ..
ఆటాడినా మాటాడినా ఆలోచనంత తానేనని
చెప్పేది ఎల్లాగని చేరేది యే దారినీ
యెటు పోయినా ఎం చేసినా నా నీడలాగ అడుగడుగుని
చూస్తున్న ఆ కళ్ళని చూసేది యే నాడనీ

డ్రీమ్ గర్ల్
కొంగు చాటు గులాబి ముళ్ళు నాటు హనీబి
ఎక్కడుందొ ఆ బేబీ
కొంటె ఊసులాడింది హార్టు బీటు పెంచింది 
ఎమిటంట దాని హాబీ..

వాట్ ఈజ్ దిస్...వంకాయ్ పుల్స్
నో అడ్రస్.. మిస్ యూనివర్స్.. మెంటల్ కేస్..
అంతెలేర బాసు.. మే గాడ్ బ్లెస్ యూ..

డ్రీమ్ గర్ల్ ఎదలో ఈల వేసే నైటింగేల్..
డ్రీమ్ గర్ల్ దిగి రా నీలి నింగి ట్వింకిల్ స్టార్

డ్రీమ్ గర్ల్ నిన్నే తలచుకొంటే నిద్దర నిల్..
డ్రీమ్ గర్ల్ మనసే తడిసిపోయే వాటర్ ఫాల్..
డ్రీమ్ గర్ల్ త్వరగా చేరుకోవే మై డార్లింగ్..
డ్రీమ్ గర్ల్ ఇంకా ఎంతకాలం ఈ వెయిటింగ్..
డ్రీమ్ గర్ల్...డ్రీమ్ గర్ల్...డ్రీమ్ గర్ల్..
హేయ్.. మై డ్రీమ్ గర్ల్
డ్రీమ్ గర్ల్
 

2 comments:

ఈ సిన్మాలో మూడు సాంగ్స్ నాలాగే చాలా మందికి ఫేవరెట్ సాంగ్స్ అనుకుంటా..డ్రీం గర్ల్ కాకుండా, ఈ వేళ లో నీవు, ఇంకోటి క్లాస్ రూము లొ..ఐ థింక్ ఈ లాస్ట్ సాంగ్ మీరు మీ సూపర్ కలెక్షన్లో వేసినట్టు లేరు వేణూజీ..

థాంక్స్ శాంతి గారు, అవునండీ గులాబి పాటలు లిస్ట్ లో ఉన్నాయి వేస్తాను, మీరు చెప్పినవే కాకుండా "మేఘాలలో తేలిపోమ్మన్నది" కూడా నాకు ఇష్టమే :)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.