అగస్ట్ నెలంతా శ్రావణమాసం కనుక ఈ నెల రోజులు భక్తి పాటలు తలచుకుందాం. ముందుగా భక్త తుకారం చిత్రం లోని ఘనా ఘనా సుందరా అనేపాటతో మొదలు పెడదాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : భక్త తుకారం (1973)
సంగీతం : ఆదినారాయణరావు
సాహిత్యం : దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం : ఘంటసాల
హరి ఓం... ఓ. ఓం..
హరి ఓం... ఓ. ఓం..
హరి ఓం... ఓ. ఓం..
ఆ-అ-అ-అ-అ-ఆ.. అ-ఆ...
ఆ.ఆ... ఆ.ఆ... ఆ... అ-ఆ...
ఘనా. ఘన సుందరా...
కరుణా.. రస మందిరా.
ఘనా. ఘన సుందరా..
కరుణా.. రస మందిరా. ..
అది పిలుపో.. మేలు కొలుపో..
నీ పిలుపో.. మేలు కొలుపో..
అది మధుర. మధుర.
మధురమౌ ఓంకారమో.. ..
పాండురంగ. పాండురంగ..
ఘనా. ఘన సుందరా...
కరుణా.. రస మందిరా...
ఆ... అ-అ-ఆ..
ప్రాభాత మంగళ పూజావేళ..
నీపద సన్నిధి నిలబడీ...
నీపద పీఠిక తలనిడీ..
ప్రాభాత మంగళ పూజావేళ..
నీపద సన్నిధి నిలబడి...
నీపద పీఠిక తలనిడీ..
నిఖిల జగతి నివాళులిడదా..
నిఖిల జగతి నివాళులిడదా..
వేడదా.. కొనియాడదా..
పాండురంగ. పాండురంగ..
ఘనా. ఘన సుందరా
కరుణా.. రస మందిరా
ఆ... అ-అ-ఆ..
గిరులూ ఝరులూ..
విరులూ తరులూ..
నిరతము నీ పాద ధ్యానమే...
నిరతము నీ నామ గానమే...
గిరులూ ఝరులూ..
విరులూ తరులూ..
నిరతము నీ పాద ధ్యానమే...
నిరతము నీ నామ గానమే...
సకల చరాచర.. లోకేశ్వరేశ్వర..
సకల చరాచర.. లోకేశ్వరేశ్వర..
శ్రీకరా... భవహరా...
పాండురంగ. పాండురంగ..
ఘనా. ఘన సుందరా.అ-అ-ఆ..
కరుణా.. రస మందిరా.అ-అ-ఆ..
ఆ... అ-అ-ఆ..
ఘనా. ఘన సుందరా.అ-అ-ఆ..
పాండురంగ. పాండురంగ.
పాండురంగ. పాండురంగ..
...
పాండురంగ. పాండురంగ.
పాండురంగ. పాండురంగ..
...
పాండురంగ. పాండురంగ.
పాండురంగ. పాండురంగ.
పాండురంగ. పాండురంగ.
పాండురంగ. పాండురంగ..
2 comments:
చిన్నప్పుడు పక్కనే ఉన్న గుడిలోంచి రోజూ వినిపించేదీ పాట..
అవునండీ నాకూ చిన్నప్పుడు గుడి మైక్ సెట్ లోనే ఎక్కువ సార్లు విన్న గుర్తు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.