బుధవారం, జులై 31, 2019

ఎన్ని జన్మల బంధమో...

శ్రీశ్రీ చిత్రంలోని ఒక చక్కని పాటతో విజయనిర్మల గారి పాటల సిరీస్ ను ముగిద్దాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రీశ్రీ (2016)
సంగీతం : ఈ.ఎస్.మూర్తి
సాహిత్యం : ఈ.ఎస్.మూర్తి/పోతుల రవికిరణ్
గానం : హరిహరన్, గాయత్రి నారాయణన్

ఎన్ని జన్మల బంధమో
ఇది ఎంత తీయని స్నేహమో
ఎన్ని పూజల పుణ్యమో
మనకే సుమా ఇది సొంతమూ
కలిమి లోనూ లేమి లోను కలిసి ఉన్నాము
కలతలో కన్నీళ్ళనే పంచుకున్నాము

ఎన్ని జన్మల బంధమో
ఇది ఎంత తీయని స్నేహమో

చిన్ని చిన్ని అలకలూ ఆపైన మౌనాలు
అంతలోనే ఆగలేక రాయభారాలు
మనసు చెదిరిన వేళాలో నా నేస్తమై నువు
రేయి పగలు తోడు నీడై ఆదుకున్నావు
నన్ను నీకే ఎన్నడో చేసుకున్నా అంకితాం
నువ్వు లేని ఓ క్షణం చీకటేలే జీవితం
నాటి కథలే మనసు నిండా దాచుకున్నాను

ఎన్ని జన్మల బంధమో
ఇది ఎంత తీయని స్నేహమో
ఎన్ని పూజల పుణ్యమో
మనకే సుమా ఇది సొంతమూ 
 

2 comments:

చూస్తున్నంత సేపూ మనసు ఆర్ద్రమైందండి..

సందర్భం కూడా అలాంటిది కదండీ.. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.