గురువారం, జులై 25, 2019

కొత్తపెళ్ళి కూతురనీ

నిండు దంపతులు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నిండు దంపతులు (1971)
సంగీతం : టి.వి.రాజు
రచన : సినారె
గానం : ఎల్.ఆర్.ఈశ్వరి

కొత్తపెళ్ళి కూతురనీ
కూసింత ఇదిలేదా
హవ్వ.. మరియాదా..
సందె వాలేదాకా
సద్దు మణిగేదాకా
సంభాళించుకోలేవా ఓ మావ
తమాయించుకోలేవా ఓ మావ

వల్లమాలిన పిల్లగాలి
ఒళ్ళు నిమిరే దాకా
సిగలోని సన్నజాజులు
సిగ్గు యిడిచే దాకా
కన్నెవయసూ నిన్ను చేరి
కన్ను గీటే దాకా

సంభాళించుకోలేవా ఓ మావ
తమాయించుకోలేవా ఓ మావ

కొత్తపెళ్ళి కూతురనీ
కూసింత ఇదిలేదా
హవ్వ.. మరియాదా..
 
పట్టలేని బేలమనసు
పట్టుదప్పిన ఏళ
పొంగి పొరలు దోరవలపు
పురులు యిప్పిన యే
జంట గోరిన కొంటె కోరిక
పంటకెదిగిన యేళ
సంభాళించుకోలేను ఓమావా
సైపలేకున్నాను ఓ మావా

కొత్తపెళ్ళి కూతురనీ
కూసింత ఇదిలేదా
హవ్వ.. మరియాదా..
సందె వాలేదాకా
సద్దు మణిగేదాకా
సంభాళించుకోలేనూ ఓ మావ
తమాయించుకోలేనూ ఓ మావ 

4 comments:

సుశీల గారు కాదనుకుంటానండి. ఎల్లార్ ఈశ్వరి గానీ వాణీ జయరాం గానీ అయి ఉండవచ్చు.

థాంక్స్ ఫర్ ద కామెంట్ భవానీప్రసాద్ గారు.. విన్నపుడు నాకూ ఎల్లార్ ఈశ్వరి గారి గొంతులా అనిపించింది కానీ పాటల పుస్తకంలో ఇలా ఉందని సుశీల గారి పేరే ఉంచానండీ.. ఇపుడు అప్డేట్ చేస్తాను.

యెప్పుడూ వినలేదీ పాట..బావుంది..

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.