శుక్రవారం, జులై 26, 2019

ఒకటే కోరికా...

ప్రేమ కానుక చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రేమ కానుక (199)
సంగీతం : టి.చలపతిరావు
రచన : సినారె
గానం : సుశీల, పి.బి.శ్రీనివాస్

ఒకటే కోరికా
ఒకటే వేడుక
నా మనసులోని
మధురమైన ప్రేమగీతికా
నా ప్రేమ గీతికా
ఒకటే కోరికా

అందమైన వేళలో
చందమామ నావలో
పాలవెల్లి జాలులో
తేలిపోవు కోరిక

ఒకటే కోరికా

చెలియ నీలి కురులలో
వలపులీను విరులలో
పరిమళాల డోలలో
పరవశించు కోరిక

ఒకటే కోరికా
ఒకటే వేడుకా

నా మనసులోని
మధురమైన
ప్రేమ గీతికా
నా ప్రేమ గీతికా

గున్నమావి తోటలో
కోయిలమ్మ పాటలో
సొంపులీను స్వరమునై
సోలిపోవు కోరిక

ఒకటే కోరికా

నీవే నా కనులుగా
నీవే నా తనువుగా
యుగయుగాలు ఏకమై
జగమునేలు కోరిక

ఒకటే కోరికా
ఒకటే వేడుకా

నా మనసులోని
మధురమైన
మనసులోని
మధురమైన
ప్రేమ గీతికా
నా ప్రేమ గీతికా

2 comments:

హరనాధ్,విజయ నిర్మల కలిసి యాక్ట్ చేశారా..నేనిదే చూడటం..

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.