బుధవారం, జులై 24, 2019

అలకలు తీరిన కన్నులు...

మా నాన్న నిర్ధోషి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మా నాన్న నిర్దోషి (1970)
సంగీతం : పెండ్యాల
రచన : సినారె
గానం : బాలు, సుశీల

అలకలు తీరిన కన్నులు ఏమనె ప్రియా
అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

అలకలు తీరిన కన్నులు ఏమనె ప్రియా
అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా

కదలే పూలగాలి నా ఎదపై తేలి తేలీ
కదలే పూలగాలి నా ఎదపై తేలి తేలీ
ఏ కథలో తెలుపసాగే నీ కలలో పలుకసాగే

ఆ తీయని గాధల రాధవు నీవే ప్రియా
నా తీరని వలపుల మాధురి నీవే ప్రియా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

అలకలు తీరిన కన్నులు ఏమనె ప్రియా
అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా

మదిలో రాగమాల నవమధువై పొంగువేళ
నా తనువే పల్లవించే అణువణువే పరవశించే

ఆ గానము లో నను లీనము కానీ ప్రియా
నీ ప్రాణములో ఒక ప్రాణము కానీ ప్రియా

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

అలకలు తీరిన కన్నులు ఏమనె ప్రియా
అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్


2 comments:

ఈపిక్ లో విజయనిర్మలగారు చాలా బావున్నారు..

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.