మంగళవారం, జులై 30, 2019

ఈనాడు కట్టుకున్న...

పండంటి కాపురం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినలాంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పండంటి కాపురం (1972)
సంగీతం : కోదండపాణి
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల

ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు..ఊ..
కావాలి ముందు ముందు పొదరిల్లు.. పొదరిల్లు
ఊ.. ఊ.. ఊ.. ఓ.. ఓహోహో.. ఆహహా..

ఈనాడు కట్టుకున్న.. బొమ్మరిల్లు..ఊ..
కావాలి ముందు ముందు పొదరిల్లు.. పొదరిల్లు

ఆశలే తీవెలుగా
ఉహూ..
ఊసులే పూవులుగా
ఉహూ..
వలపులే తావులుగా..
అలరారు ఆ పొదరిల్లు

ఆ..ఆ..ఆ..

ఆశలే తీవెలుగా
ఉహూ..
ఊసులే పూవులుగా
ఉహూ..
వలపులే తావులుగా..
అలరారు ఆ పొదరిల్లు

పగలైనా రేయైనా.. ఏ ఋతువులోనైనా
పగలైనా రేయైనా.. ఏ ఋతువులోనైనా
కురిపించును తేనెజల్లు.. పరువాల ఆ పొదరిల్లు

ఈనాడు కట్టుకున్న.. బొమ్మరిల్లు..ఊ..
కావాలి ముందు ముందు పొదరిల్లు.. పొదరిల్లు

కళ్ళలో కళ్ళుంచీ
ఉహూ..
కాలమే కరిగించే
ఉహూ..
అనురాగం పండించే..
ఆ బ్రతుకే హరివిల్లు

ఆ..ఆ..ఆ..

కళ్ళలో కళ్ళుంచీ
ఉహూ..
కాలమే కరిగించే
ఉహూ..
అనురాగం పండించే..
ఆ బ్రతుకే హరివిల్లు

నా దేవివి నీవైతే.. నీ స్వామిని నేనైతే
నా దేవివి నీవైతే.. నీ స్వామిని నేనైతే
పచ్చని మన కాపురమే.. పరిమళాలు వెదజల్లు

ఈనాడు కట్టుకున్న.. బొమ్మరిల్లు..ఊ..
కావాలి ముందు ముందు పొదరిల్లు.. పొదరిల్లు

ఊఁహూఁహూఁ.. ఊఁహూఁహూఁ.. ఊఁహూఁహూఁ..
ఊఁహూఁహూఁ.. ఊఁహూఁహూఁ.. ఊఁహూఁహూఁ..


2 comments:

అప్పటి హిట్ సాంగ్

అవునండీ.. అప్పట్లో చాలా పాపులర్.. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.