విచిత్ర దాంపత్యం చిత్రం లోని ఒక చక్కని నృత్యరూపకాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : విచిత్ర దాంపత్యం (1971)
సంగీతం : అశ్వథ్ధామ
సాహిత్యం : సి.నారాయణరెడ్డి
గానం : సుశీల
శ్రీ గౌరి శ్రీ గౌరియే
శివుని శిరమందు
ఏ గంగ చిందులు వేసినా
శ్రీ గౌరి శ్రీ గౌరియే
శివుని శిరమందు
ఏ గంగ చిందులు వేసినా
శ్రీ గౌరి శ్రీ గౌరియే
సతిగా తనమేను చాలించి
పార్వతిగా మరుజన్మ ధరియించి
సతిగా తనమేను చాలించి
పార్వతిగా మరుజన్మ ధరియించి
పరమేశునికై తపియించి
పరమేశునికై తపియించి
ఆ హరు మేను సగమై పరవశించిన
శ్రీ గౌరి శ్రీ గౌరియే
నగకన్యగా తాను జనియించినా
జగదంబయైనది హైమవతి
నగకన్యగా తాను జనియించినా
జగదంబయైనది హైమవతి
సురలోకమున తాను ప్రభవించినా
తరళాత్మయైనది మందాకిని
ఒదిగి ఒదిగి పతి పదములందు
నివసించి యుండు గౌరి
ఎగిరి ఎగిరి పతి సిగను దూకి
నటియించుచుండు గంగ
లలితరాగ కలితాంతరంగ గౌరి
చలిత జీవన తరంగ రంగ గంగ
ధవళాంశు కీర్తి గౌరి
నవఫేనమూర్తి గంగ
కల్పాంతమైన
భువనాంతమైన
క్షతి యెరుగని
మృతి యెరుగని నిజమిది
శ్రీ గౌరి శ్రీ గౌరియే
శివుని శిరమందు
శివుని శిరమందు
ఏ గంగ చిందులు వేసినా
శ్రీ గౌరి శ్రీ గౌరియే
2 comments:
జయహో నారాయణ రెడ్డిగారూ..
జయహో జయహో :-) థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.