ఆదివారం, జులై 07, 2019

ఆకాశంలోని చందమామ...

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఒక నేస్తానికి దేవీపుత్రుడు చిత్రం లోని ఈ అందమైన పాటతో శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దేవీపుత్రుడు (2001)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : జొన్నవిత్తుల
గానం : బాలు, చిత్ర

ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా
సాగరమాయె సంబరమె స్వాగతమాయె సంతసమె
నాలోని ప్రేమ ప్రతిరూపమే... ఈ ఇంట తానే సిరిదీపమే

ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా
సాగరమాయె సంబరమె స్వాగతమాయె సంతసమె
నాలోని ప్రేమ ప్రతిరూపమై... ఈ ఇంట తానే సిరిదీపమై

నింగిలో నీలమంతా ఉంగరం చేసి ఇస్తా ఊరేగిస్తా
సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా గారాం చేస్తా
తెల్లని ఏనుగుపై నా పాపను ఎక్కిస్తా
చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా
హరివిల్లే కాగా ఉయ్యాలలే
కోయిలలే పాడే నా జోలలే
బొమ్మలుగా మారే ఆ చుక్కలే
దిష్టంతా తీసే నలుదిక్కులే


పాపలో అందమంతా బ్రహ్మకే అందనంత ఎంతో వింత
అమ్మలో ప్రేమ అంత నాన్నలో ఠీవి అంతా వచ్చేనంటా
తీయని నవ్వేమో దివి తారల వెలుగంట
కమ్మని పిలుపేమో ఈ అమ్మకు పులకింత

అడుగేసి తీస్తే హంస జోడి
కులుకుల్లో తానే కూచిపూడి
చిరునవ్వులోన శ్రీరమణి
మారాము చేసే బాలామణి

ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా
సాగరమాయె సంబరమె స్వాగతమాయె సంతసమె
నాలోని ప్రేమ ప్రతిరూపమే... ఈ ఇంట తానే సిరిదీపమే 

2 comments:

మీ ఫ్రెండ్ కి మా విషెస్ కూడా అందజేయండి..

థాంక్స్ శాంతి గారు.. తప్పకుండా..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.