బుధవారం, జులై 03, 2019

రాముని అవతారం...

విజయనిర్మల గారు సీతాదేవిగా కనిపించి మెప్పించిన భూకైలాస్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : భూకైలాస్ (1958)
సంగీతం : ఆర్ సుదర్శనం, ఆర్ గోవర్ధనం
సాహిత్యం : సముద్రాల రాఘవాచార్య
గానం : ఘంటసాల

ద్వారపాలుర మరల దరిదీయు కృపయో
ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో... ఓ
రాముని అవతారం... మ్మ్.
రవికుల సోముని అవతారం మ్మ్

రాముని అవతారం...
రవికుల సోముని అవతారం
రాముని అవతారం...
రవికుల సోముని అవతారం
సుజన జనావన ధర్మాకారం
దుర్జన హృదయ విదారం
రాముని అవతారం...

దాశరధిగ శ్రీకాంతుడు వెలయు
కౌసల్యాసతి తఫము ఫలించు
జన్మింతురు సహజాతులు మువ్వురు
జన్మింతురు సహజాతులు మువ్వురు
లక్ష్మణ శత్రుఘ్న భరతా...

రాముని అవతారం...
రవికుల సోముని అవతారం

చదువులు నేరుచు మిషచేత
చాపము దాలిచి చేతా...
విశ్వామిత్రుని వెనువెంట
యాగము కావగ చనునంట
అంతము చేయునహల్యకు శాపము
అంతము చేయునహల్యకు శాపము
ఒసగును సుందర రూపం

రాముని అవతారం...
రవికుల సోముని అవతారం

ధనువో జనకుని మనసున భయమో
ధారుణి కన్యా సంశయమో
దనుజులు కలగను సుఖగోపురమో
దనుజులు కలగను సుఖగోపురమో
విరిగెను మిధిలా నగరమున

రాముని అవతారం...
రవికుల సోముని అవతారం

కపట నాటకుని పట్టాభిషేకం
కలుగును తాత్కాలికా శోకం
భీకర కానన వాసారంభం
లోకోద్ధరణకు ప్రారంభం.మ్మ్
భరతుని కోరిక తీరుచు కోసం
పాదుక లొసగే ప్రేమావేశం
భరతుని కోరిక తీరుచు కోసం
పాదుక లొసగే ప్రేమావేశం
నరజాతికి నవ నవసంతోషం
గురుజన సేవకు ఆదేశం

రాముని అవతారం...
రవికుల సోముని అవతారం

అదిగో చూడుము బంగరు జింక
అదిగో చూడుము బంగరు జింక
మన్నై చనునయ్యో లంక
హరనయనాగ్ని పరాంగనవంక
అరిగిన మరణమె నీ కింక

రమ్ము రమ్ము హే భాగవతోత్తమ
వానర కుల పుంగవ హనుమాన్...
రమ్ము రమ్ము హే భాగవతోత్తమ
వానర కుల పుంగవ హనుమాన్
ముద్రిక కాదిది భువన నిదానం
ముద్రిక కాదిది భువన నిదానం
జీవన్ముక్తికి సోపానం
జీవన్ముక్తికి సోపానం

రామరామ జయ రామ రామ
జయ రామరామ రఘుకుల సోమా
సీతాశోక వినాశనకారి
లంకా వైభవ సంహారి

అయ్యో రావణ భక్తాగ్రేసర
అమరంబౌనిక నీ చరిత
సమయును పరసతిపై మమకారం
వెలయును ధర్మ విచారం
రాముని అవతారం...
రవికుల సోముని అవతారం
రాముని అవతారం...
రవికుల సోముని అవతారం

2 comments:

సీతమ్మవారు అలానే ఉండేవారేమో..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.