బుధవారం, జులై 17, 2019

ఇరుసులేని బండి...

పాడిపంటలు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పాడిపంటలు (1976)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, సుశీల

ఇరుసులేని బండి ఈశ్వరుని బండి
చిరతలే లేనిది చిన్నోడి బండి
ఇరుసులేని బండి ఈశ్వరుని బండి
చిరతలే లేనిది చిన్నోడి బండి
ఆ..  తొట్టిలో ఉన్నాడు జగమొండి
వాడి దూకుడికి ఆగలేరు తప్పుకోండి

ఇరుసులేని బండి ఈశ్వరుని బండి
చిరతలే లేనిది చిన్నోడి బండి

వయసులోనె ఉన్నది దూకుడన్నది
దాన్ని ఎగదోసే చిన్నది పక్కనున్నది
వయసులోనె ఉన్నది దూకుడన్నది
దాన్ని ఎగదోసే చిన్నది పక్కనున్నది

చిన్నదాని చేతిలో చిరతలున్నవి
ఎంత చెలరేగినా నీకు హద్దులున్నవి
చిన్నదాని చేతిలో చిరతలున్నవి
ఎంత చెలరేగినా నీకు హద్దులున్నవి

హద్దులన్ని సద్దులేని ముద్దులతో 
చెరిగిపోతవీ ఓయ్..
తందనా తనానాన తందనాన
తందనా తనానాన తందనాన 
          
ఇరుసులేని బండి ఈశ్వరుని బండి
చిరతలే లేనిది చిన్నోడి బండి

ఎగిరెగిరిపడుతున్నాయ్ కోడెగిత్తలు
అవి ఏనాడు మోయలి మోపెడంతలు
ఎగిరెగిరిపడుతున్నాయ్ కోడెగిత్తలు
అవి ఏనాడు మోయలి మోపెడంతలు

ఎత్తుపల్లం చూస్తేనే ఇన్నిగంతులు
మనది మెత్తనైన దారైతే ఏల పంతాలు
ఎత్తుపల్లం చూస్తేనే ఇన్నిగంతులు
మనది మెత్తనైన దారైతే ఏల పంతాలు

పగ్గాలు లేనినాడు పంతాలు గెలవలేవూ.. హోయ్..
దసరిగరిసనిద దదద 
పనిసరిసని దప పపప
  
ఇరుసులేని బండి ఈశ్వరుని బండి
చిరతలే లేనిది చిన్నోడి బండి

పచ్చని వరిచేను పరువంలో ఉన్నదీ
పైరగాలి తగలగానే పులకరించుచున్నది
పచ్చని వరిచేను పరువంలో ఉన్నది
పైరగాలి తగలగానే పులకరించుచున్నది

పులక పులకలో వలపు గిలిగింత ఉన్నది
వలపుపంట ఎప్పుడని కలలు గంటున్నది
పులక పులకలో వలపు గిలిగింత ఉన్నది
వలపుపంట ఎప్పుడని కలలు గంటున్నది

సంకురేత్రి పండుగకే సంబరాలు
కాసుకున్నవీ.. హోయ్‌..  
ఇరుసులేని బండి ఈశ్వరుని బండి
చిరతలే లేనిది చిన్నోడి బండి


2 comments:

విజయనిర్మల హిట్స్ లో ఈ పాట ఒకటి..

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.