శుక్రవారం, నవంబర్ 30, 2018

ప్రేమ జీవన నాదం...

వైశాలి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : వైశాలి (1988)
సంగీతం : రవి
సాహిత్యం : రాజశ్రీ
గానం : చిత్ర

ప్రేమ జీవన నాదం
పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం
అనురాగ బంధం

ప్రేమ జీవన నాదం
పంచమం ఈ వేదం

తీయని భావాల రాగ సరాగ మంత్రం
విరిసెను అంతులేని ఆనందం
తలపులే రాగాలు పాడాలీ నేడు
తలపులె రాగాలు పాడాలీ నేడు

ప్రేమ జీవన నాదం
పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం
అనురాగ బంధం

ప్రేమ జీవన నాదం

స గ మ ద మ గ స
గ మ ద ని ద మ గ
మ ద ని స ని ద మ ద స

ఆడే మయూర మాల పురి విప్పి సంతసాన
మెరిసెను పూలలో గారాలీవేళ
మధువులు కురిసే పెదవుల లోనా
మధుర స్వరాలు సాగేను ఈవేళ

ఓ గండు కోయిల జత కోరి పాడిందీ
అది విని ఆడింది ఓ కన్నె కోయిల
తలపులే రాగాలు పాడాలీ నేడు
తలపులె రాగాలు పాడాలీ నేడు

ప్రేమ జీవన నాదం
పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం
అనురాగ బంధం
ప్రేమ జీవన నాదం

నక్షత్ర మాల నేడు ఆకాశ వీధిలోన
కాంతుల విరి వాన కురిపించేనులే
కలలే రగిలి అలలై కదిలి
ఊహలు నాలోన ఉరికేనులే

హంసలు జత చేరి ఆనందమున తేలి
మనసార విహరించె మధురిమలో
తలపులే రాగాలు పాడాలీ నేడు
తలపులె రాగాలు పాడాలీ నేడు

ప్రేమ జీవన నాదం
పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం
అనురాగ బంధం
ప్రేమ జీవన నాదం

తీయని భావాల రాగ సరాగ మంత్రం
విరిసెను అంతులేని ఆనందం
తలపులే రాగాలు పాడాలీ నేడు
తలపులె రాగాలు పాడాలీ నేడు

ప్రేమ జీవన నాదం
పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం
అనురాగ బంధం
ప్రేమ జీవన నాదం


2 comments:

కనులు మూసుకుని వింటే హాయిగా ఉంది కానీ..పాపం ఋష్యశృంగుడిని టార్జాన్ లా చూపించారు..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతిగారు :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.