గురువారం, నవంబర్ 01, 2018

చుట్టూ చెంగావి చీర...

తూర్పు వెళ్ళే రైలు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : తూర్పు వెళ్ళే రైలు (1979)
సంగీతం : బాలు
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు

చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ
బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి
ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెలబొమ్మ..

చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ

తెల్లచీరకందం నువ్వే తేవాలే చిట్టెమ్మా
నల్లచీర కట్టుకున్నా నవ్వాలే చిన్నమ్మా
ఎర్రచీర కట్టుకుంటే సందెపొద్దు నువ్వమ్మా 
 పచ్చచీర కట్టుకుంటే పంటచేల సిరివమ్మ 
 
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ 
 
నేరేడుపళ్ళ రంగు జీరాడే కుచ్చిళ్ళు
ఊరించే ఊహల్లో దోరాడే పరవళ్ళు
వంగపండు రంగులోన పొంగుతాయి సొగసుల్లు
వన్నె వన్నె చీరల్లోనా నీ ఒళ్ళే హరివిల్లూ

చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ 
బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి
ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెలబొమ్మ..

చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ

 

4 comments:

ఈ సినిమాలో పాటలన్నీ అమృత ప్రాయంగా ఉంటాయి..

అవును శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

Thanks for providing us opportunity to find out the missed songs from our memory.

"ప్రేమ జీవన రాగం పంచమం ఈవేదం సాగాలి ఈ దినం అనురాగ బంధం"

"Prema jeevan raagam
Panchamam eevedam
Saagali ee dinam anuraaga bandham"

For so many years, I have been searching for full song. Can you please help? It may be from a dubbing movie (kannada??)
Thank you in advance.

సారీ అజ్ఞాత గారు మీ కామెంట్ మిస్సయ్యాను.. మీరు చెప్పినది వైశాలి సినిమాలోని పాటండీ "ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం" అనే పాట. ఇక్కడ చూడవచ్చు చూడండి. https://www.youtube.com/watch?v=CUGnnbzzAy0

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.