గురువారం, నవంబర్ 08, 2018

ఏమని వర్ణించను...

డ్రైవర్ రాముడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : డ్రైవర్ రాముడు (1979)
సంగీతం : కె.చక్రవర్తి
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు, సుశీల

ఏమని వర్ణించను
ఏమని వర్ణించను నీ కంటి వెలుగును
వెన్నంటి మనసును వెన్నెల నవ్వును
నీ ఇలవేల్పును ఏమని వర్ణించను...

పైరగాలి లాగా చల్లగా ఉంటాడు
తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు
పైరగాలి లాగా చల్లగా ఉంటాడు
తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు
తీర్చిన బొమ్మలా తీరైనవాడు
తీర్చిన బొమ్మలా తీరైనవాడు
తీరని రుణమేదో తీర్చుకో వచ్చాడు

ఏమని వర్ణించను...
ఆ...ఆ...ఆ..ఆ...

రాముడు కాడమ్మా నిందలు నమ్మడు
కృష్ణుడు కాడమ్మా సవతులు ఉండరు
నువ్వు పూజించు దేవుళ్ళ లోపాలు లేనివాడు
నీ పూజ ఫలియించి నీ దేవుడైనాడు

ఏమని వర్ణించను...
ఆ...ఆ...ఆ..ఆ...
కళ్ళు లేవని నీకు కలతింకవలదమ్మా
తన కళ్ళతో జగతి చూపించగలడమ్మా
కళ్ళు లేవని నీకు కలతింకవలదమ్మా
తన కళ్ళతో జగతి చూపించగలడమ్మా

ఆ దేవుడెదురైతే వేరేమి కోరను
ఆ దేవుడెదురైతే వేరేమి కోరను
నా అన్న రూపాన్ని చూపితే చాలును

ఏమని ఊహించను నా అన్న రూపును
నాకున్న వెలుగును  వెన్నంటి మనసును
నా ఇలవేల్పును ఏమని ఊహించను.. 


5 comments:

అప్పట్లో సూపర్ హిట్ సాంగ్..

అవునండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

If there is E-Mail provision, we can send this lovely song to others

There is Satyanarayana garu... Move cursor to the red forward arrow button at the right bottom of the screen. You can share this post through email and other social platforms. Thanks for the comment.

If you are browsing this from mobile phone. Switch to desktop view on the phone by clicking on desktop version at the bottom of the page then you will get that forward button i am talking about.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.