పెళ్ళిచేసి చూపిస్తాం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : పెళ్ళి చేసి చూపిస్తాం (1983)
సంగీతం : రామకృష్ణం రాజు
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, సుశీల
గోరంత సూరీడు ఊరంత వెలిగేడు
నీ కంటిలో పాపగా నా గుండెలో పాటగా
గోరంత సూరీడు ఊరంత వెలిగేడు
నీ కంటిలో పాపగా నా గుండెలో పాటగా
కొనచూపే రాగాలుగా చిరునవ్వే తాళాలుగా
కొనచూపే రాగాలుగా చిరునవ్వే తాళాలుగా
చిరునవ్వే తాళాలుగా..
గోరంత సూరీడు ఊరంత వెలిగేడు
నీ కంటిలో పాపగా నా గుండెలో పాటగా
సొగసే తూరుపు సింధూరం
మనసే వాడని మందారం
నిలువెల్ల హరివిల్లై నిలిచే ఆమని నీ రూపం
తొణికే వేకువ నీ పిలుపు
ఉరికే వెల్లువ నా తలపు
తొలిసంధ్య తొలిసారి పలికే పల్లవి నీ చూపు
నీ దోర అందాల పందిళ్ళలోనా
తేనెల్ల వానల్లు చిందించుకోనా
నీ కళ్ళ వాకిళ్ళ నీరెండలోనా
అచ్చట్లు ముచ్చట్లు ఆరేసుకోనా
ఈవేళా... ఏవేళా... సాగేను నీ తోడుగా
గోరంత సూరీడు ఊరంత వెలిగేడు
నీ కంటిలో పాపగా నా గుండెలో పాటగా
విరిసే పువ్వులు నీ కోసం
వీచే గాలులు నా కోసం
మలిసంధ్య మనకోసం పలికే మంగళ సంగీతం
పడమట ఎర్రని ఆకాశం
పరచెను కుంకుమ నీ కోసం
పడిలేచే ప్రతి కెరటం కసిగా పొంగెను నా కోసం
నీ నవ్వు లోగిళ్ళ నీడల్లలోనా
బంగారు కలలన్నీ పండించుకోనా
నీ లేత చెక్కిళ్ళ అద్దాలలోనా
నా ముద్దు మురిపాలు నే చూసుకోనా
ఈవేళా... ఏవేళా... సాగేను నీ నీడగా
గోరంత సూరీడు ఊరంత వెలిగేడు
నీ కంటిలో పాపలా నా గుండెలో పాటగా
కొనచూపే రాగాలుగా చిరునవ్వే తాళాలుగా
కొనచూపే రాగాలుగా చిరునవ్వే తాళాలుగా
చిరునవ్వే తాళాలుగా..
గోరంత సూరీడు ఊరంత వెలిగేడు
నీ కంటిలో పాపలా నా గుండెలో పాటగా
2 comments:
సూపర్ సాంగ్ సార్
థాంక్స్ ప్రవీణ్ కుమార్ గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.