బుధవారం, నవంబర్ 21, 2018

రింఝిం రింఝిం రింఝిం పలికెనులే...

ప్రణయగీతం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం :  ప్రణయ గీతం (1981)
సంగీతం :  రాజన్-నాగేంద్ర
సాహిత్యం :  సినారె
గానం :  బాలు, సుశీల 

రింఝిం రింఝిం రింఝిం పలికెనులే నా ప్రణయగీతం
నాలోని వాణి నీలాలవేణి తానే నేనై పాడగా
నా మేనిలోన మాణిక్యవీణ నేనే తానై మ్రోగగా
నేలా నింగీ ఆడగా పూలే తాళం వేయగా

రింఝిం రింఝిం రింఝిం పలికెనులే నా ప్రణయగీతం

నీ వదనమే కమలమై పూచెనా
భావనలే రేకులై నాకై వేచెనా

నీ హృదయమే భ్రమరమై దాగెనా
కోరికలే రెక్కలై నాపై మూగెనా


అహహా...  కాలమే లీలగా ఆడెనా
నీలో ఉన్న నాదాలన్ని నాలో పొంగెనా

రింఝిం రింఝిం రింఝిం పలికెనులే నా ప్రణయగీతం
నాలోని వాణి నీలాలవేణి తానే నేనై పాడగా
నా మేనిలోన మాణిక్యవీణ నేనే తానై మ్రోగగా
నేలా నింగీ ఆడగా పూలే తాళం వేయగా


రింఝిం రింఝిం రింఝిం పలికెనులే నా ప్రణయగీతం

నీ పెదవిఏ మురళిఐ పిలిచెనా
రసధునులే రవుళులై నాలో నిలిచెనా


నీ పదములే హంసలై కదలెనా
లయజతులే హొయలులై నాలో ఒదిగెనా

నందనం చేతికే అందెనా
నాలో ఉన్న అందాలన్ని నీలో పండెనా


రింఝిం రింఝిం రింఝిం పలికెనులే నా ప్రణయగీతం
నాలోని వాణి నీలాలవేణి తానే నేనై పాడగా
నా మేనిలోన మాణిక్యవీణ నేనే తానై మ్రోగగా
నేలా నింగీ ఆడగా పూలే తాళం వేయగా
రింఝిం రింఝిం రింఝిం పలికెనులే నా ప్రణయగీతం 

 

4 comments:

నైస్ సాంగ్..యెప్పుడూ వినలేదు..

రాజన్-నాగేంద్ర గార్ల సంగీతంలో వచ్చిన మాంచి బీట్ ప్రాధాన్య పాట. 80 ల్లో రేడియోల్లో మోత మోగిపోయేది. పాట వీడియో చూడకుండా కళ్ళుమూసుకు వింటేనే ఎక్కువ నచ్చుతుంది. సినారె గారి కలం దీనిలో యతిప్రాసములతో కదం తొక్కింది. ఆయన ఏ రకమయిన పాటలయినా వ్రాయగల సమర్ధులు. అవి అలంకార వైభవ ప్రాధాన్యమయినా లేక కావ్యసుందర శోభితమయినవయినా గానీ...అన్నింటిలోనూ సిద్ధహస్తుడే. 7 వ దశకం ముందు పుట్టిన చాలామంది శ్రోతల ఇష్టమయిన ప్లే లిస్టులలో వారికి తెలియకుండగనే సినారె వారివి ఎక్కువ పాటలు ఉంటాయన్నది నిర్వివాదాంశం.

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.. నేను చిన్నపుడు రేడియోలో ఎక్కువగా వినేవాడ్నండీ ఈ పాట.

పాట గురించి మంచి విషయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు భవాని ప్రసాద్ గారు.. నాకూ చిన్నప్పుడు రేడియోలో విన్నదే బాగా గుర్తండీ.. ముఖ్యంగా పాటకి ముందు వచ్చే సరిగమలు బాగా ఇష్టం నాకు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.