గురువారం, నవంబర్ 15, 2018

చుక్కా చుక్కా కన్నీటి...

సర్పయాగం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సర్పయాగం (1991)
సంగీతం : విద్యాసాగర్ 
సాహిత్యం : సినారె
గానం : బాలు

చుక్కా చుక్కా కన్నీటి చుక్కా చెక్కిట జారొద్దు
నా చిన్నారి పాపా నీ కన్నుల్లో చీకటి వాలొద్దు

అమ్మ నీకు కావాలంటే అంగడిలో కొనితేలేను
అమ్మ నీకు కావాలంటే అంగడిలో కొనితేలేను
నేనే నీ అమ్మనుకుంటే ప్రాణం హారతి పడతాను
బ్రతుకే పండిందంటాను.

చుక్కా చుక్కా కన్నీటి చుక్కా చెక్కిట జారొద్దు
నా చిన్నారి పాపా నీ కన్నుల్లో చీకటి వాలొద్దు.

జరిగిన కాలం ఏనాడైనా తిరిగి రాగలిగేనా...ఓ.
జరిగిన కాలం ఏనాడైనా తిరిగి రాగలిగేనా...
నేలకు రాలిన ధృవతారైనా నింగికి పోగలిగేనా
శ్వాసకు హద్దు ఉన్నది గాని ఆశకు లేదమ్మా
కాటిలో కలిసిన ఏ ప్రాణైనా గూటికి రానే రాదమ్మా...

చుక్కా చుక్కా కన్నీటి చుక్కా చెక్కిట జారొద్దు
నా చిన్నారి పాపా నీ కన్నుల్లో చీకటి వాలొద్దు

ఇంతగ ఉన్న నా పసిగున్నా ఎంతగా ఎదిగావమ్మా...ఆ..
ఇంతగ ఉన్న నా పసిగున్నా ఎంతగా ఎదిగావమ్మా.
ఒదిగే కళ్ళల్లో ఊరేగే బిడియం ఓణీ వేసిందమ్మా...
నీ నవ్వుల్లో మీ అమ్మ రూపం నిత్యంకంటాను.
నూరేళ్లయినా నిన్నే చూస్తూ మారాజల్లే ఉంటాను.

6 comments:

చిన్న చిన్న పదాలతో అర్థవంతంగా కూర్చిన పాట. విద్యాసాగర్ గారి సంగీతం ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ పాటలో. బాలు గారు చక్కగా ఎమోషన్స్ పాటలో చూపి వన్నెతెచ్చారు.

థాంక్స్ ఫర్ ద కామెంట్ ప్రభ గారు.. పాట గురించి బాగా చెప్పారు..

హృద్యమైన పాట..

అవును శాంతిగారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

చక్కటి భావం ఉన్న అర్థవంతమైన పాట....

అవునండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ రాజ్యలక్ష్మి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.