శనివారం, నవంబర్ 03, 2018

కనురెప్ప పాడిందీ...

జయసుధ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.

 
చిత్రం : జయసుధ (1979)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : దాసరి
గానం : పి.జయచంద్రన్, సుశీల

కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా
కనుపాప నవ్వింది కనులున్న చోట
కలగన్న చోట అవి కలగన్న చోట
కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా


కలలూరు వేళ కనుమూత పడగా
కనుముందు నీ నీడ కదలాడి రాగా
కలలూరు వేళ కనుమూత పడగా
కనుముందు నీ నీడ కదలాడి రాగా
కనులెందుకు? ఈ కనులెందుకు?
కలలు చెరిగేందుకు చెరిగి పోయేందుకు

కనుల కనుల కలయికలో
కలయికల కలవరింతలలో
కలిగే... కరిగే.... కదిలే.... కదలికలే ఆ కలలూ
ఆ కలల వెలుగులే ఈ కనులు
ఆ కలల వెలుగులే ఈ కనులు


కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా
కనుపాప నవ్వింది కనులున్న చోట
కలగన్న చోట అవి కలగన్న చోట
కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా

తెలవారు వేళ కనురెప్ప విడగా
కనుముందు నీ రూపు కనిపించిపోగా
తెలవారు వేళ కనురెప్ప విడగా
కనుముందు నీ రూపు కనిపించిపోగా
కలలెందుకు? ఆ కలలెందుకు?
కధలు మిగిలేందుకు మిగిలి నిలిచేందుకు

మనసు మనసు ఊహలలో మరపురాని ఊసులలో
విరిసే... కురిసే... మెరిసే... మెరుపులవే ఈ కలలు
ఆ కలల వెలుగులే ఈ కనులు
ఆ కలల వెలుగులే ఈ కనులు


కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా
కనుపాప నవ్వింది కనులున్న చోట
కలగన్న చోట అవి కలగన్న చోట
కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా కనుసైగ పాటా
 


2 comments:

ఈ పాటెపుడూ వినలేదండీ..బావుంది..

ఫేమస్ పాటేనండీ మరి మీరెలా మిస్సయ్యారో.. ఎనీవేస్ థాంక్స్ ఫర్ కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.