జూదగాడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : జూదగాడు (1979)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : జి. ఆనంద్, సుశీల
మల్లెల వేళ.. అల్లరి వేళ..
మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల
నీవు నేనైన వేళ
వుండిపోవాలి ఇలా ఇలా
ఉహూహు ఊఊ..
మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల
నీవు నేనైన వేళ
వుండిపోవాలి ఇలా ఇలా
ఉహూహు..ఊ.ఉ..
ఒక యమున నేడు పొంగింది
ఒక మధుర మురళి మ్రోగింది
యమునా తటిలో మురళీ రవళి
ఒక రాగమేదొ ఝుమ్మంది
ఒక రాధ మనసు ఝల్లంది
బృందావనిలో అందాలొలికే
ఆ రాధా మాధవ రాస క్రీడలే
రసడోలలూగించు వేళ
ఉహూహు..ఊ.ఉ..
మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల
ఒక నింగి వలచి చేరింది
ఒక నేల ముద్దులాడింది
నింగీ నేల మురిసీ మెరిసీ
ఒక మబ్బు ఉబ్బి ఉరిమింది
అది పెళ్ళి మేళమయ్యింది
దివిలో మేళం భువిలో తాళం
ఆ మేళ తాళాల మేళవింపులో
జగమెల్ల జీవించు వేళ
ఉహూహు..ఊఉ..
మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల
నీవు నేనైన వేళ
వుండిపోవాలి ఇలా ఇలా
ఉహూహు..ఊఉ..
మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల
2 comments:
హాంటింగ్ మెలొడీ..
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు...
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.