శుక్రవారం, నవంబర్ 02, 2018

పగలే వెన్నెలాయే...

పరువు ప్రతిష్ట చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పరువు ప్రతిష్ట (1993)
సంగీతం : రాజ్-కోటి 
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : బాలు, చిత్ర 

పగలే వెన్నెలాయే జగమే మనదాయే
సెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయే
స్వాతి జల్లై అల్లుకో నేస్తమల్లే ఆదుకో
దాహమేసే దేహమిచ్చే స్వాగతాలే అందుకో

పగలే వెన్నెలాయే జగమే మనదాయే
సెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయే

ప్రేమసీమ సొంతమాయె చందమామ
జోడు సంబరాల సంగతే పాడవమ్మా
పాడవమ్మా పాడవమ్మా
రంగమంత సిద్ధమాయె చుక్కభామ
వేడి యవ్వనాల యుద్ధమే చూడవమ్మా
చూడవమ్మా చూడవమ్మా
తపించు ప్రాయాలు తరించి పోవాలి
గమ్మత్తు గాయాలతో
రహస్య రాగాలు తెగించి రేగాలి
కౌగిళ్ళ గేయాలతో
వానవిల్లై పెదవులు
ముద్దునాటే పదునులో
బాణమైనా గానమైనా
తేనెకాటే తెలుసుకో

పగలే వెన్నెలాయే జగమే మనదాయే
సెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయే

మాయదారి సోయగాలు మోయలేక
నీకు లేని పోని యాతనా కన్నెతీగా..
కన్నె తీగా.. కన్నె తీగా..
తీయనైన తాయిలాలు దాయలేక
నీకు పాలు పంచి పెట్టనా తేనెటీగా
తేనెటీగా తేనెటీగా
సయ్యంటు వస్తాను చేయూత నిస్తాను
వెయ్యేళ్ళ వియ్యాలతో
వయ్యారమిస్తాను ఒళ్ళోకి వస్తాను
నెయ్యాల సయ్యాటతో
బంధనాలే సాక్షిగా మంతనాలే చేయగా
మన్మధుణ్ణే మధ్యవర్తై
ఉండమందాం చక్కగా

పగలే వెన్నెలాయే జగమే మనదాయే
సెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయే
స్వాతి జల్లై అల్లుకో నేస్తమల్లే ఆదుకో
దాహమేసే దేహమిచ్చే స్వాగతాలే అందుకో

పగలే వెన్నెలాయే జగమే మనదాయే
సెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయే 

4 comments:

సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ అంత గొప్ప లాభాల్లో లేనప్పుడు పాతసినిమాల పేర్లతో, చాలా తక్కువ బడ్జెట్ లో కొన్ని సినిమాలు తీయడం జరిగింది. రాము, తోడికోడళ్లు, పరువు-ప్రతిష్ట లాంటివి. అన్నీ మూసకథలే. అప్పుటి రోజుల్లో బీట్ ఆధారిత పాటలు ప్రధానంగా ఆకర్షింపబడేవి. రాజ్-కోటి అందులో సిద్ధహస్తులు గనుక వాళ్లనే సంగీతానికి ఉపయోగించుకునేవారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కొత్తల్లో ఇలాంటి శృంగార సంబంధ పాటలు బోలెడు వ్రాసారు..తన మార్కు కాపాడుకుంటూనే. "మన్మధుణ్ణే మధ్యవర్తై ఉండమందాం చక్కగా" "దాహమేసే దేహమిచ్చే స్వాగతాలే అందుకో" "బాణమైనా గానమైనా తేనెకాటే తెలుసుకో" అన్న ప్రయోగాలు చమత్కారంగానూ గమ్మత్తుగానూ ఉంటాయి. పాటను పంచుకున్నందుకు థాంక్స్.

పాట గురించి ఆసక్తికరమైన సమాచారాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు భవానీప్రసాద్ గారు..

కనులు మూసుకుని వింటే బావుంటుందండీ..

హహహహ హండ్రడ్ పర్సెంట్ ట్రూ శాంతి గారు :-) థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.