గురువారం, నవంబర్ 29, 2018

ఒకే ఒక ఆశా...

సూరిగాడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సూరిగాడు (1992)
సంగీతం : వాసూరావ్
సాహిత్యం : భువనచంద్ర
గానం : బాలు, చిత్ర

ఆశా.. ఆ... ఆ...
ఒకే ఒక ఆశా అదే నా శ్వాసా
ఒకే ఒక ఆశా అదే నా శ్వాసా
కమ్మని కౌగిలి కోరితే.. దురాశ
తియ్యని పెదవులు కలిపితే.. ఓ నిషా
ఒకే ఒక ఆశా అదే నా శ్వాసా

చెదిరిన పైటకు బహుమతిగా
చిలిపి ముద్దులు అందించనా
నలగని పువ్వుల నవ్వులతో
వలపు సుద్దులు నేర్పించనా
కులుకులు తగవే నా అలకల చిలకా
గడబిడ తగునా నా మగసిరి మొలకా
పరువమే ఇలా.. ఇలా.. పిలిచె మరి

ఒకే ఒక ఆశా అదే నా శ్వాసా
ఒకే ఒక ఆశా...

మదనుడు మరచిన శరములేవో
వెలికి తీసా నీ కోసమే
చల్లని వెన్నెల పల్లకిలో
ఎదురుచూసా నీ కోసమే
తరగని కలలే రా రమ్మని పిలువా
త్వరపడి ఒడిలో చోటిమ్మని అడిగా
సొగసరి సరాసరి పదవె మరి

ఒకే ఒక ఆశా అదే నా శ్వాసా
కమ్మని కౌగిలి కోరితే.. దురాశ
తియ్యని పెదవులు కలిపితే.. ఓ నిషా
ఒకే ఒక ఆశా అదే నా శ్వాసా
ఒకే ఒక ఆశా అదే నా శ్వాసా


6 comments:

భువనచంద్ర గారి సాహిత్యమే ఇది. వాసురావుగారి సంగీతం కొత్తలో మంచి మెలోడియస్ గా ఉండేది. దాసరిగారి తన సినిమాలకు చాలా అవకాశాలిచ్చారు. అభిసారిక అన్న సినిమా కూడా ఈయన సంగీత దర్శకత్వంలోనే వచ్చినట్లు గుర్తు. ఈ పాటని పొరపాటున కూడా వీడియోలో చూడకూడదు. విని ఊరుకోవాలంతే. పాట పంచుకున్నందుకు ధన్యవాదాలు.

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..

థాంక్స్ భవానీ ప్రసాద్ గారు.. పోస్ట్ సరిచేశాను..

థాంక్స్ ప్రవీణ్ కుమార్ గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.