మంగళవారం, నవంబర్ 20, 2018

అలలు కదిలినా పాటే...

సీతామాలక్ష్మి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సీతామాలక్ష్మి (1978)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : వేటూరి
గానం : పి.సుశీల

అలలు కదిలినా పాటే ఆకు మెదిలినా పాటే
కలలు చెదిరినా పాటే కలత చెందినా పాటే
ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను
ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను
ఏ పాట నే పాడను...

ఏలుకుంటే పాట మేలుకుంటే పాట
పాడుకుంటే పాట మా దేవుడు
ఏలుకుంటే పాట మేలుకుంటే పాట
పాడుకుంటే పాట మా దేవుడు

శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో
శ్రీదేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం

ఆ సుప్రభాతాలు ఆ భక్తిగీతాలు
పాడకుంటే మేలుకోడు మమ్మేలుకోడు

ఏ పాట నే పాడను...
తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల
పాల కన్నా తీపి పాపాయికీ
తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల
పాల కన్నా తీపి పాపాయికీ

రామలాలీ మేఘశ్యామ లాలీ
తామరసనయన దశరథ తనయ లాలీ
రామలాలీ మేఘశ్యామ లాలీ
తామరసనయన దశరథ తనయ లాలీ

ఆ.ఆఆ.. ఆ రామలాలికి ఆ ప్రేమగీతికి
రాముడైన పాప ఇల్లాలికి... ఈ లాలికీ

ఏ పాట నే పాడనూ
బ్రతుకే పాటైన పసివాడనూ
ఏ పాట నే పాడనూ

చేరువై హృదయాలు దూరమైతే పాట
జంట బాసిన గువ్వ ఒంటి బ్రతుకే పాట
ఎందుకో ఎందుకో...
నా మీద అలిగాడు చెలికాడు
ఎందుకో నా మీద అలిగాడు చెలికాడు
ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు
నిదురకాచిన కంట కల అయిన కాలేడు
ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు
నిదురకాచిన కంట కల అయిన కాలేడు
గారాలు నీరాయే తీరాలు వేరాయే
మనసు మీరాలాయే వయసేటి పాలాయే

ఎందుకో ఎందుకో
నా మీద అలిగాడు చెలికాడు
కలలు చెదిరినా పాటే
కలత చెందినా పాటే
ఏ పాట నే పాడనూ... 

 

4 comments:

వేటూరివారి ప్రతి అక్షరమూ పాటే..

కాదనలేని మాట శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

వేటూరి గారు మాట్లాడిన పాటే, మౌనంగా ఉన్నా పాటే

చాలా కరెక్ట్ గా చెప్పారండీ.. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.