మంగళవారం, నవంబర్ 13, 2018

సందపొద్దు అందాలున్న...

తూర్పు వెళ్ళే రైలు చిత్రంలోని ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : తూర్పూ వెళ్ళే రైలు (1979)
సంగీతం : బాలు
రచన : జాలాది
గానం : బాలు, సుశీల

సందపొద్దు అందాలున్న చిన్నదీ
ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ
సందపొద్దు అందాలున్న చిన్నదీ
ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ
బొమ్మలా ముద్దుగుమ్మలా
పువ్వులా పాలనవ్వులా
మెరుపుతీగమల్లే తళుకుమంటే
ఈ అద్దాల ఒళ్ళంతా ముద్దాడుకోనా

సందపొద్దు అందాలున్న చిన్నదీ
ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ

ఆకతాయి బుల్లోడల్లే అల్లరెడితే
రాలుగాయి రాగాలన్ని రచ్చబెడితే
ఎవ్వరైన చూసారంటే అల్లరైపోతానయ్యో
ఎన్నెలంటి బతుకంతా చీకటైపోతాదయ్యో

దీపమల్లే నేనుంటాను తీపి రేపు తెస్తుంటాను
దీపమల్లే నేనుంటాను తీపి రేపు తెస్తుంటాను

కలవపువ్వు నీవై ఎలుగు నేనై
ఎలతేటి పాటల్లే చెలరేగిపోనా

ముత్తెమంటి ఒళ్ళు తడిసి ముద్దు పుడితే
గుండెలోన ఎండకాసి ఆరబెడితే
ఆశలారిపోకుండా ఊసులాడుకోవాలి
ఊసులెండిపోకుండా ఊట కోర్కెలుండాలి

గువ్వలాటి జోడుండాలి యవ్వనాల గూడెయ్యాలి
గువ్వలాటి జోడుండాలి యవ్వనాల గూడెయ్యాలి

నిన్ను నన్ను చూసి దిష్టి తీసి
ఆ లోకాల దేవుళ్ళే దీవించిపోవాలి


 
సందపొద్దు అందాలున్న చిన్నదీ
ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ
బొమ్మలా ముద్దుగుమ్మలా
పువ్వులా పాలనవ్వులా
మెరుపుతీగమల్లే తళుకుమంటే
ఈ అద్దాల ఒళ్ళంతా ముద్దాడుకోనా

సందపొద్దు అందాలున్న చిన్నదీ
ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ 
  

2 comments:

యెంత అందమైన పాట..

అవును శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.