దొంగలకు దొంగ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : దొంగలకు దొంగ (1977)
సంగీతం : సత్యం
సాహిత్యం : దాశరథి
గానం : సుశీల
ఈ రాతిరి ఓ చందమామా
ఎట్లా గడిపేదీ అయ్యోరామా
ఈ రాతిరి ఓ చందమామా
ఎట్లా గడిపేదీ అయ్యోరామా
చాటుగ నను చేరి
అల్లరి పెడుతుంటే
నీతో వేగేదెలా
ఈ రాతిరి ఓ చందమామా
ఎట్లా గడిపేదీ అయ్యోరామా
వెన్నెలతో నా ఒళ్ళంతా పెనవేసేవూ
గిలిగింతలతో ఉక్కిరిబిక్కిరి చేసేవూ
ఎవరైన చూసేరు ఎగతాళి చేసేరూ
నీతో గడిపేదేలా..
ఈ రాతిరి ఓ చందమామా
ఎట్లా గడిపేదీ అయ్యోరామా
నిన్ను చూసి లేత కలువ విరిసిందీ
తెల్లవార్లూ మోటు సరసం తగదందీ
ఒకసారి ఔనంటే వదిలేది లేదంటే
ఎట్లా తాళేదిరా..
ఈ రాతిరి ఓ చందమామా
ఎట్లా గడిపేదీ అయ్యోరామా
సంగీతం : సత్యం
సాహిత్యం : దాశరథి
గానం : సుశీల
ఈ రాతిరి ఓ చందమామా
ఎట్లా గడిపేదీ అయ్యోరామా
ఈ రాతిరి ఓ చందమామా
ఎట్లా గడిపేదీ అయ్యోరామా
చాటుగ నను చేరి
అల్లరి పెడుతుంటే
నీతో వేగేదెలా
ఈ రాతిరి ఓ చందమామా
ఎట్లా గడిపేదీ అయ్యోరామా
వెన్నెలతో నా ఒళ్ళంతా పెనవేసేవూ
గిలిగింతలతో ఉక్కిరిబిక్కిరి చేసేవూ
ఎవరైన చూసేరు ఎగతాళి చేసేరూ
నీతో గడిపేదేలా..
ఈ రాతిరి ఓ చందమామా
ఎట్లా గడిపేదీ అయ్యోరామా
నిన్ను చూసి లేత కలువ విరిసిందీ
తెల్లవార్లూ మోటు సరసం తగదందీ
ఒకసారి ఔనంటే వదిలేది లేదంటే
ఎట్లా తాళేదిరా..
ఈ రాతిరి ఓ చందమామా
ఎట్లా గడిపేదీ అయ్యోరామా
4 comments:
దాశరథి గారి సాహిత్యంలో వచ్చిన మంచి పాట. నెపమంతా చందమామ మీదకు నెట్టి....తనకిష్టమయిన సహచరునితో సరసాలాడే ప్రేయసి మనోగతాన్ని స్పృశించిన చమత్కారం. కళ్ళుమూసుకుని వింటే ఒక బ్రహ్మాండమయిన సోలోగా పొరబడే ప్రమాదం ఎంతయినా ఉంది. "హమ్ దోనోమ్ దో ప్రేమి" అన్న హిందీ గీతానికి ట్యూన్ పరంగా అనుసరణ. ఇంత మంచి అర్ధవంతమయిన గీతాన్ని సమాగమ శోభన పాటగా తీర్చిదిద్ది ఆ సాహిత్యానికున్న విలువను మొదలంటా నరికేసిన దర్శకత్వ భావదారిద్య్రం...కె.ఎస్.ఆర్.దాస్ గారిది.
నైస్ పిక్..
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
పాటల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు భవాని ప్రసాద్ గారు.. ఈ పాట వీడియో మొన్న ఈ పోస్ట్ ప్రిపేర్ చేసేపుడే మొదటిసారి చూసి నేనూ ఆశ్చర్యపోయానండీ. ఇన్నాళ్ళు సోలో సాంగ్ అనుకునే వినేవాడ్ని..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.