బుధవారం, నవంబర్ 28, 2018

కొలువైతివా రంగశాయి...

ఆనంద భైరవి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఆనంద భైరవి (1984)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : దేవులపల్లి
గానం : బాలు, జానకి

కొలువైతివా... రంగశాయి
హాయి.. కొలువైతివా... రంగశాయి
కొలువైన నిను చూడ.. కలవా కన్నులు వేయి
కొలువైన నిను చూడ.. కలవా కన్నులు వేయి


కొలువైతివా... రంగశాయి...

సిరి మదిలో పూచి తరచి రాగము రేపి
సిరి మదిలో పూచి తరచి రాగము రేపి
చిరునవ్వు విరజాజులేవోయి.. ఏవోయి...
చిరునవ్వు విరజాజులేవోయి.. ఏవోయి...

కొలువైతివా... రంగశాయి..

సిరి మోవి దమ్మికై మరి మరి క్రీగంట
సిరి మోవి దమ్మికై మరి మరి క్రీగంట
పరచేటి ఎలదేటులేవోయి... ఏవోయి
పరచేటి ఎలదేటులేవోయి... ఏవోయి

కొలువైతివా... రంగశాయి...

ఔరా.. ఔరౌరా...
ఔరా... ఔరౌరా...
రంగారు జిలుగు బంగారు వలువ సింగారముగ ధరించి
రంగారు జిలుగు బంగారు వలువ సింగారముగ ధరించి
వురమందు తులసి సరులంతు కలసి మణి అంతముగ వహించి
వురమందు తులసి సరులంతు కలసి మణి అంతముగ వహించి
సిస్తైన నొసట కస్తూరి బొట్టు ముస్తాబుగ ధరించి
సిస్తైన నొసట కస్తూరి బొట్టు ముస్తాబుగ ధరించి
ఎలదమ్మి కనుల ఎలదేటి కొనల తులలేని నెనరులుంచి
ఎలదమ్మి కనుల ఎలదేటి కొనల తులలేని నెనరులుంచి

జిలి బిలి పడగల శేషాహి తెలిమల్లె శయ్య శయనించి
జిలి బిలి పడగల శేషాహి తెలిమల్లె శయ్య శయనించి
ముజ్జగములు మోహంబున తిలకింపగ.. పులకింపగ
ముజ్జగములు మోహంబున తిలకింపగ.. పులకింపగ
శ్రీ రంగ మందిర నవసుందరా పరా
శ్రీ రంగ మందిర నవసుందరా పరా
శ్రీ రంగ మందిర నవసుందరా పరా

కొలువైతివా... రంగశాయి...
హాయి.. కొలువైతివా... రంగశాయి...
కొలువైన నిను చూడ.. కలవా కన్నులు వేయి
కొలువైన నిను చూడ.. కలవా కన్నులు వేయి
కొలువైతివా... రంగశాయి
 




3 comments:

గిరీష్ కర్నాడ్ ని ఈ మూవీ లో చూసి గొప్ప క్లాసికల్ డాన్సర్ కూడా అనుకునేవాళ్ళం..సినిమా అంటే మేక్ బిలీవ్ ప్రాసెస్ అని ఇటువంటి వారివల్లే అనిపిస్తుంటుంది..సచ్ యే గ్రేట్ ఆర్టిస్ట్..

అవును శాంతి గారు అమేజింగ్ ఆర్టిస్ట్.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

థాంక్స్ ప్రవీణ్ కుమార్ గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.