బుధవారం, నవంబర్ 07, 2018

కాంతి పూల పండగా...

మిత్రులందరకూ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండుగ రోజు ఇటీవల విడుదలైన బేవార్స్ అనే చిత్రంలోని ఒక చక్కని పాటను తలచుకుందాం. భాస్కరభట్ల గారు దీపావళిని కాంతిపూల పండగ అనడం నాకు చాలా నచ్చింది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బేవార్స్ (2018)
సంగీతం : సునీల్ కశ్యప్
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : హేమచంద్ర, దివ్య 

ప్రేమ చిటికెలు వేసే క్షణం
ప్రతి గుండె గలగల కోలాహలం
హాయి పిలుపులు తాకే క్షణం
ప్రతి రోజు మిల మిల బృందావనం
చీకట్లనే వదిలించేయగా
సంతోషమే వెలుగై వాలగా
పెదవంచు ప్రమిదల్లో నవ్వు కిలకిల

కాంతి పూల పండగా దీపావళి
కంటి పాప నిండుగా కాలమంత ఆగదా
ఆనంద కేళి గంతులేసి ఆడగా

తారా జువ్వల్లాగా
ఈ మనసు ఎగిరెనీ వేళా
తారలు దివ్వెల్లాగా ధగధగ
దారంత మెరిసెను చాలా

హే... ఊహలోనే ఉండిపోతే
వెళ్ళిపోదా జీవితం
చేతులారా అందుకుంటే
అంతులేని సంబరం
అరె ఎటుగాలి వీస్తుంటే అటువైపుగా
వెళ్ళిపోతే ఏముంది సరికొత్తగా
అనుకున్న దారుల్లో అడుగేయగా
అసలైన గెలుపొచ్చి ముద్దాడదా..

హే హే.. కాంతి పూల పండగా దీపావళి
కంటి పాప నిండుగా
హే కాలమంత ఆగదా
ఆనంద కేళి గంతులేసి ఆడగా
అనురాగం అల్లరి చేసేయ్
అనుబంధం చిందులు వేసేయ్
సరదాలకి తలపుల తీసేయ్
నడి రేయికి రంగులు పూసేయ్
పండగ పండగ పండగ
దీపావళి పండగా
పండగ పండగ పండగ
దీపావళి పండగా

హే చీకటేళ దీపమల్లె
వచ్చిపోవే వెన్నెలా
తళుకులీనె సొగసుతోటి
లాగుతావే నన్నిలా
నీలోనే కళకళలు చూడాలనీ
నీ చెంత చేరాను కావాలనీ
ఆ వెన్నముద్దల్లే వెలగాలనీ
నీకిచ్చుకున్నాను నా మనసునీ

హే హే.. కాంతి పూల పండగా దీపావళి
కంటి పాప నిండుగా కాలమంత ఆగదా
ఆనంద కేళి గంతులేసి ఆడగా
నీ చుట్టూ భూచక్రంలా
తిరిగానే నిజమా కాదా
విరజిమ్మే నవ్వులు చూస్తే
ఎదగూటికి పున్నమి రాదా  
పండగ పండగ పండగ
దీపావళి పండగా
పండగ పండగ పండగ
దీపావళి పండగా 


4 comments:

థాంక్స్ రాజ్యలక్ష్మి గారు మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు.

వేణూజీ మీకూ మీ కుటుంబ సభ్యులకూ బిలీటెడ్ దీవాలి శుభాకాంక్షలు..

థాంక్స్ శాంతి గారు.. మీకు మీ కుటుంబసభ్యులకు కూడా దీపావళి శుభాకాంక్షలు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.